Gunde Ninda Gudi Gantalu Weekly: నెరవేరిన బాలు కల.. శోభన కన్నింగ్ ప్లాన్.. ప్రభావతికి శ్రుతి షాక్..

Gunde Ninda Gudi Gantalu Weekly: గుండె నిండా గుడి గంటలు సీరియల్ గతవారం అంటే జనవరి 6 వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు ప్రసారమైన 'గుండె నిండా గుడి గంటలు'సీరియల్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో.. ఓ లుక్కేయండి మరి!

సోమవారం జనవరి 6 వ తేదీ ఎపిసోడ్ లో సోమవారం ఎపిసోడ్లో ఎన్నో ఆశలతో మౌనిక శోభనం గదిలోకి ఎంట్రీ ఇస్తుంది. కానీ సంజూ తాగుతూ ఉండడంతో షాక్ అవుతుంది. ఆ తర్వాత అసలు విషయాన్ని బయటపడతాడు సంజు. మీ అన్నయ్య ఒక్కడే సరిగ్గా నన్ను అర్థం చేసుకున్నాడని, మీ ఇంట్లో వారిపై పగ తీర్చుకోవడానికి తనని పెళ్లి చేసుకున్నాను చెబుతాడు. ఈ విషయం తన అన్నయ్యకు చెబితే .. ముక్కలు ముక్కలుగా నరికేస్తాడని వార్నింగ్ ఇస్తుంది మౌనిక. నాకు కావలసింది కూడా అదే.. మీ అన్నయ్య జైలుకు వెళ్లాలి. మీ నాన్నకు హార్ట్ ఎటాక్ రావాలి, మీ ఇల్లు మొత్తం రోడ్డున పడాలి అంటూ తన ప్రాణం చెప్పేస్తాడు సంజు. ఈరోజు నుండి రోజుకు శిక్ష వేస్తా అంటూ మౌనికకు షాక్ ఇస్తాడు. మరోవైపు బాలు ఇంటికి రాగానే ప్రభావతి గొడవ ప్రారంభిస్తుంది. ఇంట్లో నుండి వెళ్లిపోవాలని మండిపడుతుంది. సత్యం తన ఉగ్రరూపం చూపిస్తాడు. సైలెంట్ గా బాలుని ఇంట్లోకి వెళ్లి ముందు చెప్తాడు. బాలు తన చెల్లెల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు.

Gunde Ninda Gudi Gantalu last week roundup story January 6th to January 10th Episodes highlights

మంగళవారం జనవరి 7 వ తేదీ ఎపిసోడ్ లో తన చెల్లెలు జీవితాన్ని తలుచుకుంటూ బాలు భయపడతాడు. తాను తన చెల్లెలు పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నానని, ఓ మంచి వాడికి ఇచ్చి పెళ్లి చేసుకోవాలని, తాను తన చెల్లికి చేయించిన బంగారు గాజులు మీనాకు చూపిస్తాడు. దీంతో అంతా మంచే జరుగుతుందని మీనా బాలుకి ధైర్యం చెబుతుంది. మరోవైపు సుశీలమ్మ ఇంటికి వెళ్తూ బాలుని జాగ్రత్తగా చూసుకోమని మీనాకు చెప్పి వెళుతుంది. మరోవైపు సత్యం తో మాట్లాడుతూ రవి, శృతి లను ఇంటికి తీసుకురమ్మని సలహా ఇస్తుంది. ఇక మౌనిక పరిస్థితి దినదిన గండం.. రోజుకో గొడవల గా మారుతుంది. తెల్లవారి లేవగానే సంజు మౌనికపై విరుచుకో పడతాడు. మౌనిక తెచ్చిన కాఫీ తాగకుండా.. దాని పారపోసి అదే కప్పులో మందు పోసుకుని తాగుతాడు. మరోవైపు.. టార్చర్ చేస్తున్నట్టు బాలుకి పీడకల పడుతుంది. వెంటనే ఉలిక్కిపడి లేచి.. తాను తన చెల్లెలు దగ్గరికి గొడవ చేస్తాడు. కానీ ప్రభావతి అందుకు అడ్డు చెబుతుంది.

బుధవారం జనవరి 8 వ తేదీ ఎపిసోడ్ లో బాలుని తన చెల్లెలి ఇంటికి వెళ్లకుండా ప్రభావతి అడ్డుకుంటుంది. ఇంతలోనే సత్యం వచ్చి.. తన అనుభవంతోనే చెబుతున్నానని, మౌనిక అక్కడ బాగానే ఉంటుందని చెప్పి బాలుని కన్విన్స్ చేస్తాడు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దని, మౌనిక కూడా లోకజ్ఞానం తెలుసు మంచి చెడు ఏంటో అర్థం చేసుకోగలదని మీనా కూడా చెబుతుంది. దీంతో బాలు కాస్త శాంతిస్తాడు. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి బాలు టిఫిన్ చేయడానికి వస్తాడు. ఇంతలో ప్రభావతి కూడా అక్కడికి వచ్చి మరోసారి బాలుని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. దీంతో సత్యం కలుగజేసుకుని.. ఆ గొడవను అక్కడితో ఆపేస్తాడు. ఆ తర్వాత తామిద్దరం గుడికి వెళ్తున్నామని మీనా చెబుతోంది. గుడికే వెళ్తున్నారా.. మారేటైనా వెళ్తున్నారా అని మరోసారి ప్రభావతి నోరు పారేసుకుంటుంది. తాను మౌనిక దగ్గరికి వెళ్లొద్దు అంటే నువ్వు కూడా రవి నీ కలవడానికి వెళ్లొద్దంటూ బాలు దిమ్మతిరిగే కండిషన్ పెడతాడు.

గురువారం జనవరి 9 వ తేదీ ఎపిసోడ్ లో ఎలాగైనా ప్రభావతికి తన కొడుకులను దూరం చేయాలని శోభ కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. తాను ఎంతగా బాధ అనుభవిస్తున్నానో.. ప్రభావతి కూడా ఆ బాధ భరించాలని, తన పగ తెచ్చుకోవాలని భావిస్తుంది. మరోవైపు బాలు మీనా గుడికి వెళ్తారు. అదే గుడికి సంజు, మౌనిక కూడా వస్తారు. మౌనిక ఒకసారి తన అన్యాయం చూసి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత తన అన్నయ్యను సంజు కు తెలియకుండా కలుస్తుంది. ఆ సమయంలో బాలు తన చెల్లెలు బంగారు గాజులు వేస్తాడు. ఎలా చూసుకుంటున్నాడని అడగగా అసలు విషయం బయట పెట్టకుండా.. తాను బాగానే ఉన్నానని కవరింగ్ చేస్తుంది మౌనిక. తన చెల్లెలు సంతోషంగా ఉందని భావించిన బాలు కాస్త ఆందోళన తగ్గించుకుంటాడు. ఏ కష్టం వచ్చినా తనకు చెప్పమని మౌనిక కూడా ధైర్యం చెబుతాడు. మరోవైపు ప్రభావతి రవి దగ్గరికి వెళ్తుంది. అందులోనే శోభ కూడా తన కూతురు దగ్గరికి వస్తుంది. శృతిని ఇంటికి తీసుకెళ్తానని, అయితే.. మీ కూతురిని మీరే.. ఇంటికి తీసుకురావాలని ప్రభావతి చెప్పడంతో శోభ కూడా అంగీకరిస్తుంది. దీంతో శృతి కాస్త ఇబ్బంది పడుతుంది. కానీ తన తల్లి మాట కాదనలేక అందుకు ఓకే చెబుతుంది. దీంతో ప్రభావతి ఊహల్లో విహరిస్తుంది.

Gunde Ninda Gudi Gantalu last week roundup story January 6th to January 10th Episodes highlights

శుక్రవారం జనవరి10 వ తేదీ ఎపిసోడ్ లో రవి శృతి ఇంటికి వస్తున్నారని కంగారుపడుతోంది. ఆ విషయం ఎవరికీ చెప్పకుండా దాచిపెడుతోంది. బాలు ఉంటే.. తన ప్లాన్ వర్క్ అవుట్ కాదని ఎలాగైనా బాలుని ఇంట్లో నుండి పంపించాలని భావిస్తుంది ప్రభావతి. బాలు ఇంటికి రాగానే ఎన్నడూ లేని విధంగా కానీ దగ్గరుండి తన కొడుకు కు టిఫిన్ వడ్డిస్తుంది. ఎక్కలేని ప్రేమ కురిపిస్తుంది. తన తల్లి ఎన్నడూ లేని విధంగా తనపై ప్రేమ కురిపించడంతో బాలుకి అనుమానం వస్తుంది. తనకు స్టమక్ అప్సెట్ అయిందని బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతాడు. బాలు ఉంటే తన మాటలు సాగని గ్రహించిన ప్రభావతి.. బాలు రూమ్ లోకి వెళ్ళగానే లాక్ చేస్తుంది. ప్రభావతి కంగారు గమనించిన సత్యం అసలేం జరుగుతుందని ఆరా తీస్తాడు. ఇంతలోనే శృతి , రవి ఇంటికి చేరుకుంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X