Gunde Ninda Gudi Gantalu December 24th: సంజు బుట్టలో పడ్డ మౌనిక.. చెల్లి పెళ్లి చూపులు చెడగొట్టిన బాలు..

Gunde Ninda Gudi Gantalu December 24th: గుండె నిండా గుడి గంటలు మంగళవారం ఎపిసోడ్లో సంజీవ్ మౌనికతో పర్సనల్ గా మాట్లాడుతాడు. మౌనికను తన మాయమాటలతో బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తాడు సంజీవ్. ఈ సమయంలో తాను రెండు తప్పులు చేశానంటూ చెప్పుకొస్తాడు అందులో ఒకటి గతంలో ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందని, కానీ అమ్మాయి తనని మోసం చేసి వెళ్లిపోయిందని, ఆ సమయంలో నువ్వు కనిపించావని చూసిన మరుక్షణంలోనే నిన్ను ప్రేమించాను అని చెబుతాడు. మరొకటి బార్ లో మీ అన్నయ్య బాలుకి తనకి గొడవ జరిగిందని, ఆ గొడవ తర్వాత మీ అన్నయ్యకు స్వారీ చెప్పాలని ప్రయత్నించాలని కథలు చెప్తాడు. దీంతో మౌనిక .. సంజీవ్ మాయలో పడుతోంది. ఇకపై జీవితంలో తాను ఎప్పుడు మందు తాగనంటూ ప్రామిస్ చేస్తాడు. దీంతో మౌనిక కూడా ఫ్లాట్ అవుతుంది.

ఈ డిస్కషన్ పూర్తయిన తర్వాత.. అబ్బాయి నచ్చాడా? అని మౌనికను తన తల్లిదండ్రులు అడగగా.. తనకు నచ్చాడని సమాధానం ఇస్తుంది. దీంతో వెంటనే తాంబూలాలు మార్చేసుకుని ముహూర్తం పెట్టేద్దామని నీలకంఠం అంటాడు. బాలు వచ్చేంత వరకు వెయిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాడు సత్యం. కానీ, ప్రభావతి అవసరం లేదని, నిక్కచ్చిగా చెబుతుంది. మరోవైపు పంతులు కూడా వర్జ్యం వస్తుంది. వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం అంతా శుభమే జరుగుతుంది. దీంతో సత్యం కన్విన్స్ అవుతాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 321 December 24th 2024 here is full story

మరోవైపు బాలు ఇంటికి చేరుకుంటాడు. తన మామయ్య రంగా నీలకంఠాన్ని పరిచయం చేస్తాడు. ఆ తర్వాత సంజీవ్ ని పరిచయం చేయగానే.. వీడా.. మా అమ్మ తెచ్చిన సంబంధం అనగానే.. నాకు అనుమానం వచ్చింది. ఈ దరిద్రపు సంబంధం తనకు ఇష్టం లేదంటూ బాలు తెగేసి చెబుతాడు. నా చెల్లెను నీకు ఇవ్వనని, ఇకనుండి వెంటనే వెళ్లి పొమ్మని వార్నింగ్ ఇస్తాడు బాలు. దీంతో ఇంటిల్లిపాది షాక్ అవుతారు. తాంబూలాలు మార్చుకునే సమయంలో వచ్చి అనవసరంగా గొడవ చేయకండి ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

ఇకనుండి వెళ్లిపోవాలంటూ బాలు వార్నింగ్ ఇస్తాడు. అనవసరంగా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దంటూ రంగా కూడా అంటాడు. మరోవైపు ప్రభావతి ఎక్కడ సంబంధం క్యాన్సల్ అవుతుందోనని, నీ లాగా డ్రైవర్ కి ఇచ్చి పెళ్లి చేయాలంటూ బాలుని ఎగతాళి చేస్తుంది. డ్రైవర్ అయినా మంచి మనసుంటే చాలు వీడు ఎలాంటి వాడో తనకు తెలుసుననీ, వాడి సైకో వేషాలు తనకు తెలుసు అంటాడు. ఈ జన్మలో తాను ఈ పెళ్లికి ఒప్పుకోనని బాలు తెగేసి చెప్తాడు. ఎలాగైనా బాలుని కన్విన్స్ చేయాలని నీలకంఠం ప్రయత్నిస్తాడు. ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకోవద్దని, తన కొడుకు తనకు తాగాలని మాట ఇచ్చాడని, తన కొడుకు ఇష్టపడ్డ సంబంధం అని, మా స్థాయిని తగ్గించుకుని, మీ ఇంటికి వచ్చాం. ఇలాంటి అవమానం జరుగుతుందని ఊహించలేదంటూ నీలకంఠం తన ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోతాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 321 December 24th 2024 here is full story

దీంతో ప్రభావతి ఆశలన్నీ అడియాశలవుతాయి. కోపంతో బాలుని కొడుతుంది. వీడు ఉండగా నా కూతురు పెళ్లి జరగదని ప్రభావతి అరుస్తు.. తన రూం లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత బాలు తన రూమ్ లోకి వెళ్లి బాధపడతాడు. తన తల్లి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడతాడు. ఇంతలోనే మీనా వచ్చి అనవసరంగా ఎక్కువగా ఆలోచించకండి అంటూ చెబుతుంది. వాడు ఇలాంటి వాడు తనకు తెలుసునని, ఆ విషయం ఇంట్లో వాళ్లకి అర్థం కావడం లేదంటూ చెబుతాడు. ఇంతలోనే మౌనిక కూడా బాలు రూమ్ లోకి వస్తుంది. సంజీవ్ బార్లో జరిగిన విషయాన్ని తనకు చెప్పాడని, ఆ విషయంలో నీకు సారీ చెప్పాలని సంజీవ్ ఆలోచిస్తున్నాడని మౌనిక చెబుతుంది. అయినా చెడ్డవాడైతే ఆ విషయం తనకు చెప్పవలసిన అవసరం లేదని, ఎందుకు చెప్పాడంటూ బాలుని ప్రశ్నిస్తుంది మౌనిక.

మరోవైపు సత్యం రూమ్ లోకి వస్తాడు మరోసారి ఈ విషయంలో ఆలోచించాలని బాలుకి చెబుతాడు. మీరు ఎన్ని చెప్పినా తాను ఈ విషయంలో మాట మార్చుకోనని, తన అభిప్రాయం మారదని అంటాడు బాలు. ఆనాడు బార్లు తన ఫ్రెండుని ఎలా కొట్టాడో తనకు తెలుసు అని, వాడు పెద్ద సైకో అంటూ తన తండ్రి చెప్తారు. ఆయన సత్యం బాలుని కన్విస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు కూడా తాగుతావు కదా.. నీ తమ్ముడు రవిని .. పోలీస్ స్టేషన్లో ఎలా కొట్టావు? ఆరోజు నువ్వు కూడా నాకు రాక్షసుడు లాగానే కనిపించావ్ అని అంటాడు. దీంతో బాలు ఆగ్రహానికి లోనై ఎన్ని చెప్పినా ఎంత కన్విన్స్ చేయాలని, ప్రయత్నించిన తాను మాత్రం నిర్ణయం మార్చుకోవాలని, తన చెల్లిని వాడికి ఇచ్చి పెళ్లి చేయనని తెగేసి చెప్పి బాలు వెళ్ళిపోతాడు. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X