Gunde Ninda Gudi Gantalu Dec27th: ప్రభావతికి షాక్ ఇచ్చిన శృతి..చెల్లి పెళ్లి ఆపేందుకు బాలు మాస్టర్ ప్లాన్?
Gunde Ninda Gudi Gantalu December 27th: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ లో బాలు బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే మీనా వచ్చి అంత చేయి దాటిపోయింది. ఇప్పుడు చేసేది ఏమీ లేదు.. మీరు కూడా పెళ్లి పనులు సహాయం చేయండి అంటూ సలహా ఇస్తుంది. కానీ బాలు మాత్రం అందుకు అంగీకరించాడు. పోయి.. పోయి.. ఆ దుర్మార్గుడు చేతిలో నా చెల్లెలు పెట్టాలంటే ధైర్యం రావడంలేదని, తాను ఆ పెళ్లి పాలు చేయడం ఇష్టం లేదని చెప్తాడు. ఈ విషయాన్ని గమనించిన సత్యం.. అనవసరంగా లేని ఇబ్బందులు తీసుకురాకు. చెల్లి పెళ్లి పనులను చేయమని, నువ్వు చెయ్యి వేస్తేనే కదరా.. పెళ్లి పనులు జరిగేవి అని అంటాడు.
అలాగే నువ్వు సైలెంట్ గా ఉండడం తనకు ఇష్టం లేదని చెబుతాడు. ఇంతలోనే శీల డార్లింగ్ ఎంట్రీ ఇస్తోంది. అందరి బాగోగులు అడుగుతూ పెళ్లి సందడిని రెట్టింపు చేస్తుంది. కానీ, బాలు సైలెంట్ గా ఉండడంతో సుశీలమ్మకు.. అనుమానం వస్తుంది. ఏంట్రా ఏమైందని బాధని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు. మరి రవి గాడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తుంది. వాడు బిజీగా ఉన్నాడని వాడు వర్క్ చేసే హోటల్లో వాడికి లీవ్.. ఇవ్వడం లేదని అంటాడు సత్యం.

ఎవడ్రా..చెల్లి పెళ్లి కూడా లీవ్ ఇవ్వని, వెదవ ర్రా ఒక్కసారి ఫోన్ చేయి.. వానికి రక్తం కారేలా చివాట్లు పెడతా అంటూ శిలా డార్లింగ్ ఫైర్ అవుతుంది. ఇది అదునుగా భావించిన ప్రభావతి రవిని తీసుకురావడానికి ప్లాన్ వేస్తుంది. సత్యమును బయటికి పిలిచి, రవిని పెళ్లికి పిలుద్దాం.. అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. మొదట సత్యం అందుకు ఒప్పుకోడు. దీంతో ప్రభావతి ఎమోషనల్ అవుతుంది కంటతడి పెట్టుకుంటూ నా మాట ఎవరు వినడం లేదు అని ఫీల్ అవుతుంది.
దీంతో కరిగిపోయిన సత్యం నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు.. కావాలంటే నువ్వు వెళ్లి వాడిని పిలువుమని ప్రభావతి కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు సత్యం. దీంట్లో వెంటనే కామాక్షిని తీసుకొని, రవి ఇంటికి వెళుతుంది ప్రభావతి. మౌనికకు పెళ్లి సెట్ అయిందని, కోటీశ్వరుల సంబంధమని శుభవార్త చెప్తుంది. ఈ పెళ్లికి తప్పకుండా రావాలని ఇది మనమందరం కలిసి పోయే సందర్భమని, పెళ్లి కార్డు చేతిలో పెడుతుంది.
ఆ కార్డు ఓపెన్ చేసి చూసే లోపే..శృతి ఎంటర్ అవుతుంది. శృతిని కూడా రావాలని ప్రభావతి తెలుస్తుంది. కానీ, తాము పెళ్ళికి రాలేమని, అక్కడ వచ్చి మీ సంతోషాన్ని మేము డిస్టర్బ్ చేయలేమంటూ ఓపెన్ గా చెప్పేస్తుంది. సడన్ గా పెళ్లికి వస్తే అందరూ మమ్మల్ని వింతగా చూస్తారని, అలాగే.. బాలు మళ్లీ గొడవ చేస్తాడంటూ శృతి అక్కనుండి వెళ్ళిపోతుంది. దీంతో ప్రభావతి డిసప్పాయింట్ అవుతుంది. ఎలాగైనా శృతిని ఒప్పించి, పెళ్లికి తీసుకురమ్మని రవిని రిక్వెస్ట్ చేసి వెళ్లిపోతుంది.
మరోవైపు బాలు ఇలాగేనా తన చల్లపల్లిని ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. తన తల్లి అన్న మాటలను సంజు బెదిరించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే బాలు ఫ్రెండ్ రాజేష్ ఇంటికి చేరుకుంటాడు. కారు తీసుకు రమ్మని చెప్పావు ఏంటి అని అడుగుతాడు. పెళ్లికి వెళ్లాలి కదరా.. అందుకే తీసుకురమ్మని చెప్పానని అంటాడు. దీంతో ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అని రాజేష్ అడుగుతాడు. ఈ జన్మ లోనే కాదు వచ్చే జన్మలో కూడా వాడికి తన చెల్లెలు ఇచ్చి పెళ్లి చేయలేనని, వాడిని కిడ్నాప్ చేస్తానని బాలు చెప్తాడు.
దీంతో రాజేష్ కంగారు పడతాడు ఏం మాట్లాడుతున్నావ్ రా అర్థమవుతుందా అంటాడు. నువ్వు విన్నది నిజమే.. ఎలాగో అన్ని దారులు మూసుకుపోయాయి. ఏం చేసినా ఈ పెళ్లి ఆపరు. అందుకే పెళ్లి కొడుకును కిడ్నాప్ చేద్దామని ప్లాన్ వేసా.. పెళ్ళికొడుకు లేకుండా పెళ్లి జరగదు కదా అంటాడు బాలు. సంజీవ్ వాళ్ళ నాన్న నీలకంఠం పెద్ద రౌడీ వాడికి తెలిస్తే మన పని అవుట్ అని అంటారు. అవసరం అనుకుంటే వాణ్ణి కూడా కిడ్నాప్ చేద్దాం . నువ్వు వస్తే రా లేకపోతే లేదు అని బాలు అంటాడు. దీంతో రాజేష్.. కార్ డ్రైవర్ ని కిడ్నాపర్ ను చేశావు కదరా అని రాజేష్ ఫీల్ అవుతాడు. మేము ఏమైనా ప్రొఫెషనల్ కిడ్నాపర్లమా కాని చేద్దాం అని అంటాడు.
మరోవైపు ప్రభావతి ఇంట్లో పెళ్లి పనులు జోరుగా సాగుతాయి అందరూ పెళ్లికి రెడీ అయి.. వస్తారు బాలు వస్తాడో రాడో అని సత్యం టెన్షన్ పడతారు. కానీ బాలు ఎవరు ఊహించని విధంగా.. పంచ కట్ట లో రెడీ అయ్యి .. వస్తాడు. దీంతో శీల డాలి సర్ప్రైజ్ అవుతుంది.. నిన్ను చూస్తే మీ తాతయ్యని చూసినట్టుందిరా అంటూ సిగ్గుపడుతుంది. ఇంతటితో నేటి సీరియల్ అండ్ అవుతుంది.


Click it and Unblock the Notifications










