Gunde Ninda Gudi Gantalu December 16th: మీనా వీడియో వైరల్.. సంజూ టార్గెట్ మారిందా?

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ లో మీనా శృతికి ధైర్యం చెబుతుంది. అందరూ కలిసి ఉంటే ఇలాంటివి కలిసి ఎదుర్కోవచ్చని, రవి చెప్పేది కూడా ఒకసారి ఆలోచించమని సూచిస్తుంది. ఆ తర్వాత సురేంద్ర ఇంటికి మీనా చేరుకుంటుంది. అక్కడ పరిస్థితి గమనించిన మీనా చెప్పకుండా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకు వచ్చావు? అని సురేంద్ర ప్రశ్నించగా.. మీ కూతురు జీవితం ప్రమాదంలో ఉందని, మీ కూతుర్ని ఇచ్చి చేయాలనుకున్న సంజు.. ఇప్పుడు మీ కూతురుపై పగ పెంచుకున్నాడని, తన జీవితం ఆగం చేయాలనే ఉద్దేశంతో యాసిడ్ దాడి చేశాడని చెబుతాను ఇప్పటికైనా శృతికి రక్షణగా ఉండమని కోరుతుంది.

మరోవైపు.. మీనా చేసిన సాహసం మీడియా కంటపడుతుంది. దీంతో మీడియా వాళ్ళు ఇంటికి వస్తారు మీనా చేసిన సాహసాన్ని అందరికీ చూపిస్తారు దీంతో కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు. ఈ సమయంలో మీనా మాట్లాడుతూ క్రెడిట్ మొత్తం తన భర్తకు ఇస్తుంది. ఆ తర్వాత బాలు మీడియా వాళ్ళు తెచ్చిన ఇటుకను తీసుకొని, ఇంట్లో వాళ్లకు ఇన్ డైరెక్ట్ గా భయపడతాడు. సత్యం కూడా తన కోడలు మీనాను మెచ్చుకుంటారు. అనుకువగానే కాదు.. అవసరమైతే.. ఆదిపర శక్తిగా ఉండాలని సూచిస్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 315 December 16th 2024 here is full story

సోమవారం ఎపిసోడ్ లో బాలు తన భార్యను ప్రశంసలతో ముంచెత్తుతాడు. దీంతో ప్రభావతి కుళ్ళుకుంటుంది. ఆడది అన్నాక అనుకువగా ఉండాలి అంటుంది. దీంతో సత్యం రియాక్ట్ అవుతూ. 'ఆడది అంటే అబల మాత్రమే కాదు సబల.. మీనాకు భూదేవికి ఉన్నంత శాంతం ఉంది. అలాగే తేడా వస్తే భూకంపం సృష్టించగల శక్తి కూడా ఉంది' అంటూ మీనాను ప్రశంసిస్తాడు. మరోవైపు.. బాలు రాయిని పట్టుకుని అటు ఇటు తిరుగుతాడు. దాన్ని చూసి సత్యం ఆ రాయి ఎందుకు తీసుకొచ్చావు రా? అని అడుగుతాడు. పూర్వం రాజుల విజయానికి గుర్తుగా స్తూపాలు, కోటలు కట్టేవారు. నా భార్య విజయాన్ని గుర్తుగా ఈ రాయిని తీసుకొచ్చాను. అంటూ చూసిన ప్రతిసారి ఆ విజయం గుర్తు రావాలని ఇన్ డైరెక్ట్ గా ప్రభావతికి వార్నింగ్ ఇస్తాడు.

దీంతో మనోజ్.. మీనాతో జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తాడు. ఈ సమయంలో మీనాను రూమ్ లోకి రమ్మని బాలు పిలుస్తాడు. తనకు పని ఉందని అత్తయ్యకు కాపీ పెట్టాలని చెబుతుంది. దీంతో ప్రభావతి కంగుతిని వద్దులేమ్మ.. రోహిణి పెడుతుంది అంటూ మీనాకు రెస్పెక్ట్ ఇస్తుంది ప్రభావతి. మరోవైపు సురేంద్ర.. నీలకంఠం ఇంటికి వెళ్లి జరిగిన కథంతా చెబుతాడు. వైరల్ గా మారిన వీడియోని చూపించి తన కొడుకు బాగోతం బయటపెడతాడు. వాడు నా కొడుకు కాదంటూ నీలకంఠం తోసిపడేస్తాడు. దీంతో ఆగ్రహానికి గురైన సురేంద్ర తాను ఇప్పుడే వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని, పోలీసులే అసలు కథ బయటపడతారని వార్నింగ్ ఇస్తాడు.

మీనా వీడియో వైరల్ గా మారడంతో ప్రభావతి కూడా ఫోన్ చేసి.. మీనాను పొగుడుతారు. దీంతో ప్రభావతికి ఎక్కలేని అసూయ బయటకి తన్నుకు వస్తుంది. నేను కూడా దారిన పోయే వాడిపై రాయివేస్తానని అంటుంది. దీంతో రియాక్ట్ అయ్యే సత్యం.. 'నీకోసం మీడియా రాదు.. పోలీసులు వస్తారు. పైగా హంతకురాలు అని పేపర్లో పెద్ద హెడ్డింగ్ కూడా పెడతారు' అని జలక్ ఇస్తాడు. ఇంతలోనే బాలు ఇంటికి వచ్చి స్వీట్స్ పంచుతాడు. తన భార్య ను ఊరు ఊరంతా పొగుడుతున్నారని, తాగు పొద్దున్నుండి కాల్స్ వస్తున్నాయని చాలా సంతోషపడతాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 315 December 16th 2024 here is full story

తర్వాత మీనాను రూమ్ లోకి రమ్మని సైగ చేస్తాడు. కానీ, మీనా పట్టించుకోకుండా తన పనిలో తాను ఉంటుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న సత్యం.. బాలు పిలుస్తున్నాడమ్మా వెళ్ళు అని చెబుతాడు. రూమ్ లోకి వెళ్ళగానే బాలు సీరియస్ అవుతాడు. నేను అంతగా పిలుస్తుంటే పట్టించుకోవా అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో మీనా స్టోన్ ను చూపిస్తుంది. ఆ తర్వాత బాలు సైలెంట్ అయి.. తన ఫ్రెండ్స్ తనని పార్టీ ఇవ్వమంటున్నారని, తాను బయటికి వెళ్తున్నానని, తన తండ్రికి తెలియకుండా మేనేజ్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తాడు. దీంతో మీనా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. తన భార్యను నా బంగారం పిచ్చి లచ్చి అంటూ పొగుడుతూ కిస్ చేస్తాడు. దీంతో మీనా మురిసిపోతుంది.

మీనా పర్మిషన్ ఇవ్వడంతో బాలు తన స్నేహితులతో కలిసి బార్లో సిట్టింగ్ వేస్తారు. మరోవైపు అదే బార్ లో సంజు తన ఫ్రెండ్స్ కూడా సెట్టింగ్ వేస్తారు. ఈ సమయంలో బాలు ఫ్రెండ్ రాజేష్ మీనా వీడియో ప్లే చేస్తూ.. అందులో ఉన్న దుండగులను చితక్కొట్టాలంటూ విజిల్స్ వేస్తూ.. హంగామా చేస్తాడు. దీంతో సంజుకి ఎక్కడలేని కోపం వస్తుంది. ఈ క్రమంలో బాలు ఫ్రెండ్ రాజేష్ తో సంజు గొడవపడతాడు. దీంతో ఆగ్రహానికి గురైన బాలు.. సంజు ను అతని ఫ్రెండ్స్ ను చితకొడుతాడు. ఇక్కడితో సీరియల్ పూర్తి అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X