Gunde Ninda Gudi Gantalu Weekly: బాలు, మీనా శోభనంతో ట్విస్ట్.. రోహిణికి అసలైన పరీక్ష.. నిజం తెలుస్తుందా?
ఇండియాలో చాలా ఇండస్ట్రీలు ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూలై 29వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే లుక్కేయండి మరి!
29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
29వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మీనా పెట్టిన కాఫీ షుగర్ ఎక్కువగా ఉన్నా ఇంట్లో వాళ్లు బాగానే ఉందని ప్రభావతిని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అలా అందరూ ఆ గొడవలో ఉండగా బాలు అక్కడకు వచ్చి మీనా మీకేమైనా చెప్పిందా అని అడుగుతాడు. తర్వాత వాళ్ల తండ్రిని పిచ్చి పిచ్చి ప్రశ్నలతో విసిగిస్తాడు. దీంతో ప్రభావతికి సీన్ అర్థం అవుతుంది. వెంటనే రోహిణిని పక్కకు తీసుకు వెళ్లి ఈ ఇంట్లో నువ్వే ముందు తల్లివి కావాలి అని చెబుతుంది. తర్వాత బాలు హీరోలా మారిపోయి వస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. అప్పుడు మీనా తన భర్తతో కలిసి ఫొటోలు దిగి సంతోషపడుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

30వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
30వ తేదీ మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కంగారుగా బయటకు వెళ్లిపోతున్న బాలును మీనా ఆపుతుంది. దీంతో అతడు ఆగకుండా వెళ్లిపోదామని అనుకుంటాడు. అప్పుడు మీనా ఆపి బాలుతో సెల్ఫీ దిగుతుంది. అనంతరం బాలు గుడికి వెళ్లి తనకు ఫస్ట్ నైట్ జరిగిన విషయం పంతులుకు చెప్తాడు. దీంతో ఆయన ముహూర్తం చూసి మంచి జరుగుతుందని చెప్తాడు. తర్వాత రోహిణి తల్లి ఆమెకు కాల్ చేయగా ప్రభావతి లిఫ్ట్ చేస్తుంది. తర్వాత ఆమె తన తల్లికి కాల్ చేసి సీరియస్ అవుతుంది. అప్పుడు జరిగింది చెప్పడంతో బాధపడుతుంది. ఇక, ఫస్ట్ నైట్ గురించి సుశీలకు ఫోన్ చేసి మీనా చెబుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

31వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
31వ తేదీ బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అనుకోకుండా జరిగిపోయిన శోభనం గురించి బాలు టెన్షన్ పడుతుంటాడు. ఎలాగైనా అప్పులన్నీ తీరిపోయిన తర్వాతనే తనకు పిల్లలు పుట్టేలా చేయమని భగవంతుడిని కోరుకుంటాడు. ఆ తర్వాత కోర్టులో సత్యం పెన్షన్ గురించి విచారణ జరుగుతుంటుంది. అప్పుడు బాలు వచ్చిన తన తండ్రి గురించి చెప్పి డీఎం వక్రబుద్దిని కూడా బయటపెడతాడు. దీంతో సత్యం వైపు తీర్పు వస్తుంది. అప్పుడు డీఎం కోపంతో ఇంటికి వెళ్తాడు. అంతలోనే శృతి.. రవిని ఇంటికి తీసుకు వెళ్తుంది. అప్పుడు అతడిని చూసి సత్యం కొడుకు అని శృతి వాళ్ల అమ్మనాన్నలు గుర్తు పట్టి ఒక్కసారిగా షాక్ అవుతారు.
01వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
01వ తేదీ గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శృతి ఇంటికి వచ్చిన రవిని డీఎం వాళ్లు అవమానించినట్లుగా మాట్లాడతారు. దీంతో అతడు ఎదురుతిరిగి మరీ సమాధానం చెప్తాడు. ఇక, కోర్టులో కేసు గెలిచిన తర్వాత సత్యం ఆనందంగా ఇంటికి వస్తాడు. అంతేకాదు, మీనాపై ప్రశంసల వర్షం కురిపిస్తాడు. అది చూసిన ప్రభావతి కుళ్లుకుంటుంది. ఆ తర్వాత బాలు, ప్రభావతి వాళ్లకు ఎప్పటిలాగే డిస్కర్షన్ జరుగుతుంది. ఆ తర్వాత సత్యం తన తల్లి సుశీలకు కాల్ చేసి ఈ గుడ్ న్యూస్‌ను చెబుతాడు. తర్వాత ఆమె బాలుతో మాట్లాడుతూ తన ఆస్తి మొత్తం మీనాకు పుట్టిన పిల్లలకే అని చెబుతుంది. తర్వాత బాలు, మీనా గదిలో సరసాలు ఆడుకుంటూ ఉంటారు.
26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
26వ తేదీ శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. మీనా, బాలు సంతోషంగా ఉండడం గమనించిన ప్రభావతి.. కామాక్షికి ఫోన్ చేసి వాళ్లను విడగొట్టేందుకు సలహా అడుగుతుంది. అప్పుడామె మీనాను ఆషాడానికి పుట్టింటికి పంపమని చెప్తుంది. వెంటనే ప్రభావతి.. పార్వతమ్మకు కాల్ చేస్తుంది. దీంతో ఉదయాన్నే ఆమె అక్కడకు వస్తుంది. అప్పుడు ఎలాగైనా మీనా వెళ్లిపోవాలని ప్రభావతి పట్టుబడుతుంది. దీంతో బాలు కూడా ఒప్పుకుంటాడు. అప్పుడు మీనా బాధతోనే పుట్టింటికి వెళ్లిపోతుంది. ఇక, రవి తన రెస్టారెంట్‌లో పని చేస్తూ ఉంటాడు. అప్పుడు శృతి అతడికి కాల్ చేస్తుంటుంది. కానీ, రవి మాత్రం లిఫ్ట్ చేయకుండా కావాలనే వదిలేస్తాడు. దీంతో రవి చేస్తున్న రెస్టారెంట్‌కు శృతి కాల్ చేస్తుంది.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
జూలై 29వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ ఎన్నో ఊహించని సంఘటనలతో ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా ఈ వారంలో బాలు, మీనా మధ్య జరిగిన ఫస్ట్ నైట్‌ను బాగా హైలైట్ చేశారు. అంతేకాదు, చాలా కాలంగా కోర్టులో నలుగుతున్న సత్యం పెన్షన్ గొడవకు కూడా పుల్‌స్టాప్ పెట్టేశారు. అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఆషాడం రూపంలో మీనాకు బిగ్ షాక్ తగిలేలా చేశారు. అలాగే, రవి లవ్ స్టోరీకి కూడా అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో వచ్చే వారం ఈ సీరియల్ మరింత రంజుగా మారబోతుంది.


Click it and Unblock the Notifications











