Gunde Ninda Gudi Gantalu Meena: తెలుగు బుల్లితెరపై అమూల్య గౌడ క్రేజ్.. మీనా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ సీరియల్స్‌లో ఒకటిగా దూసుకుపోతున్న గుండె నిండా గుడి గంటలు (Gunde Ninda Gudi Gantalu). ఓ మధ్య తరగతి కుటుంబ కథతో సాగుతున్న ఈ సీరియల్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్‌తో ముందుకెళ్తుండగా, ఇందులో మీనా పాత్రలో నటిస్తున్న కన్నడ బ్యూటీ అమూల్య గౌడ (Amulya Gowda) తక్కువ సమయంలోనే తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యారు. సీరియల్‌లో పేదింటి అమ్మాయిగా, పద్ధతిగా కనిపించే మీనా పాత్రకు అమూల్య గౌడ ప్రాణం పోస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎంత రోజుకి రెమ్యూనరేషన్ అందుకుంటుందంటే?

కన్నడ నుంచి తెలుగు వరకు ప్రయాణం
మైసూర్‌కు చెందిన అమూల్య గౌడ పదేళ్ల క్రితం కన్నడ సీరియల్ స్వాతి ముత్తుతో బుల్లితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత కోమలి సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఫేమ్ తో పునర్ వివాహ, ఆరామనే వంటి సీరియల్స్‌లో నటించింది. కన్నడలో వచ్చిన ఫేమ్‌తోనే ఆమె కన్నడ బిగ్‌బాస్‌లో కూడా పాల్గొని హాట్ టాపిక్ అయ్యింది. తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆసక్తితో ఆమె చేసిన ప్రయత్నాలకు ఫలితంగా కార్తీక దీపం (Karthika Deepam) సీరియల్‌లో శౌర్య పాత్ర దక్కింది. ఆటో డ్రైవర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ క్యారెక్టర్ 'రౌడీ బేబీ'గా బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాతే గుండె నిండా గుడిగంటలు సీరియల్‌లో మీనా పాత్ర ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది.

Gunde Ninda Gudi Gantalu Meena Amulya Gowda Salary Per Day Revealed Telugu Serial Star Craze

మీనా పాత్రకు ఫుల్ మార్క్స్
గుండె నిండా గుడిగంటల్లో బాలు-మీనాల జోడీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో సీరియల్ మరింత పాపులర్ అయింది. అమూల్య ఎమోషనల్ సీన్స్ అయినా, ఫ్యామిలీ డ్రామా అయినా అద్భుతంగా పండిస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే రొమాంటిక్ సీన్స్ చేయడంలో మాత్రం కాస్త ఇబ్బంది పడతానని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఆమె గ్లామర్ లుక్స్‌తో హీట్ పెంచేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా ఫొటోలు షేర్ చేస్తూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకుంది.

వారానికి లక్షల్లో రెమ్యూనరేషన్!
ఇప్పుడు అసలు హాట్ టాపిక్ ఏంటంటే... అమూల్య గౌడ రెమ్యూనరేషన్. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం..గుండె నిండా గుడిగంటలు సీరియల్‌లో మీనా పాత్ర కోసం అమూల్య గౌడ రోజుకు 30 వేల నుంచి 35 తీసుకుంటుందట. ఈ లెక్కన చూస్తే.. వారానికి సుమారు రూ.2 లక్షలు తీసుకుంటున్నారట. అంటే నెలకు 20 రోజుల వరకు షూటింగ్ ఉంటుంది కాబట్టి.. దాదాపు రూ.6 నుంచి 8 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని అంచనాల ప్రకారం ఇది 10 లక్షల వరకు కూడా ఉండొచ్చని టాక్. ఈ అమ్మడు సీరియల్‌తో పాటు సోషల్ మీడియా ప్రమోషన్స్, బ్రాండింగ్ తో కూడా అదనపు ఆదాయాన్ని సంపాదిస్తోంది.

ఫ్యూచర్‌లో మరిన్ని తెలుగు ప్రాజెక్ట్స్?
గతంలో కార్తీకదీపంలో శౌర్యగా మెప్పించి, ఇప్పుడు గుండె నిండా గుడిగంటల్లో మీనాగా ఆకట్టుకుంటున్న అమూల్య గౌడ.. ముందు రోజుల్లో మరిన్ని తెలుగు సీరియల్స్‌లో కనిపించే అవకాశాలు ఉన్నాయని ఆమె అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌ను ఫుల్ స్పీడ్‌లో కొనసాగిస్తుండటంతో, బుల్లితెరపై అమూల్య గౌడ ప్రయాణం ఇంకా చాలా దూరం వెళ్లబోతోందనే చెప్పాలి. సీరియల్‌లో పద్ధతిగా కనిపించే మీనా, రియల్ లైఫ్‌లో మాత్రం గ్లామర్ అండ్ టాలెంట్‌తో లక్షల్లో సంపాదిస్తూ తెలుగు బుల్లితెరపై తనదైన మార్క్ క్రియేట్ చేసుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X