Gunde Ninda Gudi Gantalu Weekly: ప్రభావతికి పరువు గోవిందా.. మీనాకు వార్నింగ్.. రెచ్చిపోయిన బాలు..

Gunde Ninda Gudi Gantalu Weekly: గుండె నిండా గుడి గంటలు సీరియల్ గతవారం అంటే జనవరి 20వ తేదీ నుంచి జనవరి 24వ తేదీ వరకు ప్రసారమైన 'గుండె నిండా గుడి గంటలు'సీరియల్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో..ఓ లుక్కేయండి మరి!

సోమవారం జనవరి 20వ తేదీన ఎపిసోడ్ లో బాలు శోభనం గదికి తాళం వేసుకొని వెళ్లడంతో ప్రభావతి కంగారుపడుతుంది. ఇలాగైనా బాలుని రప్పించి లాక్ ఓపెన్ చేయమని మీనా ను అడుగుతుంది. దీంతో మీనా బాలు కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెబుతుంది కానీ బాలు తాను లేనని అబద్ధం చెప్తాడు దీంతో సత్యం ఇన్వాల్వ్ అయి బాలుని ఇంటికి రమ్మని ఆర్డర్ ఇస్తాడు. తండ్రి మాట కాదని లేక ఇంటికి వచ్చి తాళం ఇచ్చేస్తాడు.‌ ఆ తర్వాత రవి శృతి తమ అత్తమామ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. మనోజ్, రోహిణి వద్ద కూడా ఆశీర్వాదం తీసుకుంటారు కానీ బాలు దగ్గరికి వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకోవడం శృతికి ఇష్టం ఉండదు. అలాగే బాలు కూడా వారిని ఆశీర్వదించడం నచ్చదు. కానీ సత్యం మాట కాదనలేక వారిని ఆశీర్వదిస్తాడు బాలు. ఇప్పటినుండి అందరూ కలిసి మెలిసి ఉండాలని, ఇకనుండి తప్పులు చేయకుండా మెదలమని సత్యం సలహా ఇస్తాడు. తాము ఇలాంటి తప్పులు చేయలేదని, తాము ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని బదిలిస్తుంది. తన తండ్రికి ఎదురు మాట్లాడడంతో బాలుకి కోపం వస్తుంది. అలాగే తమ పెళ్ళి విషయంలో మీనాకు ఎలాంటి సంబంధం లేదని, మీనా ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుందని తమ తమ పెళ్ళికి తీసుకువెళ్లామని క్లారిటీ ఇస్తుంది శృతి. అందరూ ఇలా కలిసి ఉండటం తనకు సంతోషంగా ఉందని సత్యం అంటాడు.

Gunde Ninda Gudi Gantalu last week roundup story january 20th to january 24th Episodes highlights

మంగళవారం జనవరి 21వ ఎపిసోడ్ లో సత్యం తమని ఇంట్లోకి రానివ్వడంతో శృతి తన మామయ్యను హగ్ చేసుకుంటుంది. శృతి ప్రవర్తనతో ఇంటిల్లిపాది షాక్ అవుతారు. ఆ తర్వాత రవి శృతి శోభనం గదిలోకి వెళ్లిపోతారు. తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఈరోజు కోసం ఎంతో ఎదురు చూశానని అంటాడు రవి. ఆ తరువాత రవి మాటలు మానేసి రొమాన్స్ లోకి దిగిపోతాడు. మరోవైపు బాలు ఒంటరిగా దాబా పై పడుకొని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈ లోపు మీనా వస్తుంది. ఆ శృతి చూసావా.. అందరి ముందు మా నాన్నను హగ్ చేసుకుంది. అదే పద్ధతి అని బాలు ఫైర్ అవుతాడు. మరోవైపు.. ప్రభావతి ఎప్పుడు లేని విధంగా తన గదిలోకి కొత్త పెళ్లి కూతురులా.. సిగ్గుపడుతూ పాలు పట్టుకొని వస్తుంది. తన శోభనం రోజు రాత్రి గుర్తుకు చేసుకొని తెగ ఫీల్ అవుతుంది ప్రభావతి. మరోవైపు.. రోహిణి పాలు తీసుకుని రూమ్ లోకి వెళుతుంది. దీంతో మనోజ్ శోభనం రోజు రాత్రిని గుర్తు చేసుకుంటూ ఊహల్లో తేలిపోతుంటాడు. మరోవైపు బాలు మెడపై ఒంటరిగా పడుకోలేక ఇబ్బంది పడతాడు. కిందికి వచ్చి హాల్లో పడుకున్న మీనా ను లేపి.. మరి దాబా పైకి తీసుకువెళ్తాడు.
Gunde Ninda Gudi Gantalu last week roundup story january 20th to january 24th Episodes highlights

బుధవారం జనవరి 22న ఎపిసోడ్ లో మౌనిక తన అన్నయ్య ఇచ్చిన గాజులను చూసుకుంటూ సంతోషం పడుతుంది. ఆ విషయాన్ని గమనించిన సంజూ గాజులు ఎవరిచ్చారు అంటూ నిలదీస్తాడు. సంజు తల్లి వచ్చి ఆ గాజులు నేనే ఇచ్చా అంటూ అక్కడి నుండి తీసుకు వెళుతుంది. ఇక తెల్లవారగానే మీనా వంటింట్లో బిజీబిజీగా ఉంటుంది. ప్రభావతి వచ్చి రెండు కప్పుల కాపీ పెట్టమని చెబుతోంది. ఆ కాఫీ కంగారు కంగారుగా తీసుకొని వెళ్తుంది. కానీ, శృతి డబ్బింగ్ స్టూడియో మార్నింగ్ వెళ్ళిపోయిందని షాక్ అవుతుంది. తనకు చెప్పకుండా ఎలా వెళ్లిందనీ, తనను శృతి పట్టించుకోవడంలేదని ప్రభావతి ఫీల్ అవుతుంది. కొన్ని విషయాలను చూసి చూడనట్లు పట్టించుకోనట్లు ఉండాలని సత్యం చెబుతాడు. ఈ విషయం కోడళ్లకు తెలిస్తే తన పరువు ఎక్కడ పోతుందోనని, తనకు రాత్రి ఇంగ్లీషులో చెప్పిందని కవరింగ్ చేస్తుంది. కానీ, మర్నింగ్ సడన్ గా డబ్బింగ్ స్టూడియో నుండి ఫోన్ వస్తే తన కూడా చెప్పకుండా వెళ్ళింది కదా నీకెలా రాత్రి చెప్పింది అని రవి నోరు జారుతాడు. దీంతో కోడలు ముందు ప్రభావతి పరువు పోతుంది.

గురువారం జనవరి 23న ఎపిసోడ్ లో బాలు పొద్దున లేవగానే తన రూమ్ లోకి వెళ్లి .. రవిని బయటకు వెళ్ళిపోమనీ, లగేజ్ మొత్తం తీసి బయట పారేస్తాడు బాలు. ఇంకోసారి గదిలో కాలు పెడితే చంపేస్తా అంటూ రవికి వార్నింగ్ ఇస్తాడు. దీంతో రవి సైలెంట్ గా కిందికి వెళ్లిపోతారు. ఆ తరువాత మీనాను రూమ్ లోకి రమ్మని తన వస్తువులు తీసుకొని బయటకు వెళ్ళమని చెబుతాడు. తరువాత తన రూమ్ కు తాళం వేసుకుని వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రవి,శృతి వాళ్లు ఎక్కడ ఉండాలని ప్రశ్నించగా.. ఆ విషయం వాళ్లను ఇంటికి తీసుకొచ్చేముందే ఆలోచించాలని అంటాడు. అయినా రవిగాడిని ఇంట్లోకి ఎలా రానిచ్చావ్ అని నిలదీస్తాడు. తాళం ఇవ్వమని మీనా రిక్వెస్ట్ చేసిన బాలు ఇవ్వకుండా వెళ్ళిపోతారు. బాలు అన్న మాటలకు రవి బాధపడుతూ బయటకు వెళ్ళిపోతాడు. బాలు చేసిన పనికి మీనా పై ప్రభావతి రెచ్చిపోతుంది. తాను ఇంట్లో నుంచి వెళ్లిపోతానని రవి అన్నడంతో.. ఇంట్లో ఎవరు.. ఎక్కడ ఉండాలో తన బాగా తెలుసు సాయంత్రం లోగా తాను అన్ని సెట్ చేస్తానని రవి మాట ఇస్తుంది ప్రభావతి.

Gunde Ninda Gudi Gantalu last week roundup story january 20th to january 24th Episodes highlights

శుక్రవారం జనవరి 24న ఎపిసోడ్ లో ఒక రోజు మొగుడు పక్కన లేకుండా ఉండలేవా.. రూమ్ కు తాళం వేసుకొని వెళ్లిమని చెప్పింది నువ్వే.. మొగుడ్నికొంగుకు కట్టేసుకున్నావ్ ' అంటూ మీనాను నానా మాటలు అంటుంది ప్రభావతి.దీంతో హార్ట్ అయినా మీనా ఏడ్చుకుంటూ బయటికి వెళ్లిపోతుంది. ఈ విషయాన్ని చెప్పాలని బాలుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. మరోవైపు రవి.. శృతి డబ్బింగ్ స్టూడియోకు వెళ్లి.. ఇంట్లో జరిగిన గొడవ గురించి చెబుతాడు. తాను ఇలా జరుగుతుందనీ ముందే ఊహించాననీ, వాళ్ళు రూమ్ లో వాళ్లు ఉండటమే న్యాయమని రవికి సర్ది చెబుతోంది. మరోవైపు మీనాను వెతుక్కుంటూ ప్రభావతి వచ్చి.. శృతి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే.. నీకు కూడా ఇంట్లో చోటు ఉండదంటూ వార్నింగ్ ఇస్తుంది. దీంతో మీనా బాలుకు కంటిన్యూస్గా ఫోన్ చూస్తుంటుంది. బాలు ఫోన్ లిఫ్ట్ చేయడంతో అర్జెంట్ గా ఇంటికి రమ్మని ఏడుస్తుంది. దీంతో కంగారుగా బాలు ఇంటికి చేరుకుంటాడు. బాలు రాగానే ..రూమ్ కు ఎందుకు తాళం వేసుకొని వెళ్లావ్? అని ప్రభావతి రెచ్చిపోతుంది. మేము మాత్రమే అడ్జస్ట్ కావాలా.. అదే రెండు రోజులు మనోజ్ కాదు ఇవ్వొచ్చు కదా.. అనవసరంగా నా మీద ఎందుకు నిందలు వేస్తున్నారని బాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X