Gunde Ninda Gudi Gantalu Weekly: కొడుకు చేసిన తప్పుకు తండ్రికి శిక్ష.. మరిది చేసిన పనికి రోడ్డునపడ్డ వదిన..

Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. అందులోనూ తెలుగు సీరియల్స్ ఉన్న క్రేజీ ఏ భాష సీరియల్స్ ఉండదంటే.. అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సీరియల్ ప్రారంభం కొన్ని రోజులకే హైరేంజ్ లో టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే అక్టోబర్ 14 తేదీ నుంచి అక్టోబర్18వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే లుక్కేయండి మరి!

అక్టోబర్ 14 వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ లో శ్రుతి కనిపించకపోవడంతో సత్యం, రవి కలిసి తన డ్రామా చేస్తున్నారని పోలీసులకు చెబుతాడు. సత్యం కుటుంబంపై ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తాడు. ఇదెలా ఉంటే.. పోలీసుల ఎంక్వైరీలో రవి,శ్రుతిల పెళ్లి విషయం తెలిసిపోతుంది. పైగా.. ఆ పెళ్లికి పెద్దగా మీనా సంతకం పెట్టిందని తెలియడంతో ప్రభావతి కుటుంబం షాక్ అవుతుంది. ఈ క్రమంలో బాలు కోపం కట్టలు తెంచుకుంటుంది. మీనాపై చేయి చేసుకుంటాడు. ఈ క్రమంలో ప్రభావతి, తన కుటుంబ సభ్యులంతా.. మీనా ఘోరంగా అవమానిస్తారు. కుటుంబ పరువును రోడ్డు కిడ్చిందని మీనాను తిట్టడం ప్రారంభిస్తారు.

Gunde Ninda Gudi Gantalu last week roundup story October 14 th to October 18 th Episodes highlights

అక్టోబర్ 15వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ లో శ్రుతి, రవి పెళ్లి చేసుకున్నారనీ తెలియడంతో సురేంద్ర ఆగ్రహంతో మండిపడిపోతున్నాడు. ఎలాగైనా తన కూతుర్ని తీసుకురావాలని పోలీసులకు సురేంద్ర చెప్పుతాడు. అవసరమైతే ఎంత డబ్బు అయినా ఇస్తానని చెబుతాడు. రవి, శ్రుతి పెళ్లి చేసుకోవడానికి మీనానే కారణమని కుటుంబ సభ్యులు నిందించారు. దీంతో ఎలాగైనా రవి, శృతి ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు.. తాను ఎన్నో రోజులుగా కలగంటున్నా కల నేడు నిజమైందని సంతోషంగా ఉంటుంది. కానీ, రవి మాత్రం తన కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు.

అక్టోబర్ 16వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ లో బాలు తన తండ్రిని జైలు నుంచి విడిపించుకోవాలని నానా విధాలుగా ప్రయత్నిస్తాడు. అలాగే.. తన తమ్ముడు రవి ఆచూకి తెలుసుకోవడానికి తన ఫ్రెండ్స్ సహయం కోరుతారు. మరోవైపు రవి మాత్రం తన కుటుంబం గురించి ఆలోచిస్తాడు. ఒకసారి ఇంటికి ఫోన్ చేసి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని భావిస్తాడు.కానీ, శ్రుతి మాత్రం మన ప్రాణాలే ప్రమాదం వస్తుందనీ, ఫోన్ చేయొద్దని చెబుతుంది. మరోవైపు మీనా పరిస్థితి దారుణంగా మారుతోంది. చనిపోయే దాక ముఖం చూపించకు' అంటూ మీనాకు గెంటేస్తాడు బాలు. ఎలాగైనా రవి ఆచూకీ తెలుసుకోవాలని శృతి ఫ్రెండ్ మృదుల రిక్వెస్ట్ చేస్తోంది మీనా. దీంతో పరిస్థితి అర్థం చేసుకుని ఆమె రవి ఎక్కడ ఉన్నారో చెబుతోంది.

Gunde Ninda Gudi Gantalu last week roundup story October 14 th to October 18 th Episodes highlights

అక్టోబర్ 17 వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

గురువారం ప్రసారమైన ఎపిసోడ్ లో శ్రుతి ఫోన్ లిప్ట్ చేయకపోవడంతో సంజూ టెన్షన్ పడుతాడు. దీంతో సురేంద్రకు నీలకంఠ ఫోన్ చేస్తాడు. అయినా సురేంద్ర ఫోన్ లిప్ట్ చేయడంతో నీలకంఠ ఆగ్రహానికి లోనవుతాడు. శ్రుతి ఎక్కడ ఉన్న తీసుకురావాలని, తన గుండాలను పంపిస్తాడు. మరోవైపు.. రవి, శ్రుతిలను వెతుకుంటూ వారు ఉండే గెస్ట్ హౌస్ వస్తుంది. జరిగిన విషయం అంతా చెప్పి వారిని పోలీసు స్టేషన్ కు తీసుకెళ్తుంది. రవిని చూడగానే బాలు ఆగ్రహంతో ఊగిపోతాడు. ఇష్ట వచ్చినట్టు రవిని కొడుతాడు బాలు. ఇంతలో సురేంద్ర కూడా పోలీసు స్టేషన్ కు చేరుకుంటాడు. తన కూతురు కిడ్నాప్ చేసినందకు రవి, సత్యంలపై కేసు పెట్టాలని పోలీసులకు చెప్పగా.. తననీ కిడ్నాప్ చేశారని ఎవరు చెప్పారనీ, తనకు నచ్చిన రవితో పెళ్లి అయింది. తనకు తన తల్లిదండ్రుల నుంచి రక్షణ కావాలని కోరుతుంది శ్రుతి.

అక్టోబర్ 18 వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

Gunde Ninda Gudi Gantalu last week roundup story October 14 th to October 18 th Episodes highlights

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ లో శృతి వాంగ్మూలంతో సత్యంను పోలీసులు విడిచిపెడతారు. ఈ క్రమంలో మీనా వదిన తప్పులేదని రవి చెప్పిన బాలు మాత్రం పట్టించుకోకుండా మీనాను విడిచి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లిన సత్యం తనకు పోలీస్ స్టేషన్ లో జరిగిన అవమానం గుర్తుకు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. బాలు ఇంట్లో లేని సమయంలో మీనా తన అత్తగారింటికి వస్తుంది. దీంతో ప్రభావతి ఆగ్రహంతో ఊగిపోతుంది. ఇంట్లో నుండి బయటకు వెళ్లిపో అంటూ మీనాను నిందిస్తోంది. తాను మావయ్య తో మాట్లాడతానని ఆయన రూమ్ లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. దీంతో ప్రభావతి మరింత సీరియస్ అవుతుంది. ముందుగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళు అంటూ మీనా మెడలు పట్టుకుని బయటకు తోస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X