Gunde Ninda Gudi Gantalu Weekly: తెలిసిపోయిన నిజాలు.. విలన్ రాకతో ట్విస్ట్.. మరి బాలు ఏం చేశాడంటే!

మిగిలిన భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే లుక్కేయండి మరి!

16వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
16వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. రవితో ప్రేమలో ఉన్న శృతిని ఎలాగైనా తన ఫ్రెండ్ నీలకంఠం కొడుకుకు ఇచ్చి పెళ్లి చేయాలని సురేంద్ర అనుకుంటాడు. ఆ విషయం గురించి భార్యతో మాట్లాడుతుండగానే అక్కడకు శృతి వస్తుంది. అప్పుడు ఆమెకు అబద్దాలు చెప్పి పెళ్లి చూపులకు వెళ్లేందుకు ఒప్పిస్తారు. మరోవైపు, రవికి కూడా పెళ్లి చూపులు ప్లాన్ చేయడంతో అతడు కోప్పడతాడు. ఆ సమయంలో కాస్త గొడవ జరుగుతుంది. ఇక, శృతిని తీసుకుని వెళ్లే సమయంలోనే రవి సంగతి ఎలాగైనా చూసుకుంటాను అని సురేంద్ర చెప్తాడు. ఆ తర్వాత నీలకంఠం కొడుకు సంజూ స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చేస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Gunde Ninda Gudi Gantalu Last Week roundup story September 16th to 20th Episodes highlights

17వ తేదీ మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో..

నీలకంఠం ఇంటికి వెళ్లిన తర్వాత సంజూ వచ్చి సురేంద్ర వాళ్లను పరిచయం చేసుకుంటాడు. అప్పుడు శృతిని డౌట్‌గా చూస్తాడు. దీంతో ఆమె పేరెంట్స్ పరిచయం చేస్తారు. ఆ తర్వాత బలవంతంగా అతడితో మాట్లాడమని పంపుతారు. ఆ సమయంలో సంజూ తన గురించి మొత్తం చెప్తాడు. అలాగే, ఓ గన్‌ను ఆమెకు గిఫ్టుగా ఇవ్వబోతాడు. ఇక, ప్రభావతి ఇంట్లో కూడా పెళ్లి చూపులకు ఏర్పాట్లు జరుగుతాయి. ఆ సమయంలో ప్రభావతి.. మీనాపై సీరియస్ అవుతుంది. అనంతరం కామాక్షి.. రోహిణి ముందే మనోజ్ గురించి నోరు జారుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

18వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

18వ తేదీ బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రభావతి తన ఇంట్లో రవికి, మౌనికకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది. అప్పుడు ఆమె వచ్చిన వాళ్లకు అన్నీ అబద్దాలే చెబుతుంది. అవి విని బాలు సెటైర్లు వేస్తుంటాడు. అనంతరం వాళ్లకు నిజాలన్నీ చెప్పేస్తాడు. అప్పుడు ఆయన సత్యంపై నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు. దీంతో బాలు అతడి కాలర్ పట్టుకుని కొడతాడు. దీంతో ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ అవుతాయి. మరోవైపు, శృతి, సంజూకు వీలైనంత త్వరగా పెళ్లి చేయాలని నీలకంఠం, సురేంద్ర డిసైడ్ అవుతారు. దీంతో ఆమె అక్కడి నుంచి పని ఉందని వచ్చేస్తుంది. కానీ, వాళ్లు మాత్రం తాంబూళాలు మార్చుకుంటారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

19వ తేదీ గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పెళ్లి సంబంధం చెడగొట్టారని ప్రభావతి విరుచుకుపడుతుంది. దీంతో ఇంట్లో వాళ్లంతా ఆమెకు ఎదురు తిరుగుతారు. అప్పుడు ప్రభావతి.. బాలును ఇంట్లో ఉంచి సంబంధం చెడగొట్టింది మీనానే అని నిందిస్తుంది. దీనికామె మామగారిని అవమానించిన వాళ్లతో సంబంధమా అంటూ చూసి వెళ్లిపోతుంది. ఇక, రవికి మంచి సంబంధం చూశానని మీనాతో బాలు అంటాడు. కానీ, అది సమయం వచ్చినప్పుడే చెప్తానని చెబుతాడు. ఆ తర్వాత రవిని శృతి కలిసి పెళ్లి చేసుకుందాం అని అడుగుతుంది. కానీ, అతడు మాత్రం ఇంట్లో వాళ్లను ఒప్పించిన తర్వాతే అని తేల్చేస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

20వ తేదీ శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రభావతి బ్యూటీ పార్లర్‌కు వస్తుందని తెలుసుకున్న రోహిణి.. అది వేరే వాళ్లకు అమ్మేసిన విషయాన్ని తెలియకుండా జాగ్రత్త పడుతుంది. అయినా ప్రభావతికి డౌట్ రావడంతో ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. పెళ్లి చూపుల తర్వాత కంగారుపడుతూ శృతి.. ప్రభావతి ఇంటికి వస్తుంది. అప్పుడు మీనా అక్కడ ఉండగా చూసి తన గురించి నిజాలన్నీ చెబుతుంది. అప్పుడు మీనా ఈ విషయం బాలుతో చెప్తానని మాట ఇస్తుంది. మీనా, శృతి కిందకు రాగానే రోహిణి, ప్రభావతి చూసి ఆమె ఎవరు అని వాళ్లు అడగడంతో తన ఫ్రెండ్ అని వాళ్లకు అబద్దం చెబుతుంది. అప్పుడు వాళ్లకు డౌట్ వస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌ ఎన్నో ఊహించని సంఘటనలతో ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా ఈ వారంలో ప్రభావతి.. తన పిల్లలకు పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం, అదే సమయంలో శృతికి కూడా ఎంగేజ్‌మెంట్ చేయడాన్ని హైలైట్ చేశారు. ఇప్పుడు రవి లవ్ మ్యాటర్ మీనా దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి అది బాలు దగ్గరకు వెళ్లబోతుంది. ఇదంతా వచ్చే వారం చూపించబోతున్నారు. దీంతో ఈ సీరియల్ మరింత ఆసక్తికరంగా మారబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X