గుండె నిండా గుడి గంటలు హీరో బాలుకు శ్రీముఖి లవ్ ప్రపోజ్.. పెళ్లికి ఏర్పాట్లు కూడా
యంగ్ అండ్ టాలెంటెడ్ యాంకర్ శ్రీముఖి బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును దక్కించుకుంది. 'పటాస్' షోతో ప్రారంభమైన తన కెరీయర్ ను ప్రస్తుతం మరింత జోరుగా నడిపిస్తోంది. అతి తక్కువ సమయంలోనే తన టాలెంట్ తో స్టార్ యాంకర్స్ జాబితాలో చేరిపోయింది. సమయస్ఫూర్తిగా మాట్లాడుతూ టీవీ షోల్లో సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ టీవీ ప్రొగ్రామ్స్ తో స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను ఎంతగానో అలరిస్తోంది. బుల్లితెర రాములమ్మగా కూడా గుర్తింపు దక్కించుకున్న ఈ బ్యూటీ టెలివిజన్ రంగంలో సంచనమే సృష్టించిందని చెప్పొచ్చు.
శ్రీముఖి టీవీ షోల్లోనే కాకుండా తన అభిమానులకు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటుంది. తన గురించిన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అభిమానులతో కూడా లైవ్ సెషన్స్ నిర్వహిస్తూ నిత్యం టచ్ లోనే ఉంటుంది. ఈ బుల్లితెర రాములమ్మకు కూడా గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం విశేషం. దీంతో శ్రీముఖికి సంబంధించిన ఎలాంటి విషయమైనా క్షణాల్లోనే నెట్టింట వ్యాప్తి చెందుతూ ఉంటుంది.

ఇక తాజాగా శ్రీముఖి పెళ్లి వార్త మరోసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో శ్రీముఖి హైదరాబాద్ కు చెందిన ఓ బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ వాటిని స్టార్ యాంకర్ శ్రీముఖి ఖండించారు. అలాంటిది ఏమీ లేదని, ఏదైనా ఉంటే తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా మాత్రం బుల్లితెర స్టార్ గా వెలుగొందుతున్న సీరియల్ నటుడిగా ఈ ముద్దుగుమ్మ ఏకంగా మ్యారేజ్ ప్రపోజల్ పెట్టడం హాట్ టాపిక్ గ్గా మారింది. ఇంతకీ ఆయన సీరియల్ స్టార్ ఎవరనుకుంటున్నారా? మరేవరో కాదు విష్ణుకాంత్.
విష్ణుకాంత్ అంటే గుర్తుపట్డడం కష్టమే.. కానీ గుండె నిండి గుడి గంటలు సీరియల్ హీరో బాలు అంటే గుర్తుపట్టని టెలివిజన్ ఆడియెన్ ఉండరు. డైలీ సీరియల్స్ లో ఈయన ఒక సంచలనం. ప్రస్తుతం గుడి నిండా గుడి గంటలు సీరియల్ లో బాలు పాత్రలో ఇరగదీస్తున్నాడు. ఈ సీరియల్ టీవీ సీరియ్స్ లో టాప్ ర్యాంకింగ్ తో దూసుకుపోతోంది. ఇక బాలు నటనకు కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనకు స్టార్ ఇమేజ్ కూడా దక్కింది.
అయితే తాజాగా గుండె నిండా గుడి గంటలు సీరియల్ నటుడు బాలు యాంకర్ 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' గేమ్ షోకు హాజరయ్యారు. ఈ షోకు శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా శ్రీముఖి బాలుతో మాట్లాడుతూ మ్యారేజ్ ప్రపోజల్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంట్లో అత్తమామ కూడా ఒప్పుకున్నారంటూ బాలులో చెప్పడం, బాలు సిగ్గు పడటంతో వేదిక మొత్తం సందడిగా, గోలగోలగా మారింది. ఈరోజు స్టార్ మాలో 11 గంటలకు ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇక బాలు ఎలా రియాక్ట్ అయ్యారనేది మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక విష్ణుకాంత్ కు 2003లోనే నటి సంయుక్తతో చెన్నైలో వివాహామైంది.


Click it and Unblock the Notifications











