Gunde Ninda Gudi Gantalu Weekly: చావు బతుకుల మధ్య సత్యం.. తండ్రికి కోసం బాలు సంచలన నిర్ణయం.. భర్త కోసం ప్రభావత

Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. అందులోనూ తెలుగు సీరియల్స్ ఉన్న క్రేజీ ఏ భాష సీరియల్స్ ఉండదంటే.. అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సీరియల్ ప్రారంభం కొన్ని రోజులకే హైరేంజ్ లో టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే లుక్కేయండి మరి!

అక్టోబర్ 28 వ తేదీన సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో బాలు పీకలాగా తాగి వచ్చి ఇంటికి చేరుకుంటాడు. సైలెంట్ గా ఉండకుండా తాను రెస్టారెంట్ కు వెళ్లి రవిని చితకబాదానని చెప్తాడు. దీంతో సత్యం ఆగ్రహానికి గురి అవుతాడు. ఇంతలో మనోజ్ కు బాలుకు మధ్య వాగ్వివాదం జరుగుతుంది. ఈ క్రమంలో బాలు.. తన అన్న మనోజ్ పై చేయి చేసుకుంటాడు. అడ్డువచ్చిన మనోజ్ భార్య రోహిణిపై కూడా చేయి చేసుకుంటాడు బాలు. ఈ ఘటనతో ఇంటిల్లిపాది షాక్ కు గురవుతారు. ఆ విషయాన్ని చూసిన సత్యం కోపంతో.. 'అరే బాలు. నా కడుపున చెడబుట్టావురా' అంటూ సోఫాలో కుప్పకూలతాడు. హార్ట్ ఎటాక్ రావడంతో కుటుంబ సభ్యులందరూ కలిసి సత్యం హాస్పిటల్ కి తీసుకెళ్తారు.

Gunde Ninda Gudi Gantalu last week roundup story October 28 th to november 1st Episodes highlights

అక్టోబర్ 29వ తేదీన మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ లో సత్యం కు హార్ట్ ఎటాక్ రావడంతో హాస్పిటల్లో చేర్చుతారు. అయితే..అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు. మీనాకు ఈ విషయం తెలియడంతో వెంటనే హాస్పిటల్ కు చేరుకుంటుంది. కానీ ప్రభావతి, మనోజ్ లు ఎందుకు వచ్చావ్.. నీవల్లే కుటుంబ పరువు రోడ్డున పడిందని,ఆ బాధతోనే హార్ట్ ఎటాక్ వచ్చిందంటూ అవమానిస్తారు. దీంతో తన మామయ్యను చూడకుండానే మీనా అక్కడినుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. తన తండ్రి ఆరోగ్యం గురించి బాలు బాధపడుతాడు.

Gunde Ninda Gudi Gantalu last week roundup story October 28 th to november 1st Episodes highlights

అక్టోబర్ 30 వ తేదీన బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ లో సత్యం ను వైద్యులు పరీక్షించి, తనకి మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని, ఆపరేషన్ చేయాలని, ఈ ఆపరేషన్ కు దాదాపు నాలుగు నుండి ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెబుతారు. ఆపరేషన్ కోసం డబ్బు ఎలా సమకూర్చాలో ప్రభావతి ఫ్యామిలీ ఆలోచిస్తుంది. ఈ క్రమంలో ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్లి.. తన నాన్నను గాని, మామయ్యను గాని డబ్బు సమకూర్చమని కోరుతుంది. కానీ, వారు ఎక్కడున్నారో తనకు తెలియదంటూ అబద్ధాలు చెప్పి తప్పించుకుంటుంది రోహిణి. పైగా ఇంటి దస్తావేజులు ఉన్నాయి కదా.. వాటిని తాకట్టు పెట్టి డబ్బులు సమకూర్చొచ్చు అంటూ సలహా ఇస్తుంది. ఈ సలహా మేరకు బాలు ఇంటికి వెళ్లి దస్తావేజుల కోసం వెతుకుతాడు. కానీ, ఆ దస్తావేజులు కనిపించవు. ఈ క్రమంలో మీనాకు బాబు ఫోన్ చేస్తాడు. కానీ ఆమె కాల్ ను లిఫ్ట్ చేయదు.

Gunde Ninda Gudi Gantalu last week roundup story October 28 th to november 1st Episodes highlights

అక్టోబర్31వ తేదీన గురువారం ప్రసారమైన ఎపిసోడ్ లో సత్యం ఫ్రెండ్ రంగా.. తాను యూనియన్ ఆఫీసు వెళ్లి, లోన్ గురించి అడిగి చూశాననీ,కానీ, వాళ్లు నిరాకరించారని చెప్పుతాడు. మరోవైపు.. ఇంటి డాక్యుమెంట్ దొరకపోవడంతో నిరాశతో హాస్పిటల్ కు చేరుకుంటాడు. ఈ సమయంలో మనోజ్ పై అనుమానం వ్యక్తం చేస్తాడు. దీంతో మరోసారి బాలుకు మనోజ్ లకు గొడవ జరుగుతోంది. మరోవైపు.. మీనా తన మామయ్య గురించి పూజలు చేస్తోంది. ఈ సమయంలో ఓ పూజారి కంకణం ఇచ్చి తన మామయ్యకు కట్టామని చెబుతాడు. మరో వైపు.. డబ్బు కోసం బాలుకు తన బాస్ వెళ్లగా.. అక్కడ గొడవ జరుగుతోంది. దిక్కుతోచని పరిస్థితి బాలు తన కారును అమ్మాలని నిర్ణయించుకుంటాడు.

నవంబర్ 1 వ తేదీన ప్రసారమైన శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో రవి తన చెల్లి మౌనిక కు ఫోన్ చేసి ఇంట్లో పరిస్థితి ఎలా ఉందని అడగగా.. నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందని, అన్నయ్యలు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతుంది. దీంతో వెంటనే హాస్పిటల్ కి బయలుదేరుతారు. ఈ సమయంలో శృతి ఖర్చులకోసం అంటూ రెండు లక్షల రూపాయల చెక్ ఇచ్చి పంపిస్తుంది. మరోవైపు బాలు తన కారును అమ్మి 3 లక్షల రూపాయలను సమకూరుస్తాడు. ఇలా హాస్పటల్ లో రవిని చూసిన బాలు ఆగ్రహంతో ఊగిపోయి.. కొట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులంతా.. అవమానించడంతో రవి వెళ్లిపోతాడు. మిగతా రెండు లక్షల రూపాయల కోసం ప్రభావతి తన బంగారు గాజులు, గొలుసు ఇచ్చి తాకట్టు పెట్టమని చెబుతోంది.

More from Filmibeat

Read more about: gunde ninda gudi gantalu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X