Gunde Ninda Gudi Gantalu Weekly: బయటపడ్డ రోహిణి తల్లి ప్రేమ.. మీనాకు అడ్డంగా దొరికిపోయిన బాలు..
Gunde Ninda Gudi Gantalu Weekly: గుండె నిండా గుడి గంటలు సీరియల్ గతవారం అంటే నవంబర్ 25వ తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ వరకు ప్రసారమైన 'గుండె నిండా గుడి గంటలు'సీరియల్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో.. ఓ లుక్కేయండి మరి!
సోమవారం నవంబర్ 25 న తేదీన ఎపిసోడ్ లో రోహిణి ప్రవర్తనలో ఏదో తేడా గమనిస్తుంది మీనా. అంత ముందుకే రోహిణి తెలుసా? అంటూ సుగుణమ్మను అడుగుతుంది. రోహిణీ తన కూతురులా అనిపిస్తుందనీ, అందుకే తనతో క్లోజ్ గా మాట్లాడతానని సుగుణమ్మ అబద్దం చెబుతోంది. ఆ తరువాత కుటుంబ సభ్యులందరూ టపాసులు కాల్చుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఆ సమయంలో చింటూ పై మెరుగులు పడడంతో రోహిణి వెంటనే రియాక్ట్ అవుతుంది. తన కొడుకును దగ్గరకు హత్తుకుంటుంది. ఈ ఘటనతో అందరూ షాక్ అవుతారు. మరోవైపు రవి ఇంటికి వచ్చి బాధపడుతాడు. త్వరలోనే అంతా సెట్ అవుతోందనీ రవిని ఓదారుస్తుంది శ్రుతి . ఆ తరువాత శ్రుతి టపాసులు కాలుస్తుండగా సంజీవ్ కారు ఎక్కించే ప్రయత్నం చేస్తాడు. రవి శ్రుతిని పక్కకు లాగడంతో పెను ప్రమాదం తప్పుతుంది.
మంగళవారం నవంబర్ 26న ఎపిసోడ్ లో మీనాతో బాలు గొడవ పడడాన్ని శీల డార్లింగ్ చూస్తోంది. మరోసారి తన ముందు మీనాతో కూడా పడితే.. బాగుండదంటూ వార్నింగ్ ఇస్తుంది. మీనాకు అండగా ఉండాలని బాలుకి చెబుతుంది. సుశీలమ్మ వెళ్లిపోవడంతో ప్రభావతి తన విశ్వరూపం చూపిస్తుంది. మీనా ను కించపరిచేలా మాట్లాడుతుంది. సొంత కారుని అమ్మేశావు సరే.. మరి రెంట్ కు తీసుకున్న కారు ఏమైంది? అని ప్రశ్నిస్తాడు. ఓనర్ కూతురు ఢిల్లీ నుండి వస్తుందని, ఆమెకు కారు కావాలని, వారం రోజుల తర్వాత ఇస్తానని ఓనర్ చెప్పాడంటూ కవర్ చేస్తాడు బాలు. వారం రోజులు డబ్బులు ఇవ్వకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని, దీంతో మీనా తాను ఒక పూటనే భోజనం చేస్తానని వెళ్ళిపోతుంది. ముందుగా బాలుకి మీనా థాంక్స్ చెప్తుంది. కానీ, డాక్యుమెంట్స్ ఇచ్చిన విషయం తనకు చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదని మరోసారి మీనాపై బాలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు.

బుధవారం నవంబర్ 27న ఎపిసోడ్ లో బాలు ఉద్యోగం కోసం పలు కారు ఏజెన్సీల చూట్టు తిరుగుతాడు. కానీ, తాము ఉద్యోగం ఇవ్వలేమంటూ తేల్చి చెప్తారు. కారు ఏజెన్సీలలో జాబ్ లేకపోతే.. పర్సనల్ డ్రైవర్ గా చేస్తానని నిర్ణయించుకుంటాడు. రోహిణికి తన బాయ్ ప్రెంఢ్ దినేష్ మరోసారి ఫోన్ చేసి రూ.75 వేల రూపాయలను ఇవ్వాలని, లేకపోతే.. తన రహస్యం మొత్తం ఇంట్లో వారికి చెప్తానని బ్లాక్ మెయిల్ చేస్తాడు దినేష్. ఇంటికి సరుకులు వస్తున్నాయనీ, డబ్బులు కట్టాలని మీనాను డబ్బులు ఇవ్వమని అడుగుతుంది ప్రభావతి. డబ్బులు ఇస్తేనే మూడు పూటలా భోజనం పెడతానని అంటుంది ప్రభావతి. రోహిణీ ముందు అవమానించడం, తన కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడటంతో మీనా బాధపడుతోంది. దీంతో ఎలాగైనా డబ్బులు తీసుకురావాలని మీనా తన గాజులను తీసుకెళ్లి తాకట్టు పెట్టాలని భావిస్తుంది. తన తమ్ముడికి బంగారు గాజులు తెచ్చి డబ్బులు తీసుకరమ్మని చెబుతోంది మీనా.
గురువారం నవంబర్ 28న ఎపిసోడ్ లో బాలు ఉద్యోగం కోసం తిరుగుతుండగా ఓ వ్యక్తి కనిపించి తమ అపార్ట్మెంట్ కార్లు క్లీన్ చేయడానికి వ్యక్తి కావాలని చెబుతాడు. తాను కూడా ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్నానని, ఆ పనిలో చేర్పిస్తాడు. మరోవైపు.. మీనా తమ్ముడు శివ డబ్బులు తీసుకువచ్చి తన అక్కయ్యకు ఇస్తాడు. ఆ డబ్బులను తీసుకువచ్చి, తన అత్తగారికి ఇస్తోంది. అయితే.. ఈ విషయం బాలుకి తెలియదు. వాటికి డబ్బులు రేపు ఇస్తానని చెబుతాడు. దీంతో ప్రభావతికి అనుమానం వస్తోంది. దొంగతనం చేసి తీసుకొచ్చావా అంటూ మీనా నిందిస్తుంది. తనకు దొంగతనం చేసే కర్మ పట్టలేదని, పైసలు లేకపోతే.. పస్తుల ఉంటానని, ఏమైనా లక్షలు దొంగతనం చేశానా? అంటూ దిమ్మతిరిగిపోయే రిప్లే ఇస్తుంది. కారు ఈఎంఐకి ఇచ్చిన డబ్బులు సరుకులకు ఇచ్చినట్లు ఉందని కవరింగ్ చేస్తాడు బాలు. ఆ తర్వాత డబ్బులు ఎక్కడి నుండి తీసుకొచ్చావని మీనాను అడుగుతాడు బాలు. అసలు విషయం చెప్పకపోవడంతో చేతులకు గాజులు లేకపోవడానికి చూసి.. గాజులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకవచ్చావా? అని మీనాను నిలదీస్తాడు. దీంతో మీనా నిజం ఒప్పుకుంటుంది.

శుక్రవారం నవంబర్ 29 న ఎపిసోడ్ లో మీనాక్షి ప్రభావతి కి ఫోన్ చేసి రవి గురించి ఏం ఆలోచించావని ప్రశ్నిస్తుంది. త్వరగా రవిని ఇంటికి తీసుకురాకపోతే శృతి వాళ్ళ నాన్న రవిని ఇల్లారికం తీసుకెళ్లే ప్రమాదముందనీ, ఆ తర్వాత ఎలాంటి ప్లాన్ చేసిన వర్కౌట్ కాదని చెబుతోంది మీనాక్షి. మరోవైపు బాలు డ్రైవర్ గా కాకుండా అపార్ట్మెంట్లో కార్లు క్లీన్ చేసే వ్యక్తిగా చేరిన విషయం మీనాకు తెలుస్తుంది. అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి బాలు పనిచేసే ప్లేస్ కు వెళ్తుంది. మీనా అక్కడికి వెళ్లే ఈ సమయంలో బాలు పై దొంగతనం నింద వేసి అక్కడి వారు అవమానిస్తారు. ఆ అవమానాన్ని భరించలేక మీనా అక్కడ నుండి ఏడ్చుకుంటూ బయటికి వస్తుంది. మరోవైపు రవి, శృతి తమ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. హనీమూన్ కు వెళ్దామని శృతి అడగటంతో వద్దంటూ రవి సర్ది చెప్తాడు.


Click it and Unblock the Notifications











