Gunde Ninda Gudi Gantalu Weekly: బాలుకి శీల డార్లింగ్ వార్నింగ్.. అడ్డంగా బుక్కైన రోహిణీ..
Gunde Ninda Gudi Gantalu Weekly: గుండె నిండా గుడి గంటలు సీరియల్ గతవారం అంటే నవంబర్ 18వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ వరకు ప్రసారమైన 'గుండె నిండా గుడి గంటలు'సీరియల్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో.. ఓ లుక్కేయండి మరి!
నవంబర్ 18 వ తేదీన సోమవారం ఎపిసోడ్ లో ప్రభావతి రోహిణి దగ్గరకు వచ్చి తన తండ్రికి కాల్ చేయమని చెబుతుంది. విద్యకు ఫోన్ చేసి, తన నాన్నకు ఫోన్ చేశానని చెబుతుంది. కానీ, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందనీ, నాన్న ఫారిన్ ట్రిప్ లో బిజీగా ఉన్నాడని మేనేజ్ చేస్తుంది రోహిణీ. మరోవైపు బాలు ఫుల్లుగా తాగి వచ్చి అత్తగారి ఇంటి వద్ద నానా హంగామా చేస్తాడు. తాగిన మైకంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. బాలు ప్రవర్తనను చూసి పార్వతి ఏడుస్తుంది. మరుసటి రోజు ఉదయం బాలు నిద్రలేచి.. హ్యాంగ్ ఓవర్ తో ఇబ్బంది పడతాడు. రాత్రి ఏదైనా తేడాగా మాట్లాడానా అంటూ తన అత్తగారిని అడుగుతాడు. అదేం లేదు బాబు అంతా బాగానే ఉందంటూ కవర్ చేస్తుంది పార్వతి. కానీ శివ వచ్చి.. నువ్వు తిట్టడంతో మా అక్కయ్య మీ ఇంటికి వెళ్ళిపోయింది అని చెబుతాడు. దీంతో బాలు సీరియస్ అయి.. ఎవరైనా మొగుడు తిడితే.. అమ్మగారింటికి వస్తారు. కానీ, మీనా మాత్రం అత్తగారింటికి వెళ్లిందా? అని వ్యంగంగా మాట్లాడుతాడు. తాను చెబుతున్న వినకుండా మీ ఇంటికి వెళ్ళిపోయింది అని పార్వతి అంటుంది.

నవంబర్ 19వ తేదీన మంగళవారం ఎపిసోడ్‌లో బాలుకి చెప్పకుండా మీనా తన అత్తగారింటికి వెళ్లి పోతుంది. దీంతో బాలుకి ఎక్కలేని కోపం వస్తుంది. కానీ, మీనా తల్లి పార్వతి అన్ని విషయాలు సద్ది చెప్ .. పండుగ కనుక ఉంగరం పెట్టి పంపిస్తోంది. మరోవైపు మీనా పండుగకు అమ్మగారింట్లో ఉండకుండా అత్తగారింటికి రావడంతో ఇంట్లో వారు కూడా షాక్ అవుతారు. బాలు అక్కడ ఉన్న మీ గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే ఇంటికి వచ్చామంటూ మీనా అబద్దం చెపుతోంది. కానీ,అన్ని విషయాలు కూడా ఇంట్లో చెప్పానని బాలుని ఆటపట్టిస్తుంది. ఇంతలోనే షీలా డార్లింగ్ ఎంట్రీ ఇస్తుంది. తన కొడుకు సత్యం చూసి ఏంట్రా అలా ఉన్నావ్ అంటూ ఆరా తీసుంది. హాస్పిటల్ కి వెళ్లిన మనిషి అలా కాకపోతే ఎలా ఉంటారని ప్రభావతి అంటుంది. దీంతో షీలా డార్లింగ్ కంగారు పడుతుంది. వెంటనే అదేం లేదు.. జ్వరం వస్తే.. హాస్పిటల్ తీసుకెళ్లాము అని కవరింగ్ చేసి చెప్తాడు బాలు. అందరు కనిపిస్తున్నారు మరి చిన్నోడు అని రవి గురించి అడుగుతుంది. అలాగే కారు కనిపించడం లేదు రా అని బాలుని అడుగుతుంది.
నవంబర్ 20 వ తేదీన బుధవారం ఎపిసోడ్ లో పండగపూట అందరూ తలంటుకొని స్నానాలు చేస్తూ సందడి చేస్తారు. ఈ సమయంలో రవి లేడని సుశీలమ్మ బాధపడుతుంది. అసలు వాడు ఎటు వెళ్లడాన్ని నిలదీస్తుంది. వెంటనే మీనా.. సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి ఊరు వెళ్ళాడని కవరింగ్ చేస్తోంది. ఆ తరువాత మీనా శారీ కట్టుకోవడానికి రూమ్ లోకి వెళుతుంది. ఆ విషయం తెలియకుండా బాలు సడన్ గా రూమ్ లోకి వెళ్లాడు. దీంతో తన చీర కుచ్చులు సెట్ కావడం లేదు కాస్త సెట్ చేయమని అంటుంది మీనా. అసలు విషయం అమ్మమ్మ చెప్తానంటూ శిలా డార్లింగ్ పిలువడంతో బాలు కంగారుపడుతూ మీనా నోరుమూస్తాడు. ఈ సమయంలో జారి బెడ్ పై పడిపోతారు ఇద్దరు. ఈ సమయంలో కాస్త రొమాంటిక్ గా కలుస్తారు. ఆ తర్వాత బాలు చీర కుచ్చులను సెట్ చేసి.. కిందికి తీసుకవస్తాడు. ఆ తర్వాత ప్రభావతి పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది. అనంతరం షీలా డార్లింగ్ రవికి ఫోన్ చేసి పండుకి ఇంటికి రమ్మని చెబుతోంది. సుశీలకు అసలు విషయం తెలియక రవిని ఇంటికి రమ్మని పిలుస్తుంది. దీంతో రవి సంతోషపడి శృతికి ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెబుతాడు.

నవంబర్ 21 వ తేదీన గురువారం ఎపిసోడ్ లో బాలు కారు తీసుకొని వస్తాడు. త్వరగా గుడికి వెళ్దామని చెబుతాడు. మీనా ను తీసుకుని రమ్మని బాలుకు ఆర్ఢర్ వేస్తోంది షీలా డార్లింగ్. అందరు కలిసి కారులో వెళ్లే సమయంలో మీనా అనుకోకుండా బాలుపై పడుతుంది. దీంతో బాలు చిరాకు పడతాడు. గొడవలు పక్కన పెట్టి.. తనకు సంవత్సరం తిరిగే లోపు పండంటి మగ పిల్లల్ని ఇవ్వాలని చెబుతుంది. మరోవైపు.. పండుగ పూట అన్ని పనులు తాను ఒక్కదాన్నే పనులు చేసుకోవాలంటూ.. మీనా పై కొప్పాడుతుంది ప్రభావతి. ఇంట్లో మిగతా ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటూ గట్టిగా ప్రశ్నిస్తుంది. అయినా పండగపూట ఇంటికి పెద్ద కోడలు వంట చేయాలని రోహినీ నీ పిలుస్తుంది. 'రోహిణికి వంట చేయడం రాదని చెప్పిన తీసుకొని రమ్మని ప్రభావతికి ఆర్డర్ వేస్తుంది.
నవంబర్ 22 వ తేదీన శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో పండుగ పూట ఇలాగైనా రోహిణి చేత వంట చేయించాలని ఫిక్స్ అవుతుంది సుశీలమ్మ. తనకు వంట చేయడం రాదని రోహిణీ చెప్పినా.. తాను నేర్పిస్తానంటూ వంట చేయిస్తుంది సుశీల. దీంతో తనకు తల తిరుగుతుంది అంటూ యాక్టింగ్ చేస్తుంది రోహిణి. దీంతో ప్రభావతి తీసుకువెళ్లి హాల్లో పడుకోబెట్టి తలపై చల్లని గుడ్డ వేస్తుంది. ఇంతలోనే రోహిణి తల్లి సుగుణ ఇంటికి వస్తుంది. రోహిణీని చూసి గట్టిగా అరవడంతో ఇంట్లో వారు అందరూ వచ్చి ఏమైందని ప్రశ్నిస్తారు. అయినా రోహిణి చూసి ఎందుకలా అరిచారు? అని సుగుణపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది ప్రభావతి. మరోవైపు.. రవి ఇంటికి చేరుకుంటాడు. ఇంతలోనే బాలు ఎదురుపడి.. రవి కాలర్ పట్టుకుని ఎందుకొచ్చావు? అని నిలదీస్తాడు. తనకు నానమ్మ ఫోన్ చేసిందని చెప్తాడు. మరోవైపు రోహిణి తన తల్లి దగ్గరికి వెళ్లి.. ఎందుకొచ్చావని ప్రశ్నిస్తుంది. తనకు ఎవరో ఫోన్ చేసి నీకు ప్రమాదం జరిగిందనీ, చెప్పడంతో తాను ఇలా వచ్చానని చెబుతుంది. ఇంకోసారి ఇంటికి రావద్దని వార్నింగ్ ఇస్తోంది. మీనా రావడంతో టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడుతుంది.


Click it and Unblock the Notifications











