Gunde Ninda Gudi Gantalu Weekly: ఆమెతో దొరికిపోయిన రవి.. బాలు ఊహించని నిర్ణయం.. అంతలోనే బిగ్ ట్విస్ట్
ఇండియాలోని చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే సెప్టెంబర్ 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే లుక్కేయండి మరి!
23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
23వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పెళ్లిచూపులు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన శృతి తల్లిదండ్రులపై ఫైర్ అవుతుంది. తనకు ఇష్టం లేకుండా పెళ్లి ఎలా సెట్ చేస్తారని ప్రశ్నిస్తుంది. కానీ, వాళ్లు మాత్రం ఆమెను అస్సలు లెక్క చేయకుండా సంజూతోనే నీ పెళ్లి ఫిక్స్ అంటూ తేల్చిపడేస్తారు. దీంతో శృతికి ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు, శృతి చెప్పిన విషయాన్ని మీనా ఎలాగోలా బాలుకు వివరించి చెప్తుంది. దీంతో అతడు వెంటనే రవి పని చేసే రెస్టారెంట్‌కు వెళ్తాడు. అక్కడ నానా రభస చేస్తాడు. అలాగే, శృతిని ఎలాగైనా మర్చిపోవాలని కూడా వార్నింగ్ ఇస్తాడు. దీంతో రవి షాక్ అయిపోతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

24వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
24వ తేదీ మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. మీనాతో మాట్లాడిన తర్వాత బాలు.. రవి కోసం ఓ సంబంధం చూశానని అంటాడు. ఆ వెంటనే ఆమెను కారులో ఒక దగ్గరకు తీసుకు వెళ్తాడు. అప్పుడు మీనా అడిగినా ఏమీ చెప్పకుండానే పండ్లు, పువ్వులు కొంటాడు. అలా పార్వతమ్మ ఇంటికి తీసుకు వెళ్లి చాలా హైడ్రామా తర్వాత రవికి సుమతిని ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. కానీ, పార్వతమ్మ మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోదు. దీంతో బాలుకు కోపం వచ్చి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు. తర్వాత మీనా గతంలో తనకు ఇంట్లో జరిగిన అవమానం గురించి బాలుకు చెప్తుంది. అయినా అతడు మాత్రం పెళ్లి చేయాలంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
25వ తేదీ బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పార్వతమ్మ తీసుకున్న నిర్ణయంపై బాలు నిరుత్సాహంతో ఉంటాడు. దీంతో మీనా అసలు సంబంధం ఎందుకు వద్దు అని చెప్పింది అనేది వివరిస్తుంది. తర్వాత శృతి తనకు పెళ్లి అప్పుడే వద్దని తన తల్లిదండ్రులతో చెప్తుంది. కానీ, వాళ్లు మాత్రం అస్సలు వినిపించుకోరు. పైగా పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అని తేల్చేశారు. దీంతో శృతి.. రవికి కాల్ చేస్తుంది. ఆ సమయంలోనే బాలు అతడికి క్లాస్ పీకుతూ ఉండడంతో కాల్ లిఫ్ట్ చేయడు. దీంతో ఆమె నేరుగా రెస్టారెంట్‌కు వచ్చి రవితో గొడవ పెట్టుకుంటుంది. అంతేకాదు, తనను పెళ్లి చేసుకోవాల్సిందే అని డిమాండ్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
26వ తేదీ గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. రోహిణి తల్లి సుగుణమ్మ కోసం బాలు క్యాబ్‌లో వస్తాడు. అప్పుడామె అతడిని చూసి కంగారు పడిపోతుంది. తర్వాత ఆమె రోహిణి తల్లి అనే విషయం తెలియకుండా జాగ్రత్తగా బాలుకు సమాధానాలు చెబుతుంది. దీంతో రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది. రవి దగ్గరకు వచ్చిన శృతి రెండు రోజుల్లో తనను పెళ్లి చేసుకోకపోతే చాలా నష్టం జరుగుతుందని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. జాబ్ లేకుండా కవర్ చేసుకుంటోన్న మనోజ్.. తన తల్లి దగ్గర నోరు జారి మాట్లాడతాడు. అది విన్న బాలు ఇంట్లో రచ్చ చేయడంతో అందరికీ అసలు నిజం తెలిసిపోతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
27వ తేదీ శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. మనోజ్ ఇంటికి వచ్చి ఇంటర్వ్యూకు వెళ్లడంతో కూపన్లు ఇచ్చాడని చెప్తాడు. దీంతో బాలు వచ్చి నీ ఉద్యోగం పోయిందా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఇంట్లో వాళ్లంతా అతడు జాబ్ చేయడం లేదని అడుగుతారు. కానీ, కవర్ చేసుకుని అందరినీ షాపింగ్‌కు తీసుకు వెళ్తానని అంటాడు. ఇక, శృతిని సంజూ షాపింగ్‌కు తీసుకు వెళ్లగా అక్కడకు రవి కూడా వెళ్తాడు. అప్పుడు అతడికి అబద్దం చెప్పి పంపించి శృతితో సీక్రెట్‌గా మాట్లాడతాడు. మనోజ్ తెచ్చిన కూపన్లను వాడుకునేందుకు రవి ఉన్న మాల్‌కే ప్రభావతి ఫ్యామిలీ మొత్తం షాపింగ్ మాల్‌కు వస్తారు. బాలు వాళ్లు లోపల షాపింగ్ చేస్తుండగా రోహిణి, ప్రభావతి వాళ్లను అవమానించేలా మాట్లాడతారు.ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
సెప్టెంబర్ 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ ఎన్నో ఊహించని సంఘటనలతో ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా ఈ వారంలో శృతికి ఇంట్లో వాళ్లు సంబంధం సెట్ చేయడాన్ని హైలైట్ చేశారు. దీనివల్ల రవిపై ఆమె ఒత్తిడి చేయడం మొదలెట్టింది. ఫలితంగా రవికి సుమతిని ఇచ్చి పెళ్లి చేయాలని బాలు ప్లాన్ చేస్తాడు. కానీ, అది వర్కౌట్ కాకపోవడంతో రవికి వార్నింగ్ ఇస్తాడు. కానీ, అతడు శృతిని కలిసి మాట్లాడతాడు. ఇది బాలు చూడడంతో వచ్చే ఎపిసోడ్ ఆసక్తికరంగా మారబోతుంది.


Click it and Unblock the Notifications










