Gunde Ninda Gudi Gantalu December 30th: నీలకంఠం కు బాలు షాక్.. ప్ర‌భావ‌తి ప్లాన్ రివ‌ర్స్‌..

Gunde Ninda Gudi Gantalu December 30th: గుండె నిండా గుడి గంటలు సోమవారం ఎపిసోడ్లో సంజు పెళ్లికి సిద్ధమవుతాడు. కానీ, నీలకంఠం తమ ప్లాన్ ఎక్కడ బయటపడుతుందంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అంతా తాను సెట్ చేశానని, బాలు ఏదైనా గొడవ చేస్తే పోలీస్ డ్రెస్ లో తన మనుషులను పెట్టానని, ఒకవేళ రవి , శృతి వస్తే.. వారిని కూడా ఆపడానికి తన దగ్గర ప్లాన్ ఉందని చెబుతాడు. మరోవైపు బాలు తన ఫ్యామిలీతో సహా పెళ్లి మండపానికి చేరుకుంటాడు. వాస్తవానికి నీలకంఠం బాలు రాలేదు కావచ్చని, పెళ్లి సాఫీగా జరిగిపోతుందని భావిస్తాడు. కానీ బాలు ఎంట్రీ ఇవ్వడంతో నీలకంఠం షాక్ అవుతాడు. పైగా బాలును మామయ్య అంటూ నీలకంఠాన్ని పలకరిస్తాడు.

ఆ తర్వాత పెళ్లి మండపం దగ్గర అందరూ కూర్చుంటారు. ఈ సమయంలో నీలకంఠం.. తనకు కాబోయే కోడలుకు ఇచ్చే కానుకలను చూపిస్తాడు. బంగారం నగలను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇంతలోని సంజు పెళ్లి మండపం దగ్గరికి చేరుకుంటాడు. వచ్చి రాగానే సంజీవని బావ బావ అంటూ ఆటపట్టిస్తూ సెల్ఫీ తీసుకుంటాడు. దీంతో సంజు షాక్ అవుతాడు. ఇదిలా ఉంటే.. రోహిణి బాయ్ ఫ్రెండ్ పెళ్లికి వస్తాడు. రోహిణికి జలక్ ఇవ్వడానికి ఫోన్ చేస్తూ ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేస్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 325 December 30th 2024 here is full story

మరోవైపు రవి తన చెల్లి పెళ్లికి వెళ్లడానికి సిద్ధమవుతాడు. కానీ శృతి ఇంకా రాకపోయేసరికి హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో తాను అక్కడ ఉంటే హ్యాపీగా ఉండేవాడినని, అందర్నీ సంతోషంగా చూసుకునే వాడిని అంటూ బాధపడతాడు. శృతి ఇంకా రాకపోవడంతో బాలు శృతికి ఫోన్ చేస్తాడు. తాను పెళ్ళికి రావాలని తెగేసి చెబుతుంది కానీ తాను ఇంట్లో వారికి మాటిచ్చానని కచ్చితంగా పెళ్లికి రావాలంటూ శృతితో వాదిస్తాడు రవి.కానీ తాను రాలేనంటూ చెబుతోంది. అయినా రవి శృతి మాట పట్టించుకోడు. వచ్చేంతవరకు వెయిట్ చేస్తానంటూ రవి మొండికేసి కూర్చుంటాడు.‌

ఇదిలా ఉంటే మీనా తల్లికి పెళ్లిలో అవమానం జరుగుతుంది. నీలకంఠం నీ నా తల్లిని పనిమనిషి అనుకోని అవమానిస్తాడు. ఈ విషయాన్ని గమనించిన సుశీలమ్మ.. ప్రభావతిపై మండిపడుతుంది. మీనా అందరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంతలోనే బాలు అక్కడికి చేరుకొని ఏం జరిగిందంటూ ఆరా తీస్తాడు. పార్వతి తన కంట్లో నలుక పడిందంటూ కవరింగ్ చేస్తుంది. కానీ బాలు గొడవ చేసే ప్రయత్నం చేస్తాడు. తన తండ్రి వచ్చి సద్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. దీంతో బాలు అక్కనుండి వెళ్ళిపోతాడు. పెళ్లి పనులలో బిజీబిజీగా ఉంటాడు.

ప్రభావతి, మనోజ్, రోహిణి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే బాలు వచ్చి మలేషియా మామయ్య ఎక్కడ అంటూ చిచ్చు పెట్టి వెళ్ళిపోతాడు. దీంతో ప్రభావతి రెచ్చిపోయి ఒకసారి ఫోన్ చెయ్ అంటూ రోహిణి అడుగుతుంది ఇంతలోనే రోహిణి బాయ్ ఫ్రెండ్ వచ్చి ఇక్కడ రోహిణి ఎవరు అంటూ అడుగుతాడు. మీ మామయ్య మీకు గిఫ్ట్ ఇచ్చాడంటూ బహుమతి చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. దీంతో రోహిణి కంగారుపడుతుంది. ఆ గిఫ్ట్ లో ఏముందని ప్రభావతి తెగ ఆరాటపడుతూ చూడబోతుంది. ఇంతటితో నేటి సీరియల్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X