Gunde Ninda Gudi Gantalu Weekly: పెళ్లి పెద్దగా మారిన సుమతి.. రవి, శృతిల పెళ్లి ప్లాన్ వర్కవుట్ అయ్యేనా?
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. అందులోనూ తెలుగు సీరియల్స్ ఉన్న క్రేజీ ఏ భాష సీరియల్స్ ఉండదంటే.. అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సీరియల్ ప్రారంభం కొన్ని రోజులకే హైరేంజ్ లో టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే సెప్టెంబర్30వ తేదీ నుంచి అక్టోబర్ 4 వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే లుక్కేయండి మరి!
సెప్టెంబర్ 30 వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
శృతిని సంజూ షాపింగ్‌కు తీసుకు వెళ్లగా రవి కూడా వెళ్తాడు. సంజూను మభ్యపెట్టి శృతితో సీక్రెట్‌గా మాట్లాడతాడు. ఈ క్రమంలో మనోజ్ తెచ్చిన కూపన్లను వాడుకునేందుకు రవి ఉన్న మాల్‌కే ప్రభావతి ఫ్యామిలీ మొత్తం షాపింగ్ మాల్‌కు వస్తారు. ఇదే సమయంలో బాలు, మీనాలు కూడా అదే షాపింగ్ మాల్ కు వస్తారు. ఈ క్రమంలో తక్కువ రేటు చీరలను తీసుకోమని మీనాకు ప్రభావతి చెప్పి.. వాళ్లు మాత్రం కాస్ట్లీ చీరల కోసం వేరే ఫ్లోర్‌కు వెళ్లిపోతారు. మీనాను చూసిన బాలుకు విషయం అర్థం అవుతుంది. దీంతో ఆమెను కూడా ఎక్కువ రేటు ఉన్న చీరలను కొనుక్కోమని చెబుతాడు. వారు వెళ్లిన ఫ్లోర్ కు మీనాను బాలు తీసుకు వస్తాడు. ఈ క్రమంలో రోహిణి తన అటిట్యూడ్ ను చూపిస్తోంది.

అక్టోబర్ 1 వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ లో ఫ్రీ కూపన్స్ పై షాపింగ్ చేయడానికి వచ్చిన ప్రభావతి కుటుంబానికి షాక్ తగులుతోంది. మనోజ్ తెచ్చిన కూపన్స్ వాల్యూడిటీ అయిపోవడంతో వారు చేసిన షాపింగ్ కు డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఈ సమయంలో వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో బాలునే బిల్లు కడుతాడు. దీంతో ప్రభావతి,మనోజ్ పరువు అందరి ముందు పోతుంది. మరోవైపు.. శృతితో ఫోన్ మాట్లాడుతున్న రవికి శోభన సిరియస్ వార్నింగ్ ఇచ్చింది. తన కూతురుకి సంజూతో ఎంగెజ్ మెంట్ అయిందనీ, మరోసారి ఫోన్ మాట్లాడొద్దంటూ సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది శోభ. అంతటితో ఆగకుండా శృతి ఫోన్ లాక్కొని.. బెడ్ రూమ్ లో వేసి లాక్ చేస్తుంది శోభ. ఈ విషయాన్ని రవికి చెప్పింది శ్రుతి. ఎలాగైనా తనని రెండు రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటూ రవికి రిక్వెస్ట్ చేస్తుంది శృతి.
అక్టోబర్ 2 వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ లో మనోజ్ పై బాలుకు అనుమానం వస్తోంది. తన అన్నయ్య ఉద్యోగం చేయకుండా ఖాళీగా పార్కులు, హోటల్స్ పంటి తిరుగుతున్నా.. అనే సందేహం వస్తుంది. దీనికి ప్రధాన కారణం తాను తన తండ్రికి ఇచ్చిన లవ్ సింబల్ ఉన్న వంద రూపాయాల నోటు తిరిగి తన చేతికే రావడంతో అనుమానం వస్తుంది. ఆ డబ్బులు దొరికిన పార్కులో వెతకడం ప్రారంభిస్తాడు. బాలు నుంచి తప్పించుకోవడానికి మనోజ్ నానా తిప్పలు పడుతాడు. క్రమంలో బిక్షగాడిలా అవతారమెత్తుతాడు మనోజ్. ఈ తరుణంలో మనోజ్ తన పార్క్ మెట్ అండ్ ఫ్రెండ్ దగ్గర పదివేల రూపాయలను అప్పుగా తీసుకుంటాడు.
అక్టోబర్ 3 వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
గురువారం ఎపిసోడ్ లో మనోజ్ తన పార్క్ మేట్ దగ్గర అప్పుగా తీసుకున్న పదివేల రూపాయలు బాలుకు దొరుకుతాయి. ఆ డబ్బులు ఎవరివి అని ఒక్కొక్కరిని ప్రశ్నించగా.. కుటుంబ సభ్యులందరూ తమవి కావని సమాధానం ఇస్తారు. మనోజ్ కూడా ఆ డబ్బులు తనవి కావని, ఒకవేళ తనవేనని చెబితే.. ఎక్కడ సాలరీ డబ్బులు అడుగుతారని అబద్ధం చెప్తాడు. మరో శ్రుతి తండ్రి సురేంద్ర.. సత్యం ను తన ఆఫీస్ కు పిలిచి తన కొడుకు రవి గురించి చెబుతాడు. తన కూతురికి పెళ్లి సెట్ అయ్యిందనీ, తన కూతురు జోలికి వస్తే.. మర్యాదగా ఉండదంటూ వార్నింగ్ ఇస్తాడు సురేంద్ర. తన కొడుకు అలాంటి వాడు కాదని, నిశ్చితంగా పెళ్లి ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతాడు సత్యం. ఈ విషయాన్ని బాలు, మీనాలకు చెబుతాడు.

అక్టోబర్ 4 వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ లో మీనా చెల్లెలు సుమతికి రవి ఫోన్ చేసి తన ఇంటి పక్కన ఉన్న శివాలయానికి కావాలని రిక్వెస్ట్ చేస్తాడు. తాను శ్రుతి ప్రేమించాననీ, తనను పెళ్లి చేసుకోవడానికి భావిస్తున్నానని, అందుకు తనకు సహాయం చేయాలని సుమతిని ప్రాదేయపడుతారు రవి. శ్రుతి, రవిల ప్లాన్ ప్రకారం.. సుమతి శ్రుతి వాళ్ల ఇంటికి వెళ్లి.. శ్రుతి తన చిన్ననాటి స్నేహితురాలనీ, మరో రెండు రోజుల్లో తన పెళ్లి ఉండదనీ, శ్రుతిని తప్పకుండా పెళ్లికి పంపించాలంటూ శోభనకు కోరుతుంది. కానీ, శోభన మాత్రం ఎవరి పెళ్లికి వెళ్లాల్సిన అవసరం లేదని శ్రుతికి వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు .. తనకు గిరాయి వచ్చిందనీ, తాను రెండు రోజులు టూర్ కు వెళ్తాడు. ఈ క్రమంలో రవిపై ఓ కన్నేసి ఉండంటూ మీనాకు చెప్పి వెళ్లాడు బాలు.


Click it and Unblock the Notifications











