Gunde Ninda Gudi Gantalu Oct29th Episode: చావు బతుకుల్లో సత్యం..మీనాను గెంటేసిన ప్రభావతి..అసలు విషయం బయటపడేనా
Gunde Ninda Gudi Gantalu October 29th Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న వాటిలో సీరియల్స్ ప్రధానమైనవి. ఈ సీరియల్స్ కు మహిళల నుంచి రోజు రోజుకు మంచి ఆదరణ లభిస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో సాగుతున్నతూ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి టాప్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial) ఒకటి. గత కొంతకాలంగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' మంగళవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లూక్కేయండి.
సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ లో బాలు ఫుల్లుగా తాగి వచ్చి ఇంటికి చేరుకుంటాడు. ఈ విషయాన్ని గమనించిన సత్యం ఆగ్రహానికి గురి అవుతాడు. రెస్టారెంట్ కు వెళ్లి తాను రవిని చితకబాదానని చెప్తాడు. ఈ క్రమంలో మనోజ్ కు బాలుకు మధ్య వాగ్వివాదం జరుగుతుంది. ఈ క్రమంలో బాలు.. తన అన్న మనోజ్ పై చేయి చేసుకుంటాడు. అడ్డువచ్చిన మనోజ్ భార్య రోహిణిపై కూడా చేయి చేసుకుంటాడు బాలు. ఈ ఘటనతో ఇంటిల్లిపాది షాక్ కు గురవుతారు. ఆ విషయాన్ని చూసిన సత్యం కోపంతో.. 'అరే బాలు. నా కడుపున చెడబుట్టావురా' అంటూ సోఫాలో కుప్పకూలతాడు. హార్ట్ ఎటాక్ రావడంతో కుటుంబ సభ్యులందరూ కలిసి సత్యం హాస్పిటల్ కి తీసుకెళ్తారు.

మంగళవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో సత్యం ఆరోగ్యపరిస్థితి గురించి కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటారు. ఇంతలో డాక్టర్ వచ్చి ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని, తెల్లవారితే గాని పరిస్థితి చెప్పలేమని, తాము సీనియర్ డాక్టర్లకు ఇన్ఫామ్ చేశామని చెప్పి వెళ్ళిపోతాడు. డాక్టర్ చెప్పిన టెర్మినాలజీ అర్థం కాక తన చెల్లిని అడుగుతాడు. బాలు చెల్లి .. అదేం లేదు..అనే చెప్పేలోపే.. మ్యాసివ్ అటాక్ అంటే తీవ్రమైన గుండెపోటు అని మనోజ్ అంటాడు. దీంతో ప్రభావతి బోరున విలపిస్తుంది.
'ఆయనకే ఒకటి తరువాత ఒకటి ఇలా ప్రమాదాలు ఎందుకు ఎదురవుతున్నాయి' అంటూ ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది. 'సరేనా సమయంలో ట్రీట్మెంట్ ప్రారంభమైంది. కాబట్టి ఇలాంటి ప్రమాదం ఉండదు ' అని రోహిణి ధైర్యం చెబుతుంది. 'ఇంకెక్కడ ధైర్యం రోహిణి.. నా ముగ్గురు కొడుకులు తన తండ్రిని సంతోషంగా ఉంచిన రోజులు లేవ్' అంటూ బాధపడుతుంది ప్రభావతి. ఈ క్రమంలో బాలుపై ఆగ్రహంతో విరుచుకుపడుతుంది. 'నేను ఇంకెప్పుడు ఎవరితోనూ గొడవ పడ్డాను.మా నాన్నకు ఏం కాదు' అంటూ బాలు బాధపడుతూ ఉంటాడు.
మరోవైపు మీనా తల్లి పార్వతి.. అల్లుడుగారు వస్తే.. తనతో ఎలాంటి గొడవ పెట్టుకోకుండా అత్తగారింటికి వెళ్లిపొమ్మని మీనాకు నచ్చచెప్తుంది. కానీ మీనా మాత్రం.. 'మా ఆయన గురించి నాకు బాగా తెలుసు ఆయన పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్లు అని భావిస్తాడు. నిన్న వచ్చింది కూడా నన్ను భయపెట్టడానికే.. ఆ విషయం మీకు అర్థం కాలేదు' అంటూ తన తల్లికి ఎదురు చెబుతుంది మీనా.
తాను అనుభవంతో చెబుతున్నానని, ఇంతగా ఎందుకు చెప్తున్నానో.. కాస్త ఆలోచించమనీ, పెళ్లయ్యాక ఆడదానికి మొగుడే దిక్కు. మొగుడుతో ఉంటేనే ఈ లోకం గౌరవిస్తుందమ్మా.. అది కాపాడుకో అని చెప్తున్నాను. అల్లుడుగారు వస్తే వెళ్'ళు అంటూ తన పూల కొట్టుకు వెళ్ళిపోతుంది పార్వతి. సుమతి కూడా తన తల్లి తో షాపుకు వెళ్తుంది.
ఆ తర్వాత మీనా తన తండ్రి ఫోటో దగ్గరికి వెళ్లి..'చూస్తున్నావా నాన్న మమ్మల్ని .. ఎంత బాధ బాధపడుతున్నామో.. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాక.. మా మామయ్యను తండ్రి స్థానంలో ఉండి మన కుటుంబ కష్టాలను పంచుకుంటున్నాడు. తన దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి క్షమించమని కోరుతాం' అంటూ మీనా బాధపడుతుంది.
ఈ క్రమంలో బాలు చెల్లెలు మౌనికకు ఫోన్ చేస్తుంది మీనా. 'పక్కనే ఎవరైనా ఉన్నారా .. తాను రవి మాటలు విని తాను తప్పు చేశాను' అంటూ బాధపడుతుంది. ఇంట్లో అందరూ నన్ను చూస్తేనే మండిపడతారని, కనీసం నా మాటలు మావయ్య మాత్రమే వింటాడని, మావయ్య గారు యూనియన్ ఆఫీస్ కి వెళ్తారు కదా అప్పుడు వెళ్లి కలుస్తాననీ చెబుతుంది. ఇంతలోనే రాత్రి నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందని తనని రాత్రి హాస్పిటల్ చేర్పించామని, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని మౌనిక చెబుతుంది.
దీంతో మీనా కంగారుపడుతూ..ఎక్కడున్నారు? ఏ హాస్పిటల్లో ఉన్నారు? అంటూ హాస్పిటల్ కు బయలుదేరుతారు. మీనా హాస్పిటల్ కు రాగానే ప్రభావతి మండిపడుతుంది. 'నువ్వు ఎందుకు వచ్చావు. ఇక్కడ నుండి వెళ్ళిపో..' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మనోజ్ కూడా 'మా నాన్నకి జీవితంలో అంత అవమానం ఎప్పుడు జరగలేదు. ఆయన గుండె వీక్ అయిపోయింది. ఏమైనా ఉంటే బాలు నువ్వు తేల్చుకోండి' అంటూ అవమానిస్తాడు.
రోహిణి కూడా.. 'ముందు వెనక ఆలోచించకుండా వెళ్లి రవి పెళ్లి చేశావు. అది చివరికి ఎక్కడికి దారితీస్తుందో చూసావా.. అంటూ నిందిస్తుంది. దీంతో మౌనిక రియాక్ట్ అవుతూ.. ' అంతా రవి అన్నయ్య చేశాడు. మధ్యలో వదినను ఇరికించి తన జీవితాన్ని ఆగం చేశాడు. వాన్ని అనకుండా మొత్తం వదిన చేసినట్లు క్రియేట్ చేస్తారేంటీ?' అని నిలదీస్తోంది.
'ప్లీజ్ అత్తయ్య.. మామయ్య గారి పాదాల మీద పడి క్షమాపణ కోరుకుంటున్నాను' అంటూ మీనా ప్రాధేయపడుతుంది. అయినా ప్రభావతి కనికరించకుండా..'హేయ్ పోవే మా బాధలో మేము ఉన్నాం.. 'అంటూ ప్రభావతి మీనాకు వార్నింగ్ ఇస్తుంది. 'మళ్లీ మా నాన్న దగ్గర కన్నీళ్లు పెట్టుకొని నీ గోడు చెప్పుకుంటే ఆయన కరిగిపోయి.. క్షమిస్తారని భావిస్తున్నావా ?'అంటూ మనోజ్ కూడా అవమానించడంతో మీనా అక్కడినుండి ఏడుస్తూ వెళ్ళిపోతుంది.


Click it and Unblock the Notifications











