Gunde Ninda Gudi Gantalu December 25th: బాలుకి ఎదురుదెబ్బ.. నీలకంఠం మాయలో పడ్డ ప్రభావతి..

Gunde Ninda Gudi Gantalu December 25th: గుండె నిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్లు బాలు తన ఫ్రెండ్ రాజేష్ దగ్గరికి వెళ్ళాడు. ఈ సమయంలో మౌనిక పెళ్లిచూపులు జరిగాయని అడిగి తెలుసుకుంటాడు రాజేశ్. దీంతో బాలు అసలు విషయం చెబుతాడు. వాడెవడో కాదు లాస్ట్ టైం బార్లో గొడవపడిన వాడే అని చెబుతాడు. వాడి తండ్రి పేరు నీలకంఠం అని చెబుతారు. దీంతో పక్కనున్న మరో ఫ్రెండ్ నీలకంఠం గురించి తనకు తెలుసు మన రమేష్ అన్నకు బాగా తెలుసు. ఆ అన్న నీలకంఠం దగ్గర పనిచేశాడు అని చెబుతాడు. దీంతో బాలు, రాజేశ్ లు వెంటనే అతని దగ్గరికి వెళ్లి నీలకంఠ గురించి అడిగి తెలుసుకుంటారు.

నీలకంఠం పెద్ద రౌడీ షీటర్ అని, రియల్ ఎస్టేట్ , సెటిల్మెంట్లు దందాలు చేస్తారని చెప్తాడు. మరి తన కొడుకు ఇలాంటివాడని ప్రశ్నిస్తాడు బాలు. నీలకంఠం వెధవ అయితే.. వాడి కొడుకు వెధవన్నార వెధవ అని చెబుతాడు. అయితే ఈ విషయం తమ ఇంటికి వచ్చి చెప్పాలని రమేష్ అన్నాను రిక్వెస్ట్ చేస్తారు బాలు.‌ దాని రమేశ్ కుడా ఓకే చెప్పతాడు. ఎలాగైనా నీలకంఠం నిజ స్వరూపం బయటపెట్టి.. వాడి ప్లాన్ ను ఇంట్లో వారికి అర్థమయ్యేలా చేయాలని భావిస్తాడు బాలు.

Gunde Ninda Gudi Gantalu serial episode 322 December 25th 2024 here is full story

మరోవైపు ఇంట్లో వారంతా పెళ్లిచూపులు క్యాన్సల్ అవడంతో బాలుని ఆడిపోసుకుంటారు. బాలుని టార్గెట్ చేస్తూ మీనా ను తిడతారు. ఈ సమయంలో మనోజ్ రెచ్చిపోయి .. మీనా ఫ్యామిలీ గురించి నోరు జారుతాడు. బాలుని చూడగానే ప్రభావతి కోపంతో తినకుండా వెళ్ళిపోతుంది. ఈ సమయంలో సత్యం కూడా బాలుని తప్పు పడతాడు. అనవసరంగా మొండిపట్టుతో వ్యవహరిస్తున్నావంటూ బాలుపై మండిపడతాడు. పెళ్లి అంటే నూరేళ్లపంటని, ముక్కు ముఖం తెలియని వారికి మన చెల్లెలు వచ్చి బాధపడాల్సిన అవసరం లేదని, వారు ఎలాంటి వారో తాను తెలుసుకున్నానని, వారి దగ్గర పని చేసిన వ్యక్తి రేపు వచ్చి అన్ని నిజాలు బయటపెడతాడని బాలు చెబుతాడు.

ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అని మీనా ఆరా తీస్తుంది. అన్ని విషయాలు రేపు చెప్తానని, ఆ వ్యక్తి నోట నీలకంఠం ఫ్యామిలీ గురించి వినమని చెబుతాడు. మరుసటి రోజు ఉదయం బాలు చెప్పిన మనిషి వస్తాడు. కానీ, బాలు అనుకున్న విధంగా కాకుండా ఆ వ్యక్తి ప్లేట్ పిరాయిస్తాడు. వారు చాలా మంచి వారని తన పిల్లలను వారే చదివిస్తున్నారని, ఇక సంజీవ్ ఇంకా మంచివాడు అంటూ గొప్పలు చెప్తాడు. తాను చెప్పిన విషయం కాదు కావాలంటే మరో నలుగురిని అడిగి తెలుసుకోమని సలహా ఇచ్చి వెళ్లిపోతాడు. దీంతో బాలుకి కొట్టేసినట్లు అవుతుంది. అందరి ముందు తలదించుకోవాల్సి వస్తోంది.

సత్యం కూడా బాలు మాటలను పట్టించుకోడు. ప్రభావతి అయితే ఇంకా రెచ్చిపోతుంది. పెళ్లి చెడగొట్టాలని ఇలాంటి అబద్ధపు సాక్షాలను పట్టుకొస్తున్నాడంటూ బాలుని తిడుతుంది. ఇకపై ఎవరు ఇలాంటి విషయాలు చెప్పిన తాను మాత్రం ఆ సంబంధం క్యాన్సల్ చేయనని, ఇప్పుడే వారికి ఫోన్ చేసి సంబంధం ఫిక్స్ చేస్తున్నానని ప్రభావతి చెబుతోంది. ఈ సమయంలో మనోజ్ రెచ్చిపోతాడు. నీ ఫ్రెండును కొట్టాడని పెళ్లి సంబంధం చెడగొట్టాలని భావిస్తున్నావని మండిపడతాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 322 December 25th 2024 here is full story

ఈ సమయం సత్యం మాట్లాడుతూ.. ఇంట్లో ఓటింగ్ పెట్టి .. మెజార్టీ ప్రకారం తాను నిర్ణయం తీసుకుంటాను చెబుతాడు. ఈ సమయంలో వేరే వారి నిర్ణయం అవసరం లేదని, ముందు మౌనిక నిర్ణయం ఏంటో తెలుసుకోమని మీనా చెబుతుంది. దీంతో మౌనిక మాట్లాడుతూ.. అతడు బాలు అన్నయ్య అనుకున్నట్లు చెడ్డవాడు కాదని, అలాంటివాడు అయితే బాలు అన్నయ్యతో జరిగిన గొడవ గురించి తనకు చెప్పేవాడు కాదని సంజీవ్ కు మద్దతుగా మాట్లాడుతుంది. దీంతో తన చెల్లి నా మాట నమ్మడం లేదని బాలు బాధపడుతాడు. తన ఫ్రెండ్స్ తో బార్ కి వెళ్లి జరిగిన విషయాన్ని చెబుతాడు.

ఈ సమయంలో బాలు తీసుకువెళ్లిన రమేష్ కనిపిస్తాడు. వాడిని కాలర్ పట్టుకుని అడగగా.. తాను మీ ఇంట్లో చెప్పిన విషయం అబద్ధమని, వాస్తవానికి పెళ్లి సంబంధం వారితో సెట్ చేసుకున్న విషయం తనకు తెలియదని, ఒకవేళ తన వాళ్ళని ఈ సంబంధం క్యాన్సల్ అయితే.. తనను చంపి తన ఫ్యామిలీని ఆగం చేస్తారని, భయంతో తాను నిజం చెప్పలేకపోయానని అసలు విషయం చెబుతాడు. కానీ, ఎట్టి పరిస్థితుల్లో మీ చెల్లెలు సంజీవ్ కు ఇచ్చి మాత్రం చేయొద్దు. వాడు పెద్ద సైకో అని చెబుతాడు. దీంతో బాలు డైలమా లో పడతాడు. వాడు ఎందుకు తన చెల్లి ని పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడు.‌ తమకి అర్థం కావడం లేదని, దీని వెనక ఏదో పెద్ద కారణం ఉందని భావిస్తాడు బాలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X