Gunde Ninda Gudi Gantalu Weekly: దినేష్ ట్రాప్ లో రోహిణి.. ఉపాధి కోల్పోయిన బాలు.. ప్రభావతి మాస్టర్ ప్లాన్..

Gunde Ninda Gudi Gantalu Weekly Roundup:'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ లో గతవారం అంటే నవంబర్ 11 వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో. ఈ వీక్లీ రౌండప్ లో చూడండి. నవంబర్ 11వ తేదీన సోమవారం ఎపిసోడ్ లో రోహిణి బాయ్ ఫ్రెండ్ దినేష్ కొరియర్ బాయ్ వేషంలో ఇంటికి వచ్చి.. తనకు డబ్బులు కావాలంటూ డిమాండ్ చేస్తాడు. లేదంటే సీక్రెట్స్ ను బయటపెడతానని రోహిణీని బ్లాక్ మెయిల్ చేస్తాడు. తనకు రూ. 50,000 లు ఇవ్వాలని, లేదంటే తన బాగోతమంతా బయటపెడుతానని బెదిరిస్తాడు. దీంతో తన భర్త మనోజు దగ్గరకు వెళ్లి.. పార్లర్ ఎంప్లాయిస్ కు పండుగ బోనస్ ఇవ్వాలని, తనకు రూ. 50,000 కావాలని అడుగుతుంది. దీంతో మనోజ్ తన తల్లి ప్రభావతి దగ్గరి వెళ్లి.. డబ్బులు సమకూర్చాలని బ్రతిమలాడుతాడు. దీంతో కొడుకు బండారం బయటపడుతోందని ఇస్తానని చెప్పతోంది ప్రభావతి.

నవంబర్ 12వ తేదీన మంగళవారం ఎపిసోడ్‌లో డబ్బు కోసం మీనాక్షి దగ్గరకు వెళ్తుంది. తనకు రూ. 50000 కావాలని, ఎలాగైనా సర్దుబాటు చేయమని బ్రతిమిలాడుతోంది. తన దగ్గర అంత మొత్తం లేదని రూ.25,000 ఇస్తుంది మీనాక్షి. కోటీశ్వరాలైన శృతిని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే.. ఇలా ఇతరులను డబ్బు అడిగే ప్రసక్తి రాదని, అవసరం అయితే.. నువ్వే ఇంతకు డబ్బును వడ్డీకి ఇవ్వచ్చని ఉచిత సలహా ఇస్తోంది. మీనాక్షి మాటలతో ఆలోచనలో పడుతుంది. ఎలాగైనా రవి, శ్రుతిలను ఇంటికి తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది ప్రభావతి. ఇంతలో మనోజ్ ఇంటికి రావడంతో అతనికి డబ్బు ఇచ్చి.. ఇక నుండి తనని డబ్బులు అడగవద్దని, ఏదైనా ఉద్యోగం చూసుకోమని మనోజ్ కు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. మరోవైపు టిఫిన్ తినకుండా వెళ్లిన బాలుకి మీనా భోజనం తీసుకొని వెళ్తుంది. తాను తిననని బాలు మొండికేస్తాడు. కానీ, మీనా ఫ్లాన్ వేసి.. తినేలా చేస్తోంది.

Gunde Ninda Gudi Gantalu last week roundup story November 11th to November 15th Episodes highlights

నవంబర్ 13వ తేదీన బుధవారం ఎపిసోడ్ లో సత్యం తల్లి సుశీల ఫోన్ చేసి.. దీపావళి పండుగకు ఇంటికి రమ్మని పిలుస్తోంది. తాను రవికి మంచి పిల్లను చూసానని, ఆ అమ్మాయిని చూడ్డానికి రమ్మని చెప్ప చెబుతుంది. ఇప్పడు వద్దులే.. సంక్రాంతికి వస్తామని సత్యం సర్ది చెబుతాడు.ఇదిలా ఉంటే.. బోనస్ ఇచ్చారని తన తల్లి ఇచ్చిన డబ్బులను రోహిణికి ఇస్తాడు మనోజ్. వెంటనే ఆ డబ్బులను తీసుకెళ్లి దినేష్ కు ఇస్తుంది రోహిణీ. కానీ తాను అడిగిన అంత మొత్తం ఇవ్వకుండా ఆటలాడుతున్నావని బెదిరిస్తాడు. తాను అడిగినంతా ఇవ్వకుంటే.. తన సీక్రెట్లను బయట పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇదెలా ఉంటే.. సడెన్ గా పార్వతి తన కూతురు మీనా ఇంటికి వెళుతుంది. ఎందుకొచ్చావ్ అంటూ ప్రభావతి పార్వతిని అవమానిస్తుంది. ఇంటికి వచ్చిన వారిని అవమానించి పంపడం సంస్కారం కాదని ప్రభావతిపై సత్యం అరుస్తాడు.

నవంబర్ 14వ తేదీన గురువారం ఎపిసోడ్‌లో పార్వతిని ఇంట్లోకి రమ్మని పిలుస్తాడు సత్యం. తాను దీపావళి పండుగకి అల్లుని కూతుర్ని పండుగకు రమ్మని పిలవడానికి వచ్చానని చెబుతోంది. తప్పకుండా పండుగకు పంపామని పార్వతికి సత్యం మాటిస్తాడు. పార్వతి ఇంటికి బయలుదేరే ముందు.. పండుగకు పుట్టింటికి వెళ్లడం లేదమ్మా అంటూ రోహిణి అడుగుతుంది. దీంతో ఆగ్రహానికి లోనైనా ప్రభావతి. అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవద్దంటూ పార్వతికి వార్నింగ్ ఇస్తుంది. అవును .. పండుగకు అన్న వదినలు మలేషియా వెళ్తే బాగుంటుంది కదా అని రోహిణిని ఇరకాటంలో పడేస్తుంది మౌనిక. ప్రభావతి కూడా పెళ్లయిన తర్వాత ఎటు వెళ్లలేదనీ, దీపావళి పండుగకు మలేషియాకి వెళ్లమని చెబుతోంది. వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడమని రోహిణి కి చెప్తుంది. తన తండ్రి ఫారిన్ టూర్ లో ఉన్నాడని, ఇప్పుడు డిస్టర్బ్ చేయడం సరికాదని తప్పించుకుంటుంది. మరోవైపు.. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం బాలు అత్తగారింటికి వెళ్తాడు. కానీ మార్గమధ్యంలో షేట్ మనుషులు అడ్డుపడి తన కారును లాక్కెళ్తారు.దీంతో చేసేది ఏమీ లేక ఆటోలో అత్తగారింటికి వెళ్తాడు బాలు.

Gunde Ninda Gudi Gantalu last week roundup story November 11th to November 15th Episodes highlights

నవంబర్ 15 వ తేదీన శుక్రవారం ఎపిసోడ్‌లో బాలు తన అత్తగారి ఇంట్లో కూడా సూటిపొటి మాటలతో మీనాను అవమానిస్తాడు. దీంతో మీనాకు కోపం వస్తుంది. వెంటనే బాలును పక్కకు తీసుకెళ్లి.. ఏమైనా తిట్టాలనుకుంటే.. ఇంటికి వెళ్ళిన తర్వత తిట్టు, కానీ ఇక్కడ మాత్రం తనని ఏమి అనవద్దని రిక్వెస్ట్ చేసుకుంటుంది మీనా. ఆ తరువాత బాలు ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్లి మరోసారి గొడవపడతాడు. తన దగ్గర నుండి బలవంతంగా కారు ఎందుకు తీసుకవచ్చారని నిలదీస్తాడు. కారు కావాలంటే.. తన కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్తేనే కారు ఇస్తానని చెప్తాడు షేట్. దీంతో బాలు కోపం కట్టలు తెంచుకుంటుంది.కానీ, నీలాంటి వారి దగ్గర పని చేయాల్సిన కర్మ తనకు లేదని వెళ్లిపోతాడు.మరోవైపు డబ్బుల కోసం దినేష్ ప్రభావతి ఇంటికి వస్తాడు. తనకు ఇవ్వాల్సిన మిగతా డబ్బు ఇవ్వకపోతే.. అసలు విషయం తన అత్తయ్య కు చెబుతానని బ్లాక్ మెయిల్ చేస్తాడు దినేష్. మరోవైపు ప్రభావతి మనోజ్ ను పిలిచి.. పండుగకు మలేషియాకు టిక్కెట్లు బుక్ చేయమని ఫోన్ చేసి అడుగుమని చెబుతోంది.

More from Filmibeat

Read more about: gunde ninda gudi gantalu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X