Gunde Ninda Gudi Gantalu December 20th: డబ్బు కోసం బరితెగించిన ప్రభావతి.. సంజు ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?
Gunde Ninda Gudi Gantalu December 20th: గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో నీలకంఠం చూపిస్తున్న మర్యాదలకు ప్రభావతి ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. వెండి గ్లాసులో జ్యూస్ అందించేసరికి మరింత ఆశలు పెరుగుతాయి. తానే కోటీశ్వరాలుగా ఫీల్ అవుతుంది ప్రభావతి. సంబంధం గురించి ఏం చెప్పడం లేదు. మా సంబంధం నచ్చిందా? లేదా? అని నీలకంఠం ప్రశ్నిస్తాడు. వాస్తవానికి నీలకంఠం ఏం అడిగాడో కూడా పట్టించుకోకుండా ఊహాల్లోనే తెలిపోతుంది. పక్కన ఉన్న కామాక్షి.. ప్రభావతిని దారికి తీసుకవస్తుంది. తాను వచ్చేటప్పుడూ తన భర్త ఇంట్లో లేరని, తన కుటుంబ సభ్యులతో మాట్లాడి కబురు పంపిస్తారని చెబుతోంది. దీంతో రేపే తాను పెళ్లి చూపులకు వస్తామంటూ చెబుతారు నీలకంఠం.
ఇక ఇంటికి వెళ్తామనీ అనగానే.. పట్టుచీర పెట్టి మర్యాద చేస్తారు. దీంతో ప్రభావతి ఉబ్బితబ్బిబవుతుంది. పైగా కారులో ఇంటిదగ్గర దించరమ్మని నీలకంఠం తన డ్రైవర్ కు చెప్తాడు. ఇలా ప్రభావతి రిచ్ కారులో ఇంటిముందు దిగగానే అందరూ షాక్ అవుతారు. మహారాణిలా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ.. తన కూతురు మౌనికను పొగడ్తలతో ముంచేస్తుంది. మౌనికాకు గొప్పింటి సంబంధం సెట్ అయిందని, అబ్బాయి పద్ధతి గల వాడని చెబుతోంది. ప్రేమించిన అమ్మాయి కోసం తన తల్లిదండ్రులను ఒప్పించి, మనకు పెళ్లిళ్ల పేరయ్య ద్వారా సమాచారం పంపించారని చెబుతుంది ప్రభావతి. అక్కడ జరిగిన రాజా మర్యాదల గురించి ప్రభావతి రేంజ్ లో చెబుతుంది.

'అన్ని బాగున్నాయి. కానీ, అదే రేంజ్ లో కట్నం అడుగుతారు కదా..' అంటూ సత్యం అంటాడు. వారు తమకు కానీ కట్నం కూడా ఇవ్వద్దంటూ చెప్పారని, కేవలం తమ కూతుర్ని ఇంటికి పంపిస్తే.. చాలని చాలా క్లియర్ గా చెప్పారని ప్రభావతి చెబుతుంది. దీంతో మీనా కూడా వాళ్ళు చాలా పద్ధతిగా మనుషులని, ఈ సంబంధం ఓకే అయితే మౌనికాకు జీవితమే మారిపోతుందంటూ మీనా కూడా అంటుంది. కానీ, బాలు మాత్రం ఏదో సందేహిస్తాడు. అంత కోటీశ్వరులు మన ఇంటికి వచ్చి సంబంధం సెట్ చేసుకోవడం ఏంటి? అని నిలదీస్తాడు. దీంతో ప్రభావతి తాను చేసే పనులకు ఎలాంటి లోటు ఉండదని ధీమాగా చెబుతోంది. కానీ బాలుకు మాత్రం సందేహం వస్తుంది.
కుటుంబ సభ్యులందరూ ప్రభావతి తెచ్చిన సంబంధం గురించి మాట్లాడుకుంటారు. తాను మౌనిక, మనోజ్ లను ఎంతో పద్దతిగా పెంచాననీ, మనోజ్ కు గొప్పింటి సంబంధం చేశానని, అలాగే మౌనిక కూడా కోటీశ్వరులకు ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రభావతి రేంజ్ లో చెబుతోంది. దీంతో బాలు వెంటనే రియాక్ట్ అయి.. గొప్పింటి సంబంధమని మనోజ్ గాడికి పెళ్లి చేశావు? ఎంతవరకు రోహిణి వాళ్ళ నాన్న ముఖం కూడా ఎవరు చూడలేదు కాదా కుండబద్దలు కొడతాడు. ఈ పెళ్లి సెట్ అయితే అందరూ వస్తారు కదా అప్పుడు అర్థమవుతుంది అని ప్రభావతి బదులిస్తుంది. దీంతో రోహిణికి టెన్షన్ మొదలవుతుంది. లేని తల్లిదండ్రులను ఎక్కడినుండి తీసుకురావాలనుకుంటూ తనలో తాను టెన్షన్ పడుతుంది.

మౌనిక కు ఓకే అయితే తనకు కూడా ఓకేనని సత్యం అంటాడు. దీంతో బాలు పెళ్లి చూపులే కదా నీకు నచ్చితేనే పెళ్లి చేస్తారు. ఒప్పుకో అంటూ బాలు చెబుతాడు. దీంతో మౌనిక తన అన్నయ్య మాటలు కాదనలేక ఒప్పుకుంటుంది. దీంతో వెంటనే ప్రభావతి.. మీనాక్షికి ఫోన్ చేసి రేపు పెళ్లి వారిని రమ్మని కబురు చేయమని చెబుతోంది.
మరోవైపు.. సంజీవ్ తన పెళ్లికి రూట్ క్లియర్ అయిందని భావిస్తాడు. కానీ, నీలకంఠం మాత్రం ఇంకో అడ్డంకి ఉందని, అది బాలు అని చెబుతాడు. వాడు ఉండగా మనం ఆ ఇంట్లో కాలు కూడా పెట్టలేమని అంటాడు. దీంతో సంజీవ్ మరో ప్లాన్ వేస్తాడు. వెంటనే తన డ్రైవర్ దగ్గర ఉన్న ఫోన్ను తీసుకొని రేపు అర్జెంటుగా ఒక డ్రైవ్ కి రావాలని చెబుతాడు. తాను రావడం కుదరదని, తనకు వేరే వర్క్ ఉందని బాలు చెప్పిన వినిపించుకోడు. తనకు అవసరమైతే డబుల్ పేమెంట్ ఇస్తానని అంటాడు.

అటు చూస్తే చెల్లెకి సంబంధం చూడడానికి పెళ్లి వారుస్తున్నారు? ఎలా వెళ్లాలని సందేహపడతాడు. ప్రభావతి మాత్రం వెంటనే ఆ డ్రైవ్ ఒప్పుకోమని చెబుతోంది. మరోవైపు సత్యం కూడా తాను ఉన్నాను కాదా? అన్ని నేను చూసుకుంటానని చెప్తాడు. దీంతో బాలు వస్తానని మాట ఇస్తాడు. ఇలా బాలుని ఇంట్లో లేకుండా సంజు ప్లాన్ చేస్తాడు. పెళ్లి చూపుల కంటే బాలు లేకుండా చేసావ్? మరి పెళ్లిలో కచ్చితంగా బాలు ఉంటాడు కదా.. అని సంజీవ్ అడగగా అందుకు కూడా తన దగ్గర మాస్టర్ ప్లాన్ ఉందంటూ బదిలిస్తాడు. దీంతో ఈ సీరియల్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











