Gunde Ninda Gudi Gantalu Weekly: పెళ్లి చూపులతో బిగ్ ట్విస్ట్.. ప్రభావతికి మరో దెబ్బ.. కథలో యమా మలుపులు
ఒకప్పుడు కొంత కంటెంట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు చాలానే ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే సెప్టెంబర్ 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే లుక్కేయండి మరి!
09వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
09వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. శివ ఫ్రెండ్ దగ్గరకు వచ్చిన రోహిణి రెండు లక్షలు అప్పు చేస్తుంది. అలా మొత్తం డబ్బు తీసుకుని వచ్చిన రోహిణి ఇంట్లో పెద్ద పంచాయతీ పెడుతుంది. అప్పుడు వాటిని ఇస్తూ బాలుపై ఫైర్ అవుతుంది. దీంతో అతడు కూడా గట్టిగానే బదులిస్తాడు. అతడికి రవి, సుమతి కూడా సపోర్ట్ చేస్తారు. అనంతరం ఆ డబ్బు తీసుకు వెళ్లి వడ్డీ వ్యాపారికి ఇస్తారు. ఆ సమయంలో ఆయన ప్రభావతి మీద నోటికి వచ్చినట్లుగా మాట్లాడి పరువు తీస్తాడు. తర్వాత అందరితో పాటు మీనాతో సైతం సంతకం చేయిస్తాడు. ఆ సమయంలో ప్రభావతి వద్దని చెప్పడంతో సత్యం సహా అంతా తిడతారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

10వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
10వ తేదీ మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. డబ్బు తీసుకోవడం, సంతకాలు చేయడం తర్వాత వడ్డీ వ్యాపారి 'ఎందుకైనా మంచిది ఇంటి పత్రాలు జాగ్రత్తగా పెట్టుకోండి' అంటాడు. తర్వాత ప్రభావతి తాకట్టు పెట్టిన గాజులు కూడా ఇస్తాడు. దీంతో ఆమె బండారం మొత్తం బయటపడుతుంది. ఇక, ఇంటికి వెళ్లిన తర్వాత చాలా సేపు చర్చ కొనసాగుతుంది. అనంతరం ఇంటి పత్రాలను సత్యం.. మీనాకు ఇవ్వబోతే ప్రభావతి రచ్చ చేస్తుంది. అయినా అతడు మీనాకే వాటిని ఇస్తాడు. ఆ పత్రాలను మీనా తన గదిలో దాస్తుండగా ప్రభావతి వెళ్లి దురుసుగా మాట్లాడుతుంది. ఎలాగైనా ఇంటి నుంచి గెంటిస్తాను అంటూ శపథం చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
11వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
11వ తేదీ బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శృతి, రవి రెస్టారెంట్‌లో కూర్చుని మాట్లాడుతుండగా సురేంద్ర వాళ్లు అక్కడికి వస్తారు. ఎలాగైనా శృతిని ఒప్పించి తన ఫ్రెండ్ కొడుకుకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటూ ఉండగానే రవి కూడా ఆమెతో కనిపిస్తాడు. అది చూసి వాళ్లు షాక్ అవుతారు. మరోవైపు, ప్రభావతి అన్న మాటలకు మీనా బాధపడుతూ ఉండగా బాలు వచ్చి ఆమెను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తాడు. కానీ, తన పట్ల రోహిణి, ప్రభావతి సంతోషంగా లేరని ఆమె చెబుతుంది. దీంతో వాళ్ల సంగతి చెప్తానని బాలు అంటాడు. తర్వాత సుమతిని రవి బైక్‌పై తీసుకెళ్లడం చూసిన కామాక్షి.. ప్రభావతికి చెబుతుంది.
12వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
12వ తేదీ గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కామాక్షి ఇంటికి వెళ్లిన ప్రభావతికి రవి, సుమతి బైక్ మీద వెళ్తున్నారని తెలుస్తుంది. దీంతో ఆమె వెంటనే రవికి పెళ్లి చేయాలని అనుకుంటుంది. ఆ వెంటనే ఇంటికి వెళ్లిన ప్రభావతి అందరినీ పిలిచి ఈ విషయాన్ని చెప్తుంది. దీంతో సత్యం తన ఫ్రెండ్ కూతురితో రవికి పెళ్లి చేయాలని ఎప్పుడో డిసైడ్ అయినట్లు చెబుతాడు. ఆ తర్వాత బాలును అక్కడకు పంపించి సంబంధం మాట్లాడమని చెప్పడంతో అతడు వెళ్తాడు. ఇంటికి వచ్చిన రవితో మీనా పెళ్లి గురించి చెప్తుంది. దీంతో అతడు షాక్ అయి తండ్రిని అడుగుతాడు. దీనికాయన రవికి సర్ధి చెప్పాలని చూస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
13వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
13వ తేదీ శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. రవికి పెళ్లి సంబంధం చూడడానికి వెళ్లిన బాలు.. కాసేపటికి ఇంటికి వచ్చి అది క్యాన్సిల్ అయిందని, దానికి కారణం ప్రభావతి గయ్యాలితనమే అని చెప్తాడు. అప్పుడామె నమ్మకపోవడంతో అక్కడ మాట్లాడిన రికార్డింగ్‌ను వినిపిస్తాడు. అప్పుడు సత్యం అసలు ఆ అమ్మాయిని నీకే ఇద్దాం అనుకున్నారు అనడంతో బాలు ఓవర్ చేస్తాడు. అది చూసిన మీనా అలుగుతుంది. తర్వాత ఆమె దగ్గరకు వెళ్లి నువ్వే నాకు సర్వస్వం అని బుజ్జిస్తాడు. మరోవైపు, మనోజ్ నోరు జారి ఉద్యోగం గురించి చెప్పడంతో బాలుకు డౌట్ వస్తుంది. అప్పుడు రోహిణి చీప్‌గా మాట్లాడడంతో మీనా ఆమెకు కౌంటర్ ఇస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
సెప్టెంబర్ 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ ఎన్నో ఊహించని సంఘటనలతో ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా ఈ వారంలో ప్రభావతి నుంచి ఇంటి పత్రాలు మీనా దగ్గరకు వెళ్లడం చూపించారు. అలాగే, రవికి పెళ్లి చేయాలని ప్రభావతి డిసైడ్ అవడం కూడా హైలైట్ చేశారు. కానీ, మొదటి సంబంధం ఫెయిల్ అవడంతో ప్రభావతి మాత్రం మరో సంబంధం వైపు వెళ్తుంది. అతడితో పాటు మౌనికకు పెళ్లి అని చెప్పడంతో ఇద్దరూ వద్దని చెబుతారు. ఇక, రవి పెళ్లి చూపులు ఏర్పాటు చేయడంతో సీరియస్ ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications










