Gunde Ninda Gudi Gantalu December 18th: ప్లాన్ మర్చిన సంజూ.. నోరు జారిన రోహిణి..
Gunde Ninda Gudi Gantalu December 18th: గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో శోభ కూడా శృతిని చూడ్డానికి వస్తుంది. దీంతో ప్రభావతికి ఎక్కడలేని కోపం వస్తుంది. ఎలాగైనా శోభను వెళ్లగొట్టాలని, ప్రభావతి సూటి పోటీ మాటలు అంటుంది. దీంతో శోభ కూడా కోపం వస్తుంది. మీరు మాత్రమే బాధ్యతగా ఉన్నట్లు మాట్లాడుతున్నారు. మేము కూడా మా కూతురిని బాధ్యతగానే పెంచాం.కానీ, మీ వాడే ప్రేమ.. ప్రేమ.. అని మా కూతురిని తన వలలో వేసుకున్నాడు అంటుంది శోభ. అయినా పెళ్లి కాగానే బాధ్యతలు తీరిపోతాయి. పిల్లలు ఎలా ఉన్నారో చూడాలి కదా అంటూ ప్రభావతి మరో డైలాగ్ వేస్తుంది.
దీంతో శోభకు మరింత కోపం వస్తుంది. వెంటనే శృతిని తీసుకువెళ్తానని, ఇక్కడ తన కూతురికి రక్షణ లేదని అంటుంది. దీంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. పెళ్లయ్యాక శృతి తన కోడలు అని, తన కోడలు తన ఇంటికి వస్తుందని చెబుతోంది. లేదు తన ఇంటికి వస్తుందని శోభ కూడా గట్టిగా ఉంటుంది. ఇటు అత్త.. అటు అమ్మను కాదనలేక పోతుంది. ఈ క్రమంలో తన తల్లిని వెళ్లిపొమ్మని గట్టిగా అరుస్తుంది. దీంతో శోభ బాధ పడుకుంటూ వెళ్ళిపోతుంది. మరోవైపు రవి కూడా తన తల్లిని వెళ్లిపొమ్మని, ఇంట్లో బాలు, నాన్నను ఒప్పించమని, ఆ తర్వాతే తాము ఇంట్లోకి వస్తామని చెబుతుంది.

మరోవైపు.. బాలుపై అధికారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు సంజూ. ఈ క్రమంలో తన స్నేహితులు బాలు ఇంటికి తీసుకువస్తారు. బాలుని చూడగానే ఆవేశంతో ఊగిపోతాడు. వెంటనే గన్ను తీసి షూట్ చేయాలని ప్రయత్నిస్తాడు. ఇంతలోనే మీనా బయటికి వస్తుంది. అప్పుడు సంజీవ్ కు అర్థం అవుతుంది. రవి, శృతి, మీనా, బాలు అందరూ ఒక ఇంటి వారేనని, వారికి జీవితంలో మర్చిపోలేని విధంగా బుద్ధి చెప్పాలని తన ప్లాన్ కు మార్చుకుంటాడు.
మరోవైపు.. ప్రభావతి ఎలాగైనా శృతిని రవిని ఇంటికి తీసుకురావాలని ప్లాన్ వేస్తోంది. తాను తిననని మొండికేసి కూర్చొంటుంది ప్రభావతి. మీనా వెళ్లి ఎంత రిక్వెస్ట్ చేసిన తాను రానని, రవిని శృతిని ఇంటికి తీసుకువచ్చేంత వరకు తాను పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టనని అంటుంది. ఇంతలోనే బాలు వచ్చి ఆకలైతే వాళ్లే వచ్చి తింటారని, అనవసరంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయవలసిన అవసరం లేదని, అలా చేసి తనని తన తండ్రిని ఒప్పించలేరని కరాకండిగా చెప్పేస్తాడు బాలు. ఇంతలోనే మనోజ్ కూడా అక్కడికి చేరుకుంటారు తమను భోజనానికి పిలవడం లేదు ఏంటి అని అంటాడు. దీంతో బాలుకి మండుతుంది మీనాను పిలిచి బొట్టు తీసుకురమ్మని, బొట్టు పెట్టి వారిద్దరిని పిలవమని సెటరికల్ గా పంచ్ చేశాడు.

రవి గురించి ప్రభావతి మనోజ్ను అడుగుతుంది. దీంతో మనోజ్ కూడా సందిగ్ధంలో పడతాడు. రవి ఇంట్లోకి వస్తే తనకు మర్యాద ఉండదని అనుకుంటాడు. కానీ, ఆ విషయాన్ని బయటికి చెప్పలేకపోతాడు. పొంతన లేని సమాధానం చెప్పి.. అబాసు పాలు అవుతాడు. ఈ క్రమంలో రోహిణి మాట్లాడుతూ.. పిల్లలు దూరమైన బాధ కన్నతల్లికి మాత్రమే తెలుస్తుందని, తాను కూడా ఆ బాధను అనుభవిస్తున్నానని నోరు జారుతుంది. దీంతో బాలుకి కోపం వస్తుంది పది మంది పిల్లలు కన్నట్టు మాట్లాడుతున్నావేంటి పార్లరమ్మ అని పంచ్ వేస్తాడు బాలు.
దీంతో ఇంటిల్లిపాతికి రోహిణి పై అనుమానం వస్తుంది. ఆడవారికి ఆ బాధ అర్థం అవుతుంది అంటూ కవర్ చేస్తుంది. ఈ సమయంలో సత్యం మాట్లాడుతూ.. సురేంద్ర తన ఇంటికి వచ్చి మాట్లాడుకునే విధానం తనకు నచ్చలేదని, అలాగే తను కావాలని జైలుకు పంపించాడని బాధపడతాడు సత్యం. ఈ సమయంలో తన ఆత్మ గౌరవాన్ని చంపుకొని, ఓ తల్లి ప్రేమను అర్థం చేసుకోవాలో? రవిని తీసుకువచ్చి తన ఆత్మాభిమానాన్ని చంపుకోవాలో? తనకు అర్థం కావడం లేదని అంటాడు సత్యం. దీంతో సీరియల్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











