Gunde Ninda Gudi Gantalu: సంచలన నిర్ణయం తీసుకున్న బాలు.. ఇక మీనా జీవితం నాశమైనట్టేనా?

Gunde Ninda Gudi Gantalu: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న వాటిలో సీరియల్స్ ప్రధానమైనవి. ఈ సీరియల్స్ కు మహిళల నుంచి రోజు రోజుకు మంచి ఆదరణ లభిస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో రూపుదిద్దుకోవడంతో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి టాప్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial) ఒకటి. గత కొంత కాలంగా ప్రసారమవుతున్న ఈ సీరియల్‌ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' నెక్స్ వీక్ లో ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి.

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ లో తమ కూతురు తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని, రవి ఫ్యామిలీనీ పోలీస్ స్టేషన్ కు తీసుకవచ్చి ఇబ్బంది పెట్టడాన్ని శృతి వ్యతిరేకిస్తుంది. తాను ప్రేమించిన రవిని పెళ్లి చేసుకున్నానని, ఇందులో ఎవరి బలవంతం లేదని తేల్చి చెబుతోంది. కానీ, తన తల్లిదండ్రులే తమని విడకొట్టాలని ప్రయత్నిస్తున్నారని, తమకు రక్షణ కావాలని పోలీసులను కోరుతుంది శృతి దీంతో షాక్ అయినా శృతి తల్లిదండ్రులు అవమానంతో పోలీస్ స్టేషన్ నుండి వెళ్లిపోతారు. శృతి వాంగ్మూలంతో సత్యం ను పోలీసులు విడిచిపెడతారు. ఈ క్రమంలో మీనా వదిన తప్పులేదని రవి చెప్పిన బాలు మాత్రం పట్టించుకోకుండా మీనానం విడిచి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లిన సత్యం తనకు పోలీస్ స్టేషన్ లో జరిగిన అవమానం గుర్తుకు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు.

Gunde Ninda Gudi Gantalu October 21 th expected serial episode 275 here is full story

సోమవారం ఎపిసోడ్లో బాలు ఇంట్లో లేని సమయంలో మీనా తన అత్తగారింటికి వస్తుంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభావతి ఆగ్రహంతో ఊగిపోతుంది. 'అసలు నువ్వు ఎవరు? ఇంటికి ఎందుకు వచ్చావు? అంటూ నానా మాటలు అంటుంది.. మామయ్యతో తాను ఒక్కసారి మాట్లాడతానని, తన మాట వింటే తనని క్షమిస్తాడని మీనా ప్రాధేయపడుతుంది. కానీ ప్రభావతి కి ఆ విషయం అసలు నచ్చదు. ఇంట్లో నుండి బయటకు వెళ్లిపో అంటూ నిందిస్తోంది. ఈ క్రమంలో మనోజ్ కూడా చేసిన తప్పులను చూసి.. ఇప్పుడు ఏం తెలియనట్లు వ్యవహరిస్తున్నావా? అంటూ మీనాను అవమానిస్తాడు. మనోజ్ భార్య కూడా మీనాను ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంది. ఈ పరిస్థితికి కారణం నువ్వే అంటూ నిందిస్తుంది.

జరిగిపోయిన పెళ్లికి తప్పనిసరి పరిస్థితుల్లో తాను సాక్షిగా సంతకం చేయాల్సి వచ్చిందని, అందులో తన ప్రమేయం గాని తన తప్పుగా అని ఏమీ లేదని మీనా చెబుతుంది. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు చేశావు.. నీ వల్ల మీ మామయ్యకు శిక్ష పడిందంటూ మీనా పై ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ విషయం గురించి తాను మావయ్య తో మాట్లాడతానని ఆయన రూమ్ లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది.'ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఆయన దగ్గర నుంచి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నావ్. ఆయన పడుకున్నారు.ముందు బయటకు నడవవే 'అంటూ మీనాకు వార్నింగ్ ఇస్తుంది.

తన బాధను మామయ్య ఒక్కడే అర్థం చేసుకుంటాడని మీనా అంటుంది. నిన్ను, నీ కుటుంబాన్ని ఆదుకున్నందుకు నువ్వు ఆయనకు చేయాల్సిన సత్కారాలు బాగానే చేశావు.. ఆయనకు నీ వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ ప్రభావతి మరింత సీరియస్ అవుతుంది. అయినా.. ఈ ఇంట్లో ఎలా ఉండనిస్తానని భావించావు. ముందుగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళు అంటూ మీనా మెడలు పట్టుకుని బయటకు లాగుతుంది ప్రభావతి. దీంతో కోపోద్రిక్తురాలైన మీనా ఆగండి అత్తయ్య అంటూ గట్టిగా అరుస్తుంది.

'నన్ను వెళ్ళమని అధికారం ఎవరికి లేదు. ఆ మాట నా మెడలో తాళి కట్టిన నా భర్త చెప్పనివ్వండి అప్పుడు తానే వెళ్లిపోతాను' అని మీనా తెగేసి చెబుతోంది. వెంటనే ప్రభావతి..బాలుకు ఫోన్ చేయమని మనోజ్ కు ఆర్డర్ వేస్తుంది. మనోజ్ ఫోన్ చేయగా బాలు మాట్లాడుతూ..'అసలు దాని ఎవరు లోనికి రానిచ్చారు' అంటూ బాలు మండిపడతాడు. వెంటనే మీనా ఫోన్ లాక్కొని..'నేను చెప్పేది ఒక్కసారైనా వినండి' అంటూ ప్రాధేయపడుతుంది.

కానీ బాలు మాత్రం మీనా చెప్పేది ఏ మాత్రం పట్టించుకోకుండా.. 'నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ముందు ఇంట్లో నుండి వెళ్ళిపోవే' అంటూ వార్నింగ్ ఇస్తాడు. అలాగే తనని మెడలు పట్టుకొని బయటికి తోసేయండి అంటూ తన తల్లికి చెప్తాడు. బాలు మాటలు విన్న మీనా నిర్గాంత పోతుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక షాక్ కు గురవుతుంది. మరోవైపు.. బాలు మాటలు విన్న ప్రభావతి మరింత రెచ్చిపోతుంది. మీనాను ఇంట్లో నుండి గెంటేస్తోంది ప్రభావతి. ఈ విషయంలో సత్యం ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడో.. బాలు నిర్ణయంతో మీనా జీవితం రోడ్డుపాలైనట్లేనా? అనేది వేచిచూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X