ఏడ్చే సీన్‌లో కూడా నడుము చూపించమని టార్చర్.. గుండె నిండా గుడి గంటలు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆఫర్ల కోసం మూవీ మేకర్స్ నటీమణులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్స్ సైతం తాము ఇండస్ట్రీలో వేధింపులకు గురయ్యామని, తాము కూడా కాస్టింగ్ కౌచ్ బాధితులమేనని తమ చేదు అనుభవాలను వెల్లడిస్తున్నారు. తాజాగా బుల్లితెర ప్రేక్షకుల మనసును దోచుకుంటున్న గుడి గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరోయిన్ కూడా తన చేదు అనుభవాలను వెల్లడిస్తూ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేసింది‌. ఇంతకీ ఈ బుల్లితెర భామ ఏం కామెంట్స్ చేసిందంటే?

ఆ బుల్లితెర హీరోయిన్ ఎవరో కాదు స్టార్ మా లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో శృతి పాత్రలో అలరిస్తున్న విహారిక చౌదరి (Viharika Chowdary ). ఈ సీరియల్లో రవి భార్యగా, కోటీశ్వరాలు అమ్మాయిగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ అమ్మడు కేవలం సీరియల్ లోనే కాకుండా పలు సినిమాలు, యూట్యూబ్ సిరీస్, వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ అలరిస్తుంది. 'కాలం రాసిన కథలు', 'మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్', 'ఎవరెవడో', 'అరేంజ్డ్ లవర్స్' వంటి షార్ట్ ఫిల్మ్స్‌ నటించిన విహారిక చౌదరి, 'నేను నా రాక్షసి' వంటి వెబ్ సిరీసుల్లో నటించింది.

Gunde ninda Gudi gantalu Serial Actress Viharika Chowdary shocking Comments on Tollywood director

ఇటీవల యంగ్ హీరోయిన్ విహారిక చౌదరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్ డైరెక్టర్స్ ప్రవర్తన, అనవసర ఎక్స్‌పోజింగ్ గురించి సంచలన వ్యాఖ్యాలు చేసింది. 'ప్రతి డైరెక్టర్ వర్క్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. నేను వర్క్ చేసిన వాళ్లలో కూడా కొంతమంది ఎలా ఉంటారంటే.. అవసరమున్నా .. అవసరం లేకున్నా ఎక్స్‌పోజ్ చేయాలి. రొమాంటిక్ గా కనిపించాలి. రొమాంటిక్ గా చూపించాలి. అవసరం లేని సమయంలో కూడా బోల్డ్ లుక్స్ లో కనిపించాలి. ప్రతి ఫేమ్‌లో ఎక్స్‌పోజ్ చేయాలి" అని ఇబ్బంది పెట్టేవారని విహారిక చౌదరి చెప్పింది.

'ప్రస్తుతం ఆ పేరు చెప్పాలనుకోవడం లేదు. ఆ డైరెక్టర్ ఎలాంటి వాడంటే.. నిజంగా చెబుతున్నా మీరు నమ్మరు. డల్ సీన్ .. భర్తకు ఆరోగ్యం బాగోలేకపడుకుంటే.. అలాంటి సీన్ లో బ్యాక్ నుంచి కెమెరా పెట్టి.. నడుం చూపించాలి. నడుం కనిపిచాలి అంటున్నారు. అలాంటి విషాద సన్నివేశంలో ఎమోషనల్ గా ఉండాలని గానీ, నడుం ఎవరూ చూస్తారు. వాట్ ద హెల్" అని విహారిక చౌదరి తెలిపింది.

ఆమె ఇంకా మాట్లాడుతూ.. 'కొంతమంది డైరెక్టర్స్ తో వర్క్ చేస్తే.. అలాంటి ఇబ్బందులుండవు.. ప్రశాంతంగా ఎలాంటి గొడవ లేకుండా సాగిపోతుంది. మనం అవసరం లేని సమయంలో ఎక్స్ పోజ్ చేయడం అవసరమా అని ప్రశ్నించింది. అవసరం ఉంటే.. ఆ సీన్ డిమాండ్ చేస్తే.. కచ్చితంగా చేయాలి. అలా చేస్తేం.. ఆ రోల్ కు మన వంతు న్యాయం చేస్తాం'అంటూ షాకింగ్ విషయాలను వెల్లడించింది. గతంలో ఈ నటి చాలా బోల్డ్ కామెంట్స్ చేసింది. అమ్మాయిలకు స్వేచ్ఛ ఇవ్వడం లేదనీ, ఎటు వెళ్లోదని కండీషన్స్ పెడుతున్నారనీ, తానే అబ్బాయిని అయితే.. ఇష్టం వచ్చినట్టు తిరిగే వాడిన షాకింగ్ కామెంట్స్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X