Gunde Ninda Gudi Gantalu October 28th Episode: రోహిణీని కొట్టిన బాలు.. సత్యం కి హార్ట్ ఎటాక్..

Gunde Ninda Gudi Gantalu: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న వాటిలో సీరియల్స్ ప్రధానమైనవి. ఈ సీరియల్స్ కు మహిళల నుంచి రోజు రోజుకు మంచి ఆదరణ లభిస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో సాగుతున్నతూ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి టాప్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial) ఒకటి. గత కొంతకాలంగా ప్రసారమవుతున్న ఈ సీరియల్‌ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' సోమవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి.

శుక్రవారం ఎపిసోడ్ లో.. బాలు తన స్నేహితుడు రాజేశ్ తో కలిసి బార్ కు వెళ్తాడు. ఈ క్రమంలో బాలుకి షాకింగ్ సంఘటన ఎదురవుతుంది. ఎవరు కూడా తమ భార్యలను తిట్టకూడదని, తన భార్య ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయాదని హెచ్చరిస్తాడు. ఈ మాటలు విన్న బాలు తన భార్య మీనా గురించి ఆలోచిస్తాడు. టెన్షన్ భరించలేని బాలు.. మీనాకు ఫోన్ చేయమని తన ఫ్రెండ్ కు కాల్ చేయమని చెప్తాడు. అసలు విషయం తెలుసుకున్న మీనా ఫోన్ కట్ చేస్తుంది. దీంతో మరింత టెన్షన్ పడ్డ బాలు మీనా ఇంటికి వెళ్తాడు. మరో వైపు బాలు చేతిలో గాయపడ్డ రవిని చూసి శృతి బాధపడుతుంది. ఇక నుండి వారికి మనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెబుతోంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 280 October 28th 2024 here is full story

సోమవారం ప్రారంభమయ్యే ఎపిసోడ్ లో బాలు తన ఫ్రెండు రాజేష్ తో కలిసి మీనా ఇంటికి చేరుకుంటాడు. మీనా దగ్గరికి వెళ్లి తనకి కాల్ చేయమని, అప్పుడు మీనా చూసినట్లు నాకు కూడా ఫోన్ లిఫ్ట్ చేయనని అంటాడు. దీంతో అర్ధరాత్రి వేళ మొగుడు పెళ్ళాల పంచాయతీలో తనని లాగొద్దంట రిక్వెస్ట్ చేస్తాడు రాజేష్. అయినా వినిపించుకోకుండా రాజేష్ ను మీనా ఇంటికి పంపిస్తాడు. దీంతో రాజేష్ వెళ్లి.. మీనా ఇంటి తలుపు కొడుతాడు.నువ్వు ఉండమ్మా నేను మాట్లాడుతున్నాను అంటూ మీనా వెళ్తుంది.

మీనా డోర్ తీయగానే.. బాలు కనిపించడం లేదు. ఇక్కడి వచ్చాడా? అంటూ ప్రశ్నిస్తాడు. కారులో బాలును చూసిన మీనా.. ఇప్పుడే వచ్చి కడుపునిండా తిని పడుకున్నారు అంటూ దిమ్మతిరిగిపోయే సమాధానం ఇస్తుంది. దీంతో రాజేష్.. బాలు దగ్గరకు వెళ్లి.. నువ్వేంటే.. నీ కంటే మీనా ఇంకా ముదురు. అసలు భయపడటం లేదంటాడు. సరేలే. మీనా బాగుంది కాదా అని బాలు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరో వైపు మీనా తల్లి.. ఏంటి ఇదంతా అల్లుడుగారు కనిపించట్లేదు అంటున్నాడు. నువ్వేమో.. అల్లుడు ఇంట్లోనే ఉన్నావ్ అని చెప్పుతున్నావ్ అనగా.. మీ అల్లుడుగారు బయట కార్ లోనే ఉన్నాడు. నేను ఎలా ఉన్నాననీ, తెలుసుకోవడానికి అతడ్ని పంపించారు అంటూ మీనా చెబుతోంది.

మరోవైపు బాలు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతకీ వాడు ఎక్కడున్నాడో ఏంటో అంటూ ప్రభావతిని ప్రశ్నించే లోపే.. మద్యం మత్తులో తోగుతూ ఇంట్లోకి అడుగుపెడతాడు. పైగా జాగ్రత్త మమ్మీ పడిపోతావ్ అంటూ ప్రభావతి కి జాగ్రత్త చెబుతాడు. దీంతో ఏంట్రా ఇది అంటూ సత్యం ప్రశ్నిస్తాడు. 'చూస్తే అర్థమవ్వట్లేదా.. సముద్రం మీద పడవలాగా ఎలా ఊగుతున్నాడో.. ఫుల్లుగా తాగినట్లు ఉన్నాడు' అంటుంది ప్రభావతి. 'నువ్వు భలే కనిపెడతావ్ మమ్మీ' అంటూ ప్రభావతికి సెటైర్ వేస్తాడు బాలు.

ఇంతలోనే మనోజ్ అక్కడికి వచ్చి.. 'ఏంట్రా మల్లి తాగి వచ్చావా ?' అని ప్రశ్నించగా.. 'నీలాగా పెళ్ళాం డబ్బులు ఖర్చు పెట్టుకుని తాగట్లేదు రా.. నా సొంత డబ్బులతో తాగాను' అంటూ మనోజ్ కు పంచ్ వేస్తాడు. తాను బాధతో తాగానని అంతేకాకుండా మన రవి గాడిని ఇష్టం వచ్చినట్లు కొట్టానని చెప్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఈ క్రమంలో మనోజ్ కు బాలుకు మధ్య వాగ్వివాదం జరుగుతుంది. ఆ వాగ్వాదం క్రమంగా పెరిగి గొడవకు దారి తీస్తుంది. ఈ క్రమంలో బాలు తన అన్న మనోజ్ పై చేయి చేసుకుంటాడు. అడ్డువచ్చిన మనోజ్ భార్య రోహిణి పై కూడా చేయి చేసుకుంటాడు బాలు.

'ఏంట్రా నువ్వు.. ఏం చేశావో నీకైనా అర్థం అవుతుందా? ఎంత పని చేసావ్ రా ఎందుకురా తయారయ్యారు. నా నమ్మకాన్ని ముక్కలు చేస్తూ వస్తున్నారు చిన్నోడైన జాబ్ చేస్తూ చక్కగా ఉంటాడని అనుకుంటే.. ప్రేమించి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకొని నా కుటుంబం పరువు తీశాడు' అంటూ సత్యం బాధపడతాడు. 'నేను ఏ రోజు నన్ను సింహాసనంపై కూర్చోబెట్టాలని అనుకోలేదురా.. కానీ కుటుంబం పరువు రోడ్డుకిడుస్తూ.. నా ముందే.. కొట్టుక చస్తున్నారు కదరా' అంటూ.. సోఫాలో పడిపోతాడు. హార్ట్ ఎటాక్ రావడంతో కుటుంబ సభ్యులందరూ కలిసి సత్యం హాస్పిటల్ కి తీసుకెళ్తారు. బాలు తన తండ్రి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు.

మరోవైపు మీనాకు పీడ కల పడటంతో ఉలిక్కిపడి లేస్తుంది. దీంతో మీనా తల్లి కంగారుపడుతుంది. నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టినాటి నుంచి ఈరోజు వరకు ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. ఈరోజు మీ చెల్లి వాళ్ళ నీకు సమస్య వచ్చిందని, చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నామంటూ బాధపడుతుంది. తన మామయ్య దగ్గరికి వెళ్లి మాట్లాడమని సలహా ఇస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X