Gunde Ninda Gudi Gantalu Weekly: తల్లైన మీనా.. బాలుకు కొత్త టెన్షన్.. ప్రభావతికి నిజం తెలియడంతో!
చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూలై 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే లుక్కేయండి మరి!
22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
22వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. బాలు, మనోజ్ వాళ్లను కలిపేందుకు రవి తన రెస్టారెంట్‌కు రెండు జంటలను పిలుస్తాడు. అప్పుడు మనోజ్, రోహిణి అక్కడ లంచ్ చేస్తూ బాలు, మీనాను అవమానిస్తూ మాట్లాడుతుంటారు. అప్పుడు మనోజ్ 40 లక్షలు తీసుకుని పారియపోయిన విషయాన్ని రోహిణికి చెప్తాడు. ఆ సమయంలో మనోజ్ తన తండ్రి సత్యం గురించి నోటికి వచ్చినట్లు తిడుతుంటాడు. అది తట్టుకోలేకపోయిన బాలు.. టేబుల్‌పై ఉన్న ఫోర్క్ తీసుకుని అతడి చేతిపై పొడుస్తాడు. దీంతో వాళ్లు కంగారుగా ఆస్పత్రికి వెళ్తారు. ఆ తర్వాత ఇంట్లో పంచాయతీ పెట్టగా.. అక్కడ మీనాకు, రోహిణికి గొడవ జరుగుతుంది.

23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
23వ తేదీ మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. మనోజ్, బాలు మధ్య జరిగిన గొడవకు ఇంట్లో పంచాయతీ జరుగుతుంది. ఆ సమయంలోనూ అందరూ కలబడుతూ ఉంటారు. దీంతో సత్యం అన్నదమ్ములు ముగ్గురు, తోడికోడళ్లు ఇద్దరూ కలిసి ఉండాలని చెప్తాడు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత బాలు బాధపడుతుంటే మీనా ఓదార్చాలని చూస్తుంది. కానీ, అతడు చేపల వేపుడు మిస్ అయ్యానని అనడంతో షాక్ అవుతుంది. ఇక, మనోజ్.. రోహిణికి నిజం తెలిసిందని కంగారు పడుతుంటాడు. అప్పుడు ఆమె వచ్చి కల్పన గురించి నిజం చెప్పమని అటుంది. కానీ, మనోజ్ మాత్రం తప్పించుకునేందుకు అబద్ధాలే చెబుతాడు.
24వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
24వ తేదీ బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. రోహిణి ఓట్స్ ఉప్మా చేయడంతో అది తినాలో తాగాలో తెలియక మనోజ్, ప్రభావతి ఇబ్బంది పడుతుంటారు. అప్పుడు అది చూసిన బాలు తెగ పంచులు వేస్తుంటాడు. మధ్యలో కామాక్షి అక్కడకు రావడంతో ఆమెకు రోహిణి ఉప్మా ఇస్తుంది. కానీ ఆమె తప్పించుకుంటుంది. తర్వాత రోహిణి కోసం మనోజ్ ఆమె పార్లర్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఓ కస్టమర్ వాళ్లను హనీమూన్‌కు దుబాయ్ వెళ్లమని, ఆ ఖర్చులన్నీ తానే పెట్టుకుంటానని అంటుంది. ఇక, సుమతి వచ్చి మీనాతో మాట్లాడగా.. అవన్నీ విన్న ప్రభావతి నోటికి వచ్చినట్లు తిడుతుంది. దీంతో మీనా గుడికి వెళ్లిపోతుంది.

25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
25వ తేదీ గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. మీనా గుడిలో ప్రదక్షిణలు చేస్తుండగా వెళ్లిన బాలును పార్వతమ్మ, సుమతి ప్రశ్నిస్తారు. దీంతో బాలు మీనాను అడ్డుకుని ఏమైందని అడుగుతాడు. కానీ, ఆమె మాత్రం మాట్లాడదు. అప్పుడు పంతులు వచ్చి మీనాకు చాలా బాధ ఉందని చెప్తాడు. దీంతో బాలు ఆమెను ఇంటికి తీసుకెళ్తి తల్లికి వార్నింగ్ ఇస్తాడు. తర్వాత బాలు లేని సమయంలో ప్రభావతి.. మీనాను వంట చేయమని తిడుతుంది. ఇక, మీనా నీరసంగా పడుకున్నా ప్రభావతి ఇబ్బంది పెట్టడంతో బాలు వచ్చి ఆమెకు సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. తర్వాత భార్యకు ప్రేమగా అన్నం తినిపిస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
26వ తేదీ శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. బయట వర్షం పడుతుండడంతో బాలు టెంప్ట్ అయిపోతాడు. దీంతో మీనాతో తొలిసారి రొమాన్స్ చేస్తాడు. ఇది ప్రభావతికి కలలా వస్తుంది. దీంతో వాళ్ల మధ్య అంతా జరిగిపోయిందని ఆమె కంగారు పడుతుంటుంది. ఆమె అనుకున్నట్లుగానే మీనా ఉదయాన్నే లేవగానే యమా జోష్‌తో కనిపిస్తుంది. దీంతో ప్రభావతి షాక్ అవుతుంది. బాలుకు నలుగురు పిల్లలు పుట్టినట్లుగా కల వస్తుంది. దీంతో అతడు కంగారు పడిపోయి లేస్తాడు. తర్వాత మీనా సంతోషంగా ఉందని ఉడుక్కుంటున్న ప్రభావతికి సత్యం సెటైర్లు వేస్తాడు. ఇలా ఎపిసోడ్ అంతా ఫన్నీగా సాగిపోయింది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
జూలై 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ ఎన్నో ఊహించని సంఘటనలతో ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా ఈ వారంలో బాలు, మనోజ్ మధ్య జరిగిన ఫైటింగ్ హైలైట్ అయింది. దానికి మించేలా ఆ తర్వాత బాలు, మీనా మధ్య రొమాన్స్‌ను చూపించారు. వీళ్లిద్దరికి తొలిసారి ఇలా జరగడంతో సీరియల్ రంజుగా సాగింది. ఈ విషయం అర్థం చేసుకున్న ప్రభావతి.. రోహిణిని తల్లి కావాలని ఇబ్బంది పెడుతుంది. మరి అప్పటికే ఆమె తల్లి అయిన విషయం తెలుస్తుందా అన్నది సస్పెన్స్‌గా మారింది.


Click it and Unblock the Notifications











