Gunde Ninda Gudi Gantalu December 17th: ప్రభావతి ప్లాన్ బెడిసి కొట్టిందా? బాలు జీవితం ప్రమాదంలో పడుతుందా?

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం ఎపిసోడ్లో బాలు.. సంజీవ్ ను చితకగొట్టి, తన ఫ్రెండు రాజేష్ షర్ట్ చింపేసినందుకు ప్రతికారంగా సంజీవ్ షర్ట్ ను కూడా చింపివేసి అవమానిస్తాడు. అంతేకాకుండా మోకాళ్ళ మీద కూర్చొని పనిష్మెంట్ ఇస్తాడు. మరోసారి పైసలు ఉన్నాయనే బలుపు చూపిస్తే.. నరికేస్తా అంటూ వార్నింగ్ ఇస్తాడు. దీంతో సంజూ అవమానంగా ఫీల్ అవుతాడు. ఎలాగైనా బాలు చంపేయాలని ఫిక్స్ అవుతాడు.

మరోవైపు.. బాలు పుల్ గా తాగి ఇంటికి చేరుకొని మీనాను పిలుస్తాడు. మీనా వచ్చి సైలెంట్ గా బాలుని రూమ్ లోకి తీసుకెళ్తుంది. పీకలా దాగా తాగిన బాలు ఏం చేస్తున్నాడో తెలియకుండా ప్రవర్తిస్తాడు. మీనా కొట్టిన రాయిని దేవుడికి పెట్టినట్టు పూలు పెట్టి పూజిస్తాడు. ఎందుకండీ ఇలా చేస్తున్నారు? అని అడగగా.. పూర్వం రాజుల విజయానికి గుర్తుగా కోటలు, స్థూపాలు కట్టేవారు. నా పెళ్ళాం విజయానికి గుర్తుగా ఈ రాయికి పూజ చేస్తున్న.. ఇది మామూలు రాయి కాదు. దీంతో మీనా సంతోషపడి దీనికంతటికి కారణం నువ్వే గురుజీ అని బాలుని పొగుడుతుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 316 December 17th 2024 here is full story

మరీ ఆరోజు పోలీస్ స్టేషన్లో అందరి ముందు చేయి చేసుకుంటే తనని ఎందుకు కొట్టలేదని అడుగుతాడు. తాను బాధ్యత గల భార్యని అందుకే సహనంగా ఓర్పుగా మెలిగానంటూ సమాధానమిస్తుంది మీనా. కానీ, మీ ప్లేస్ లో వేరే వ్యక్తి ఉంటే.. వాడిని బండకేసి కొట్టేదాన్ని జలక్ ఇస్తుంది. తన మీద మాత్రం అలాంటి ప్రయోగాలు చేయొద్దని రిక్వెస్ట్ చేసుకుంటాడు బాలు.

మరసటి రోజు ఉదయాన్నే మీనాక్షి ఓ రేంజ్ లో మేకప్ అయ్యి ప్రభావతి ఇంటికి చేరుకుంటుంది. మీనా వీడియో చూసి తాను భయపడ్డానని, తనతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. లేకపోతే చంద్రముఖి సినిమాలో జ్యోతిక మంచం లేవట్టినట్టు నిన్ను కూడా ఎత్తి పారేస్తుంది జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఇదే మంచి సమయం అని రవిని శృతిని ఇంటికి తీసుకురావాలని చెబుతోంది. వారిని రక్షణ లేదని ఒప్పించడానికి ఇది కరెక్ట్ సమయమని సలహా ఇస్తుంది మీనాక్షి.

దీంతో ప్రభావతి, మీనాక్షిలు కలిసి రవి ఇంటికి వెళ్లారు. రవి తన అమ్మను చూడగానే ఎంతో సంతోషిస్తాడు. తన కోడలికి ఏమైందని ఆరా తీస్తుంది. ఇంతకీ తన కోడలు ఏది అని ప్రశ్నిస్తుంది? దీంతో రవి శృతిని పిలవడానికి వెళ్తాడు. రెస్టు తీసుకుంటున్న శృతిని నిద్రలేపే సరికి రవిపై చిరాకు పడుతోంది. అనవసరంగా తనను డిస్టర్బ్ చెయ్యొద్దంటూ అరుస్తుంది. తన మమ్మీ వచ్చిందని చెబుతాడు. దీంతో తన రూంలో నుంచి కిందికి వస్తోంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 316 December 17th 2024 here is full story

మరోవైపు శృతి ప్రవర్తనను చూసి ప్రభావతి షాక్ అవుతుంది. శృతి రాగానే తన కాళ్లకు నమస్కరిస్తుందని ప్రభావతి భావిస్తుంది. కానీ, ఊహించని విధంగా వచ్చి కాలు మీద కాలు వేసుకుని సోఫాలో దర్చాగా కూర్చుని ఫోన్ మాట్లాడుతుంది. ఇంతలోనే మీనాక్షి.. శృతి వర్క్ టైమ్స్ గురించి అడుగుతుంది. తాను డైలీ రాత్రి 11 గంటల సమయం కు డబ్బింగ్ కు వెళ్లి మూడు గంటల ప్రాంతంలో వస్తానని చెబుతుంది. దీంతో ప్రభావతి షాక్ అవుతుంది అంత రాత్రిపూట ఒంటరిగా వెళ్లడం సరికాదని ఇంటికి వెళ్దామని అక్కడైతే అందరూ ఒకరికొకరు తోడుగా ఉంటామని చెబుతోంది.

దీంతో శృతి ఇలా సమాధానం చెప్పాలో తెలియక ఇంట్లో బాలు ఉంటాడని, అతడు ఇంట్లో ఉండగా.. తాము ఆ ఇంట్లో అడుగుపెట్టలేమని చెబుతోంది. దీంతో ప్రభావతి వాడి గురించి పట్టించుకోకమ్మ.. అన్ని నేను చూసుకుంటా.. అని చెప్తుంది. దీంతో శృతి కన్విన్స్ అయి ఇంటికి వస్తానంటూ మాట ఇస్తుంది. కానీ, ఇంతలోనే శృతి అమ్మ శోభ వారింటికి చేరుకుంటుంది. దీంతో సీరియల్ ఎండ్ అవుతుంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X