Gunde Ninda Gudi Gantalu Weekly: బయటపడ్డ నిజాలు.. రోహిణి చేతికి 17 లక్షలు.. ఇంటి పత్రాలు మాత్రం!

చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే లుక్కేయండి మరి!

02వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
02వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. వడ్డీ వ్యాపారికి డబ్బులు కట్టడానికి వెళ్తున్న ప్రభావతి ఆటో ఆగిపోవడంతో రోడ్డుపై ఒంటరిగా ఉంటుంది. అప్పుడు శివ ఆమెను చూసి తన ఫ్రెండ్‌కు చెబుతాడు. అంతలోనే ప్రభావతి లక్ష గురించి మాట్లాడుతుంది. అది విన్న శివ ఫ్రెండ్ అవి కొట్టేద్దాం అంటాడు. అలా ఇద్దరూ కలిసి లక్ష దొంగిలిస్తారు. దీంతో లబోదిబో అనుకుంటూ ఖాళీ చేతులతో ప్రభావతి వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్లి జరిగింది చెబుతుంది. కానీ, ఆయన నమ్మకుండా ఆమెను బంధిస్తాడు. అంతలోనే అక్కడకు బాలు డబ్బులు కట్టడానికి మీనా వస్తుంది. అప్పుడే ప్రభావతి మాటలను ఆమె వింటుంది.

Gunde Ninda Gudi Gantalu Last Week roundup story September 2nd to 6th Episodes highlights

03వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
03వ తేదీ మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రభావతిని వడ్డీ వ్యాపారి ఇంట్లో చూసిన మీనా కంగారు పడుతుంది. అంతేకాదు, బాలుకు ఫోన్ చేసి విషయం చెబుతుంది. ఆ తర్వాత మామగారిని కూడా అక్కడకు రమ్మంటుంది. దీంతో వాళ్లంతా అక్కడకు చేరుకుంటారు. అప్పుడు ఆమె అప్పు చేయడం వల్లే ఇలా బంధించినట్లు తెలిసి సత్యం సూటిగా ప్రశ్నిస్తాడు. కానీ, ప్రభావతి మాత్రం నిజం దాచేస్తుంది. అంతేకాదు, పెళ్లి కోసమే అప్పు చేశానని అంటుంది. అలాగే, తన లక్ష రూపాయలు ఎవరో కొట్టేశారని కూడా చెబుతుంది. కానీ, ఈ మాటలను వాళ్లు నమ్మరు. ఆ సమయంలోనే వడ్డీ వ్యాపారి డబ్బు కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తానని అంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

04వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

04వ తేదీ బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. వడ్డీ వ్యాపారి దగ్గర పంచాయతీ జరిగిన తర్వాత ఆయన ఇంట్లో వాళ్లంతా సంతకాలు చేయాలని డిమాండ్ చేస్తాడు. దీంతో బాలు వెంటనే రవికి కాల్ చేసి వాళ్లను రమ్మంటాడు. అప్పుడు వాళ్లు అక్కడకు చేరుకోగానే విషయం చెప్పి సంతకాలు చేయిస్తాడు. ఆ తర్వాత వీళ్లంతా ఇంటికి వచ్చి మళ్లీ పంచాయతీ పెడతారు. అప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నా ప్రభావతి మాత్రం సైలెంట్‌గానే ఉంటుంది. దీంతో బాలు గట్టిగా నిలదీయడంతో రోహిణి బ్యూటీ పార్లర్‌ పెట్టడానికి ఇచ్చానని చెబుతుంది. అప్పుడు బాలు రోహిణిపై నిందలు వేస్తూ పరువు తీసేలా మాట్లాడతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింది లింక్‌పై క్లిక్ చేయండి.

Gunde Ninda Gudi Gantalu Last Week roundup story September 2nd to 6th Episodes highlights

05వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

05వ తేదీ గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. వడ్డీ వ్యాపారి దగ్గర పంచాయతీ జరిగిన తర్వాత రోహిణికి ఆ డబ్బును ప్రభావతి ఇచ్చిందన్న నిజం తెలుస్తుంది. అప్పుడు బాలు.. రోహిణిపై సెటైర్లు వేస్తూ మాట్లాడతాడు. రవి కూడా తమకు తేడాగా చూస్తుందని తల్లిని నిందిస్తాడు. అదే సమయంలో మీనా కూడా రోహిణి, ప్రభావతిని ఇంటి దొంగలు అంటుంది. అప్పుడు ప్రభావతి డబ్బు మొత్తం నాలుగు రోజుల్లో ఇచ్చేస్తామని అంటుంది. తర్వాత రోహిణి దగ్గరకు వెళ్లిన ప్రభావతి.. ఆ డబ్బును మలేషియాలోని మీ నాన్నను అడిగి తీసుకు రమ్మని అంటుంది. దీంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

06వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

06వ తేదీ శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. వర్ధన్ తనకు ఫోన్ చేయడంతో రోహిణి మొదట షాకై తర్వాత అతడిపై సీరియస్ అవుతుంది. దీంతో అతడు ప్రతి నెలా తనకు డబ్బు పంపించాలని డిమాండ్ చేస్తాడు. అనంతరం ఇల్లు పోతుందని బాధలో ఉన్న సత్యానికి బాలు భరోసా కల్పిస్తాడు. ఎవరూ డబ్బు తీసుకు రాకపోతే ఆ అప్పు తాను తీరుస్తానని అంటాడు. తర్వాత రోహిణి తన బ్యూటీ పార్లర్‌ను అమ్మేసి పది లక్షల రూపాయలు తీసుకుంటుంది. వాటిని తీసుకొళ్లి ప్రభావతికి ఇస్తుంది. కానీ, ఆమె మాత్రం మరో ఏడు లక్షలు కూడా కావాలని తేల్చేస్తుంది. అప్పుడు రోహిణి అప్పు తీసుకోవాలని డిసైడ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌ ఎన్నో ఊహించని సంఘటనలతో ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా ఈ వారంలో ప్రభావతి ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకు వచ్చిన నిజం తెలిసేలా హైలైట్ చేశారు. అలాగే, ఎన్నో పంచాయతీలు కూడా చూపించారు. ఇక, రోహిణిని ఒత్తిడి చేయడంతో ఆమె డబ్బు తీసుకు రావడానికి నానా తంటాలు పడింది. ఇక, వచ్చే వారంలో రోహిణి ఆ డబ్బు మొత్తం తీసుకు వస్తుంది. దీంతో ఇంటి పత్రాలు సత్యం చేతికి వచ్చేస్తాయి. అవి మీనాకు ఇవ్వడం చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X