Gunde Ninda Gudi Gantalu December 26th: నీలకంఠం ఇంట్లో రచ్చ.. బాలు పై చేయి చేసుకున్న సత్యం

Gunde Ninda Gudi Gantalu December 26th: గుండె నిండా గుడి గంటలు గురువారం ఎపిసోడ్లో ఇంట్లో జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ బాలు ఫుల్లుగా తాగుతాడు. అసలు సంజు నీలకంఠం తనపై పగ పెంచుకొని, తన చెల్లిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు ?తనకు అర్థం కావడం లేదని, ఆ రోజు గొడవ అంత పెద్దది కూడా కాదని, మా ఇంట్లో వాడిని అవమానించిన తన చెల్లిని పెళ్లి చేసుకోబోతున్నారంటే ? దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని బాలుకి అనుమానం వస్తుంది. బాలు ఫ్రెండ్ రాజేష్ కూడా.. అదే తనకు అర్థం కావడం లేదనీ, తనకు కూడా అనుమానం వస్తుందని వెనుక ఏదో కథ ఉందంటాడు.

మరోవైపు.. సత్యం, ప్రభావతి ఇద్దరు కలిసి నీలకంఠం ఇంటికి వెళ్తారు. తమ కొడుకు బాలు చేసిన అవమానానికి వారు క్షమాపణ చెప్పి, సంబంధం కలుపుకోవాలని భావిస్తారు. అదే విషయం నీలకంఠంతో చెప్పగా.. ఇక మమల్నీ అవమానించడానికి వచ్చారా? అని మొదట కాస్త జలకి ఇస్తాడు. ఇప్పటి కూడా మీ సంబంధం ఇష్టమే అంటూ వెంటనే ముహూర్తాలు పెట్టుకుందామంటూ అంటాడు. కానీ, సత్యం ముందుగా తాంబూలాలు మార్చుకొని, కాస్త టైం తీసుకుని ముహూర్తాలు పెట్టుకుందామని తన అభిప్రాయాన్ని చెబుతాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 323 December 25th 2024 here is full story

ఇంతలోనే బాలు తాగి వచ్చి నీలకంఠం ఇంటి ముందు రచ్చ చేస్తాడు. సెక్యూరిటీని ఇష్టమొచ్చినట్టు తిడుతుండగా ఈ విషయాన్ని సంజీవ్ గమనించి, తన తండ్రి నీలకంఠం తో బాలు దగ్గరికి వెళ్తాడు. ఈ సమయంలో బాలుని రెచ్చగొట్టి.. తన కాలర్ను పట్టుకునే లాగా చేస్తాడు సంజీవ్. మరోవైపు నీలకంఠం తనకి ఏమీ తెలియనట్లు తన కొడుకును కొట్టొద్దు అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులను విన్న సత్యం పరుగున బయటికి వస్తాడు. తన తల్లిదండ్రులను చూసిన బాలు షాక్ అవుతాడు. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారని నిలదీస్తాడు.

తాము వీరికి క్షమాపణ చెప్పి, పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి ఇక్కడికి వచ్చామని, ఇక్కడ ఎలాంటి అల్లరి చేయకుండా వెళ్లిపొమ్మని ప్రభావతి రిక్వెస్ట్ చేస్తుంది. వీడు అసలు మనిషి కాదు అంటూ సంజు కాలర్ పట్టుకుంటాడు బాలు. దీంతో ఆగ్రహానికి లోనైనా సత్యం బాలుపై చేయి చేసుకుంటాడు. దీంతో బాలు అవమానంగా భావించి ఏం మాట్లాడకుండా బాధతో బయటికి వెళ్లిపోతాడు. మరోవైపు వెంటనే ముహూర్తాలు పెట్టుకుందామని, లేకపోతే ఎలాగైనా ఈ పెళ్లిని చెడ్డ కొట్టేలా బాలు ప్రయత్నిస్తాడనీ నీలకంఠం అంటాడు. వెంటనే పంతులు కు ఫోన్ చేసి రప్పిస్తాడు.

ఆ పంతులు జాతకాలు చూసి.. మరో రెండు రోజులలో మంచి ముహూర్తం ఉందని, ఆ ముహూర్తం తప్పితే మరో నాలుగు నెలల వరకు సంబంధాలు లేవంటూ చెబుతాడు. దీంతో వెంటనే రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుందామంటూ నీలకంఠం బలవంతం చేస్తాడు. దీంతో సత్యం కాదనలేకపోతాడు. పైగా అన్ని ఏర్పాట్లు తామే చూసుకుంటామని చెప్పడంతో ప్రభావతి ఖర్చులు కలిసి వస్తాయని వెంటనే ఓకే చెప్తుంది. వెంటనే తాంబూలాలు మార్చుకొని, ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటారు.

మరోవైపు బాలు అవమానంతో బాధపడుతూ ఇంట్లో కూర్చొంటాడు. ఆ సమయంలో తన తండ్రి, తల్లి వచ్చి ఇష్టం వచ్చినట్లుగా బాలుని తిడతారు. ఆ అబ్బాయి తాగి గొడవ చేశాడంటూ నువ్వు వద్దంటున్నావు. మరీ ఈరోజు నువ్వు చేసింది ఏంది? అంటూ బాలుని సత్యం నిలదీస్తాడు. తాను తన చెల్లికి శత్రువు కాదనీ, తాను ఈ పెళ్లి ఎందుకు వద్దంటున్నానో అర్థం చేసుకోమని, బాలు తన బాధను అభిప్రాయాన్ని వెల్లడించడానికి ప్రయత్నిస్తాడు. కానీ సత్యం .. ఇక చాలు ఎవరు చెప్పినా.. నేను వినను. ఆల్రెడీ రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నాం అంటూ అసలు విషయాన్ని బయట పెట్టేస్తాడు.

'ఒక్కసారి బాలు చెప్పేది కూడా వినండి మామయ్య' అని మీనా అనగానే బాలుకి కోపం వస్తుంది. మీనాపై చేయి చేసుకోబోతాడు. ఆ విషయం నచ్చక బాలు తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. మరోవైపు కుటుంబమంతా పెళ్లి పనులలో బిజీబిజీగా మారతారు. డెకరేషన్, పెళ్లి కార్డ్స్ పంచడం కూడా అయిపోతుంది. ఇప్పటికైనా మీ పంతాన్ని మార్చుకోండి. ఇంటిల్లిపాది అంతా సంతోషంగా ఉన్నారు. ఈ సమయంలో ఎలాంటి గొడవ చేయొద్దంటూ బాలుని మీనా రిక్వెస్ట్ చేస్తుంది. అంతా బాగానే ఉన్నా తనకంటూ ఓ మనసాక్షి ఉంటుందని, ఆ మనస్సాక్షి ఆ రాక్షసునికి తన చెల్లెల్ని ఇచ్చి.. పెళ్లి చేయడానికి మనసు రావడం లేదంటూ బాలు బాధపడుతుంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X