గుండె నిండా గుడి గంటలు హీరో బాలు.. సీరియల్స్ కు రాకముందు ఏం చేసేవాడో తెలుసా?
బుల్లితెర ప్రేక్షకులను ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్ తో అలరిస్తున్నాడు బాలు. ఆయన అసలు పేరు విష్ణుకాంత్. ఆయన నటనకు టెలివిజన్ ఆడియెన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. ఏడాదికిపైగా గుండె నిండా గుడి గంటలు సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పాత్రలో ఎంతగానో లీనమై పోతున్నారు. రోజురోజుకు సీరియల్ పై మరింతగా ఆసక్తిని పెంచుతున్నారు. ఈ సీరియల్ ద్వారా విష్ణుకాంత్ కు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. ఆయనకంటూ టెలివిజన్ ఆడియెన్స్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే విష్ణుకాంత్ తెలుగు నటుడు కాకపోవడంతో ఆయన గురించి విషయాలను తెలుసుకోవడానికి అభిమానులు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ వివరాల్లోకి వెళితే..
విష్ణుకాంత్ వ్యక్తిగత వివరాలు..
గుండె నిండా గుడి గంటలు సీరియల్ నటుడు విష్ణుకాంత్ తమిళనాడుకు చెందినవాడుగా తెలుస్తోంది. ఆయన జనవరి 1, 1986లో పుట్టాడు. 39 ఏళ్ల వయస్సు ఉంటుంది. ఆయన 2008 నుంచి టెలివిజన్ రంగంలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఓవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు వెండితెరపైనా కూడా పలు చిత్రాల్లో మెరిశారు. ఇక ఈయన సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కూడా కొద్ది కాలం పనిచేసినట్టు తెలుస్తోంది. ఇదెలా ఉంటే.. విష్ణుకాంత్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం కూడా బుల్లితెర ఆడియెన్స్ లు తెలుసుకోవాలి.

సీరియల్స్ లోకి రాకముందు..
బుల్లితెర పైనా, వెండితెరపైనా మెరియాలన్నా.. నటుడిగా మంచి క్రేజ్ దక్కించుకోవాలన్నా అంత సులువైనా పని కాదు. ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఎన్నో సవాళ్లు, మరెన్నో ఇబ్బందులకు తట్టుకొని నిలబడాలి. అలాగే సరైన సమయంలో తమ నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించాలి. ఆ తర్వాత మంచి సక్సెస్ ను అందుకోవడం సాధ్యం. అయితే నటీనటులు తమ లక్ష్యాలను చేరుకునే వరకు కెరీయర్ లో ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ నటుడు విష్ణుకాంత్ కూడా చాలా కష్టపడ్డారు.
అయితే విష్ణుకాంత్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ కావడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేవారంట. దీంతో తమ వృత్తి మగ్గం వర్క్ చేసేవాడంట. అందుకు సంబంధించిన వీడియోను కూడా విష్ణుకాంతే ఓ సందర్భంలో సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారంట. అయితే ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్ కు మంచి ఆదరణ దక్కుతుండటంతో ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం తెలుగు టెలివిజన్ సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ టాప్ రేటింగ్ తో ప్రసారం అవుతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30కు స్టార్ మాలో ప్రసారం అవుతుంది.
భార్యతో విడాకులు..
విష్ణు కాంత్ తొలుత తమిళ సీరియల్స్ లోనూ నటించారు. జీ తమిళ్ ఛానెల్ లో 2018లో ప్రసారం అయిన 'ఓరు ఊర్ల ఓరు రాజకుమారి', ఎండ్రెండ్రుమ్ పున్నగై, సిప్పికుల్ ముత్తు, రజిని, గోకులమితిల్ సీత వంటి సీరియల్స్ లో నటించారు. ఇక వెండితెరపైన గంగా కావేరి చిత్రంలో నటించారు. ఈ చిత్రం 2008లో విడుదలైంది. ఇక ఆయన టెలివిజన్ నటి సంయుక్తను పెళ్లి చేసుకున్నారు. 2023 తర్వాత విడిపోయారు. ప్రస్తుతం విష్ణుకాంత్ సింగిల్ గానే ఉన్నారు.


Click it and Unblock the Notifications











