Gunde Ninda Gudi Gantalu December 19th: మీనాను అలా చూసి బాలు టెంప్ట్ .. సంజూ టార్గెట్ వేరే లెవల్..

Gunde Ninda Gudi Gantalu December 19th: గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం ఎపిసోడ్ లో ప్రభావతి తిననని మొండికేసి కూర్చోవడంతో సత్యం ఓ మెట్టు దిగి వస్తాడు. రవి, శృతి లు ఈ ఇంటికి రావాలంటే .. ముందుగా సురేంద్ర తన ఇంటికి వచ్చి, శృతిని మీ కోడలు అనీ, ఇకపై నా కూతురి బాధ్యత మీదేనని ఇంట్లో అప్పజెప్పాలని ఓ కండిషన్ పెడతాడు. దీంతో బాలు కూడా తన తండ్రి మాటతో ఏకీభవిస్తాడు. ఇది జరిగే పనేనా అని ప్రభావతి అనగా.. తాను ఇంతకంటే దిగజారలేనని, ఇది నీ కోసం ఇస్తున్న మాట అని సత్యం చెబుతాడు. దీంతో ప్రభావతి డీలపడుతుంది.

అన్ని విషయాలు మెల్లగా సర్దుకుంటాయని, మీనా కూడా సర్దు చెబుతోంది. దీంతో ప్రభావతి తనకు ఆకలేస్తుంది అంటూ అందర్నీ హడావిడి చేసి తన పట్టును విడుస్తోంది. మరోవైపు బాలు ఫ్యూచర్ ప్లాన్ కోసం డబ్బును పొదుపు చేస్తూ ఉంటాడు. ఇంతలోనే మీనా కాఫీ పట్టుకొని వస్తుంది. అయితే మీనా కాఫీ వేడిగా ఉండడంతో తన చీర కొంగు తో పట్టుకొని వస్తుంది. అయితే ఆ విషయాన్ని బాలు గమనించకుండా అవసరమా ఎలా పట్టుకుని రావడం అంటూ కాఫీ కప్పును పట్టుకుంటాడు. దీంతో బాలు చెయ్యి కాలుతుంది. తాను కాలుతుందని ఉద్దేశంతోనే అలా తీసుకొచ్చానని చెబుతుంది మీనా. ఈ సమయంలో బాలు.. మీనాను చూసి కాస్త టెంప్ట్ అవుతాడు. ఆ విషయాన్ని గమనించిన మీనా తన నడుమును చూపిస్తూ రెచ్చిపోతుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 318 December 19th 2024 here is full story

కానీ బాలు తన బాధ్యతలు గుర్తుకు వచ్చి.. తన అప్పులు తీరేంతవరకు నువ్వు మంచం మీద.. నేను చాపపైనే అంటాడు. దీంతో మీనా ఫీల్ అవుతుంది. మరోవైపు మీనాక్షి ప్రభావతి ఇంటికి చేరుకుంటుంది. రవిని తీసుకురావడం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బాలు ఒప్పుకున్న సత్యం ఒప్పుకునేలా లేదు కాదా అని కామాక్షి ఫీల్ అవుతుంది. ఇంతలోనే పెళ్లిళ్ల పేరయ్య ప్రభావతి ఇంటికి చేరుకుంటాడు. ఈ సమయంలో మీనాక్షి నాన్ సింక్ లో మాట్లాడి పేరయ్యను ఆగం చేస్తుంది. తనని కాస్త మాట్లాడనివ్వమని, తాను వచ్చింది రవి కోసం కాదనీ, మౌనిక కోసం కోటీశ్వరుల సంబంధం తీసుకువచ్చానని చెబుతాడు.

నీలకంఠం అనే కోటీశ్వరుడు కొడుకు సంజీవ్, ఒక్కడే కొడుకు. అతడు మీ అమ్మాయిని ఎక్కడో చూసి మనసు పారేసుకున్నాడట. దీంతో అతని తల్లిదండ్రులు తన కొడుకుకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారట. అందుకే నాతో కబురు పంపారు అంటూ పెళ్లిళ్ల పేరయ్య అసలు విషయాన్ని చెప్తాడు. ఈరోజు సాయంత్రం వరకు మంచి ముహూర్తం ఉందని ఒకసారి వచ్చి మాట్లాడుకుంటే బాగుంటుందని పెళ్లిళ్ల పేరయ్య ప్రభావతిని ఆగం పెడతాడు. దీంతో కంగారుపడుతూ తాను ఇప్పుడే వస్తానంటూ ఇంట్లో ఎవరికి అసలు విషయం చెప్పకుండా వెళ్ళిపోతుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 318 December 19th 2024 here is full story

మరోవైపు సంజు తన రూమ్లో టార్గెట్ బోర్డ్ పై శృతి,బాలు, రవి, మీనా, మౌనిక ఫోటోలను పెట్టుకొని టార్గెట్ పిన్స్ ను ఫోటోలపై వేస్తాడు. ఈ విషయాన్ని గమనించిన సంజీవ తల్లి ఏం చేస్తున్నావ్ అంటూ నిలదీస్తోంది. శృతి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిందని, రవి తనని జోకర్ గా యూత్ చేసుకున్నాడని, ఇక మీనా.. తన ప్లాను చెడగొట్టి తనని అందరి ముందు రాళ్లతో కొట్టిందని, ఇక బాలు తనని బార్లో కొట్టి అవమానించారని చెబుతాడు. వీళ్ళందర్నీ టార్గెట్ చేయడం కోసం రోజు రోజు నరకం చూపించడం కోసం తాను మౌనికను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యానని అసలు విషయాన్ని బయటపెడతాడు.

దీంతో సంజు తల్లి షాక్ అవుతుంది. ఈ ఫ్లాన్ కు నీలకంఠం కూడా సపోర్ట్ చేస్తాడు. తన కొడుకుకు ఇలాంటి లో క్లాస్ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తేనే సరిగా ఉంటుందని వారు కుక్కేనుల పడి ఉంటారని చెబుతాడు. ఇది సరికాదు అని సంజీవ్ తల్లి చెప్పడంతో.. మీ అమ్మ పెద్ద ఫోటోకు ప్రేమ్ చేపించు.. దండేయాలి' అంటారు. వచ్చిన వారి ముందు సైలెంట్ గా ఏం మాట్లాడకుండా ఉంటూ.. నేను చెప్పినట్లు వినాలని హెచ్చరిస్తాడు. దీంతో సంజూ తల్లి సైలెంట్ అయిపోతుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 318 December 19th 2024 here is full story

ఇంతలోనే.. నీలకంఠం ఇంటికి ప్రభావతి కామాక్షి లు చేరుకుంటారు. నీలకంఠ ఇల్లు చూడగానే వారికి ఫీజులు ఎగిరిపోతాయి. ఇంత పెద్ద ఇళ్లా .. లంక లాగా ఉంది. సినిమాలలో మాత్రమే ఇలాంటి ఇల్లు చూస్తాం.. అంటూ కామాక్షి అనడంతో ప్రభావతి మరింత మురిసిపోతుంది. ఎలాగైనా ఈ సంబంధానికి ఓకే చెప్పితే తాను కూడా కోటీశ్వరాలనే అయిపోతారని కలలు కంటుంది. ఇంతలో నీలకంఠం వచ్చి వారితో మాట్లాడతారు. ఈ సమయంలో జ్యూస్ తెమ్మని నీలకంఠం తన భార్యతో చెప్పగా.. ఆమె వెండి గ్లాసుల్లో వారికి జ్యూస్ ఇస్తుంది. దీంతో ప్రభావతి ఊహల్లో తేలిపోతుంది. ఇంతటితో సీరియల్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X