Gunde Ninda Gudi Gantalu Weekly: మీనా రీఎంట్రీ.. కోడలిపై ప్రభావతి కుట్ర.. బయటపడ్డ రోహిణీ బాగోతం

Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న వాటిలో సీరియల్స్ ప్రధానమైనవి. సీరియళ్లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో సాగుతున్న సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి సక్సెస్ పుల్ గా రన్ అవుతున్న సీరియల్స్ జాబితాలో స్టార్ మా (Stra MAA)' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial)ఒకటి. ఈ సీరియల్ ప్రారంభమైన కొన్ని రోజులకే హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో గతవారం అంటే నవంబర్ 4 వ తేదీ నుంచి నవంబర్ 8వ తేదీ వరకు ప్రసారమైన 'గుండె నిండా గుడి గంటలు'సీరియల్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో.. ఓ లుక్కేయండి మరి!

నవంబర్ 4 వ తేదీన సోమవారం ఎపిసోడ్లో తన తండ్రి హాట్ ఆపరేషన్ కొరకు బాలు తన తల్లి ప్రభావతి గాజులను తాకట్టు పెట్టి డబ్బులను తీసుకొని వస్తాడు. తమ మామయ్య ఆపరేషన్ సక్సెస్ కావాలని మీనా గుడికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటుంది. ప్రభావతి,రోహిణిలు దేవుడ్ని ప్రార్థించడానికి అదే గుడికి వస్తారు. ప్రభావతి రావడాన్ని గమనించిన మీనా.. తన మామయ్యకు తాను తెచ్చిన కంకణం కట్టడానికి ఇదే సరైన సమయం అని హాస్పిటల్ కి వెళుతుంది. ఇలా మీనా హాస్పిటల్ చేరుకునే సమయానికి సత్యం ఆపరేషన్ పూర్తి అవుతుంది. డాక్టర్ బయటికి వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందని చెబుతారు. అదే సమయంలో తన తండ్రి ఆరోగ్యం గురించి మాట్లాడాలని బాలు మనోజులను డాక్టర్ వారిని పిలుస్తాడు. ఈ సమయంలో రంగ సహాయంతో తన మామయ్యకు తాను తెచ్చిన కంకణం కడుతుంది మీనా.

Gunde Ninda Gudi Gantalu last week roundup story November 4th to November 8th Episodes highlights

నవంబర్ 5వ తేదీన మంగళవారం ఎపిసోడ్‌లో రవి ఇంటికి వెళ్లి.. హాస్పిటల్ లో జరిగిన విషయాన్ని తలుచుకుంటూ బాధ పడుతాడు. ఈ విషయాన్ని గమనించిన శృతి తన దగ్గరికి వచ్చి.. ఓదారుస్తూ రవికి ధైర్యం చెబుతుంది. మరోవైపు ఆపరేషన్ సక్సెస్ కావడంతో సత్యం స్పృహలోకి వస్తాడు. దీంతో ప్రభావతి సంతోషం పట్టలేక ఏడుస్తుంది. ఆ తరువాత సత్యం ఆరోగ్య పరిస్థితి గమనించి, డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు. ఇలా ఇంటికి చేరుకున్న సత్యం.. మొదటగా బాలుతో రోహిణికి సారీ చెప్పిస్తాడు. అలాగే ఆపరేషన్ డబ్బులు ఇలా కట్టారని ప్రశ్నిస్తాడు. బాలు కారుని డబ్బులు తెలుసుకుని భాదపడుతాడు. అంతా అవసరం వచ్చినప్పుడు ఇంటికి పత్రాలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొస్తే సరిపోయేదిగా .. అనవసరంగా కారును ఎందుకమ్మవని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు బాలు. మీనా ఇంటి డాక్యుమెంట్స్ తీసుకొని పారిపోయిందని ప్రభావతి ఆరోపించగా.. ఆ డాక్యుమెంట్స్ తన దగ్గరనే ఉన్నాయనీ, అసలు విషయాన్ని బయటపడతాడు సత్యం.

నవంబర్ 6 వ తేదీన బుధవారం ఎపిసోడ్ లో తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం బాలు తన అత్తగారింటికి వెళ్లాడు. మీనాను పంపించానని అడుగుతాడు. కానీ, తాను మాత్రం ఆ ఇంట్లో కాలు పెట్టనని, చెయ్యనీ తప్పుకు తనని నిందిస్తున్నారని బాధపడుతుంది మీనా. పోలీస్ స్టేషన్లో తనపై చేయి చేసుకున్నావనీ, ఇంట్లో నుండి గెంటేయించావనీ, హాస్పిటల్లో అవమానించావని బాలుపై ఆగ్రహానికి గురవుతోంది మీనా.
తనకు కూడా తీసుకువెళ్లాలని లేదనీ, కానీ.. తన తండ్రి మీనా వచ్చే వరకు టాబ్లెట్ వేసుకుని భీష్మంచి కూర్చొన్నాడని బాలు చెప్తాడు. దీంతో తన మామయ్య మీద గౌరవంతో తిరిగి అత్తగారింటికి చేరుకుంది మీనా. వచ్చి రాగానే తనని క్షమించమని తన మామయ్య కాళ్ళ మీద పడుతుంది మీనా. ఈ పరిస్థితుల్లో తాను ఏం మాట్లాడలేకపోతున్నానని, తన కొడుకులే తనని మోసం చేశారని, అంతా తలరాత అంటూ సత్యం బాధపడతాడు.

Gunde Ninda Gudi Gantalu last week roundup story November 4th to November 8th Episodes highlights

నవంబర్ 7 వ తేదీన గురువారం ఎపిసోడ్‌లో ఇంటికి తిరిగి వచ్చిన మీనాపై ప్రభావతి నానా నిందలు వేస్తూ అవమానిస్తుంది. ఇంట్లో జరుగుతున్న అన్ని అనర్ధాలకు మీనానే కారణమంటూ తిడుతోంది. ఇక బెడ్రూం లోకి వెళ్లిన తరువాత బాలు కుడా మీనాపై నిందలు వేస్తూ.. నానా మాటలు అంటూ అవమానిస్తాడు. తనతో మాట్లాడవద్దని వార్నింగ్ ఇస్తాడు. రవి పెళ్లి తాను చేయలేదని.. మీనా చెప్పిన బాలు అసలు వినిపించుకోడు. ఈ విషయాన్ని గమనించిన సత్యం.. అనవసరంగా ఇతరుల మాటలు పట్టుకుని నీ జీవితాన్ని ఆగం చేసుకోకనీ, రవి చేసిన తప్పుకు మీనా ను బలి చేయొద్దని బాలుకు చెబుతాడు. మీనా కేవలం రవి చేసిన తప్పును దాచాలని ప్రయత్నించి తప్ప.. పోలీస్ స్టేషన్ లో పరువు తీయాలని భావించలేదని సత్యం అంటారు. అయినా.. ఎన్నడూ తప్పు చేయని మీనా తప్పు చేసిందని ఎలా అనుకున్నావని బాలును క్లాస్ పీకుతాడు సత్యం.

నవంబర్ 8 వ తేదీన శుక్రవారం జరిగిన ఎపిసోడ్లో.. డైనింగ్ టేబుల్ దగ్గర రోహిణి రెచ్చిపోతుంది. బ్రేక్ ఫాస్ట్ లో పూరీలు లాంటి ఆయిల్ ఫుడ్ చేయొద్దని, అలాంటివి ఆరోగ్యానికి మంచిది కాదని మీనా పై ఫైర్ అవుతోంది. ఈ సమయంలో ప్రభావతి తన పెద్దకోడలు రోహిణికి సపోర్టుగా మాట్లాడుతుంది. ఆయిల్ ఫుడ్ తినడం వల్లే తన భర్త ఆరోగ్యం కూడా చెడిపోయిందని రోహిణికి వత్తాసు పలుకుతుంది. తాను బాలు కోసం పూరీలు చేశానని చెప్పగా.. ఆ మాట విన్న బాలు నేను ఏమైనా చేయమని చెప్పానా ? అంటూ మీనా పై కోప్పడతాడు. మీనా ప్రేమతో చేసిన టిపిన్ తినకుండానే వెళ్లిపోతాడు. రోహిణీ, ప్రభావతి లు కూడా మీనా చేసిన టిఫిన్ నచ్చలేదంటూ.. అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వారికి నీ చేతితో చేసిన పూరీలు తినే అద్రుష్టం లేదులే అంటు సత్యం సర్థి చెప్పుతాడు సత్యం. మరోసారి బాలు ఫుల్లుగా తాగి ఇంటికి వస్తాడు.ఈ సమయంలో మీనాకు బాలుకు మధ్య వాద్వాగ్దం జరుగుతోంది. మీనా తన తల్లితో ఫోన్ మాట్లాడడానికి చూసిన ప్రభావతి ఆగ్రహంతో ఊగిపోతుంది. ఎన్నటికైనా ఇంట్లో నుండి వెళ్లి పోవాల్సి ఉంటుందని, మూళ్లే ముఠా సర్దుకొని సిద్దంగా ఉండమని మీనా ను హెచ్చరిస్తుంది ప్రభావతి.

More from Filmibeat

Read more about: gunde ninda gudi gantalu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X