Gunde Ninda Gudi Gantalu Weekly: బాలుకి ఎదురుతిరిగిన శ్రుతి.. ప్రభావతి పరువు గోవిందా.. ఇక మీనానే దిక్కు..

Gunde Ninda Gudi Gantalu Weekly: గుండె నిండా గుడి గంటలు సీరియల్ గతవారం అంటే జనవరి 13వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకు ప్రసారమైన 'గుండె నిండా గుడి గంటలు'సీరియల్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో.. ఓ లుక్కేయండి మరి!

సోమవారం జనవరి 13వ తేదీన ఎపిసోడ్ లో సోమవారం ఎపిసోడ్ లో శృతి, రవి ఇంటికి చేరుకుంటారు. కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మని ప్రభావతి శృతికి చెప్పగా.. ఏ కాలు అయితే ఏంటి? తింగరి సమాధానం ఇస్తుంది. కుడి పెట్టి అత్తగారి ఇంట్లో కాలు పెట్టడం సంప్రదాయమని చెబుతోంది.శ్రుతి తల్లి ఇంట్లోకి రాకుండా సురేంద్ర బయటనే ఉన్నాడని చెబుతుంది. దీంతో సత్యం .. సురేంద్ర దగ్గరికి వెళ్లి రమ్మని అడుగుతాడు. తాను రాలేదని తిరస్కరిస్తాడు.

Gunde Ninda Gudi Gantalu last week roundup story january 13th to january 17th Episodes highlights

మరోవైపు తనని రూంలో వేసి లాక్ వేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. రవి,శ్రుతిలను ఇంట్లోకి రానివ్వడంపై మండిపడతాడు. దీంతో ఎలాగైనా ప్రభావతి కుటుంబాన్ని విడగొట్టాలని, రవిని వారి కుటుంబంలో నుండి వేరు చేయాలని భావిస్తుంది శోభ. ఆ తరువాత శ్రుతిని దీపం వెలిగించమంటే కూడా తింగరి ప్రశ్నలతో విసిగిస్తోంది. తాను ఎప్పుడు మ్యాచ్ బాక్స్ వెలిగించలేదని, తనకు వంట చేయడం కూడా రాదని, పెళ్లికి ముందు తన తల్లి చేసి పెట్టేదని, ప్రస్తుతం రవి వంట చేసి పెడుతున్నాడని అంటుంది. దీంతో రవి సిగ్గుతో తలదించుకుంటాడు.

మంగళవారం జనవరి 14 వ ఎపిసోడ్ లో రవి, శృతిల కలిసి పాలు తాగాలని, కలిసి తినాలని చెబుతోంది ప్రభావతి. తనకు ఇలాంటి వింత ఆచారాలు, కట్టుబాటు నచ్చవనీ నిర్మొహమాటంగా ప్రభావతికి చెబుతుంది శ్రుతి. శృతి ప్రవర్తనను గమనించిన రంగా.. ఆ అమ్మాయితో కాస్త జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు.. మీనాతో శృతి క్లోజ్ గా ఉండడానికి ప్రభావతి తట్టుకోలేక పోతుంది. దీంతో మీనాకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. కొత్త కోడలిపై ఎనలేని ప్రేమను కురిపించడంతో రోహిణికి కూడా మింగుడుపడదు. ఇదిలాఉంటే.. ఓ విషయంలో తల్లి ముందే రవిని చితకబాదుతుంది శ్రుతి. దీంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అనంతరం నువ్వు ఇంట్లోకి అడుగుపెట్టడానికి.. తాను ఎంత కష్టపడ్డానోనని ప్రభావతి అనగా.. మీరేం చేశారు. మీనా వల్లనే తాను ఇంట్లోకి వచ్చానని ప్రభావతి పరువు మొత్తం తీస్తోంది. తనను ఓ పెద్ద ప్రమాదం నుండి కాపాడిందని, అలాగే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి నా గురించి మాట్లాడిందనీ చెబుతుంది. ఆ తర్వాత రోహిణి గురించి లేనిపోని గొప్పలు చెబుతుంది ప్రభావతి. రోహిణి వాళ్ళ నాన్నకు ఫారెన్ లో పెద్ద పెద్ద బిజినెస్ ఉన్నాయని, అమెరికాలో ని ట్విన్స్ టవర్స్ రోహిణి వాళ్లేయేనని లెనీపోని గొప్పలు చెబుతోంది ప్రభావతి. దీంతో శృతి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

బుధవారం జనవరి 15న ఎపిసోడ్ లో అమెరికాలోని ట్విన్స్ టవర్స్ ఎప్పుడో కూలిపోయాయి కదా అత్తమ్మ అనడంతో అలాంటి పెద్ద బిల్డింగ్స్ రోహిణి వాళ్ళ నాన్నకు ఉన్నాయని కవరింగ్ చేసుకుంది. మరోవైపు తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని రోహిణి తెగ టెన్షన్ పడుతోంది. రవి,శ్రుతి లకు సంప్రదాయ బద్దంగా శోభనం నిర్వహించాలని, అందుకు బాలు రూం ఇవ్వమని అడుగుతోంది ప్రభావతి. ఈ విషయం తెలిస్తే.. బాలు అస్సలు ఒప్పుకోడని, ఎక్కువగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాడని ప్రభావతిని హెచ్చరిస్తోంది మీనా. ఎలాగైనా బాలును ఒప్పించి శోభనానికి గదిని సిద్ధం చేయమని ప్రభావతి అంటుంది. దీంతో మీనా చేసేది ఏమి లేక బాలుకి తెలియకుండా.. రూమ్ డెకరేట్ చేస్తుంది పూలతో గదిని అలంకరిస్తుంది. సడెన్ గా బాలు వచ్చి రూమ్ ను చూసి.. తనకే శోభనం ఫిక్స్ చేశారేమోనని తెగ సంబురపడిపోతాడు. కానీ, శృతి రవి శోభనం కోసం ఏర్పాట్లు చేశారని తెలియడంతో మండిపడతాడు బాలు. దీంతో ప్రభావతి మళ్లీ మీనా ను రిక్వెస్ట్ చేస్తుంది. కుటుంబం పరువు పోకుండా చూడమని ప్రాధేయపడుతోంది.

Gunde Ninda Gudi Gantalu last week roundup story january 13th to january 17th Episodes highlights

గురువారం జనవరి 16న ఎపిసోడ్ లో రవి, శృతిల శోభనానికి ఎలాంటి అడ్డంకులు రాకుండా, బాలు ఇలాంటి గొడవలు చేయకుండా ఆ దేవుని ప్రార్థిస్తుంది. ఇంతలోనే రవి వస్తాడు. తమ లాగేజ్ ఎక్కడ పెట్టుకోవాలని అడగగా.. బాలు రూమ్ లో పెట్టుకోమ్మని చెబుతుంది ప్రభావతి. ఈ రోజు మీరు ముహూర్తం పెట్టమని ప్రభావతి చెబుతుంది. కానీ, ఆ విషయం శ్రుతికి అర్థం కాదు. దీంతో రోహిణి మీకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేసామని చెబుతుంది. ఈ విషయం చెప్పడానికి ఇంత మొహమాట పడాలా.. అంటూ నవ్వుతోంది. ఆ తరువాత శ్రుతికి రోహిణి శారీ కడుతుండగా.. మలేషియాలో మీ ఇల్లు ఎక్కడ ఉంటుందని రోహిణి ప్రశ్నిస్తుంది. తన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారనీ శ్రుతి అంటుంది. లిప్ స్టిక్ పెట్టాలని నోరు మూసుకోమంటుంది. ఆ తర్వాత మీనా గురించి మాట్లాడుతూ.. బాలు లాంటి మొండి వాడితో మీనా ఎలా ఉంటుందో.. వారికి డైవర్స్ ఇప్పిద్దాం అంటుంది. దీంతో రోహిణి షాక్ అవుతుంది. ఇంతలోనే మనోజ్ అక్కడికి చేరుకుని టాపిక్ డైవర్ట్స్ చేస్తాడు.

శుక్రవారం జనవరి 17న ఎపిసోడ్ లో శృతి,రవి ల శోభనం ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. పాలు వేడి చేయమని, అందులో బాదం, పిస్తా, జీడిపప్పు అన్ని బాగా మిక్స్ చేసి మీనాకు అని ఆర్డర్ వేస్తుంది ప్రభావతి. ఇంతలోనే బాలు కిచెన్ లోకి వెళ్లి స్పెషల్ గా రెడీ చేసిన పాలను తాగుతాడు బాలు. ఈ విషయం ప్రభావతి చేయడంతో షాక్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి రా దేవుడా అని ప్రభావతి బాధపడుతుంది. పాలు తీసుకురమ్మని మనోజ్ రిక్వెస్ట్ చేయగా.. తనకు నిద్ర వస్తుందని వెళ్లిపోతాడు. మరో వైపు బాలు, రవిలు మిద్దెపై మాట్లాడుకుంటారు. కుటుంబం పరువు రోడ్డు మీద పడేసి, ఇప్పుడు వచ్చి.. ఏ ముఖం పెట్టుకొని శోభనం చేసుకుంటున్నావ్ అని రవిని నిందిస్తాడు బాలు. తాను ప్రతి విషయంలోనూ చెప్పాలని ప్రయత్నించినా.. కానీ నువ్వే అడ్డుపడ్డావని బాలు పైకి రివర్స్ అవుతాడు రవి. ఇంతలోనే మనోజ్ వచ్చి, రవికి సపోర్టుగా మాట్లాడి కిందికి తీసుకెళ్లాడు. దీంతో బాలు కోపంతో ఈ రోజు శోభనం ఎలా జరుగుతుందో చూస్తానని తన గదికి లాక్ చేసుకుని వెళ్లిపోతాడు బాలు. ఈ విషయం తెలిసి ప్రభావతి మరోసారి షాక్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X