Gunde Ninda Gudi Gantalu December 31th: వదిన అలా.. మరిది ఇలా.. అంతా దొంగ బ్యాచే..
Gunde Ninda Gudi Gantalu December 31th: గుండె నిండా గుడి గంటలు మంగళవారం ఎపిసోడ్ లో రోహిణి బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ తీసుకొచ్చి రోహిణి పరువు కాపాడుతాడు. దీంతో ప్రభావతి తన మలేషియా అన్నయ్య గిఫ్ట్ పంపించాడని తెగ మురిసిపోతుంది. ఏం గిఫ్ట్ పంపాడు చూడమ్మా అంటూ రోహిణికి చెబుతుంది. ఇప్పుడు ఎందుకు అత్తమ్మ.. తర్వాత చూద్దాంలే.. మిమ్మల్ని మండపంలో పిలుస్తున్నారు అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తుంది. తర్వాత మనోజ్ కూడా ఒక్కసారి ఆ గిఫ్ట్ ఏంటో చూద్దామనడంతో కాస్త టెన్షన్ పడుతుంది. పెళ్లి పనులలో అందరూ బిజీగా ఉన్నారు.. ఇప్పుడు అవసరమా అనడంతో మనోజ్ కూడా సైలెంట్ అయిపోతాడు.
అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా.. మరోసారి రోహిణి బాయ్ ఫ్రెండ్ దినేష్ మళ్లీ వచ్చి రోహిణికి వార్నింగ్ ఇస్తాడు. తనకు డబ్బులు కావాలని అడుగుతాడు. దీంతో తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని, తాను ఇప్పుడు ఇచ్చుకో లేనట్టు ప్రాధేయపడుతుంది రోహిణీ. అయినా కూడా దినేష్ వినడు.. మీ ఆడపడుచుకి బోలెడన్ని నగలు పెడుతున్నారు. అందులో ఏదైనా ఒక నగా తీసుకువచ్చి, నాకు ఇవ్వు లేకపోతే.. నీ బండారం బయట పెడతా అంటూ బ్లాక్మెయిల్ చేస్తాడు.

మరోవైపు బాలు ఓ రేంజ్ లో ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తాడు. ఇందులోనే పంతులు పిలిచి పెళ్లి కొడుకును తీసుకురమ్మని చెబుతాడు. దీంతో బాలు నేను ఎత్తుకొస్తా అంటూ వెళ్తాడు. ఈ సమయంలో మీనా కు కాస్త అనుమానం వస్తుంది. నిజంగానే మీరు మారారా? సంజును క్షమించారా? అంటూ ప్రశ్నిస్తుంది. తన చెల్లెలి సంతోషం కోసం తాను ఏం చేయడానికి అయినా సిద్ధమే అంటూ ఇండైరెక్టుగా చెబుతాడు.
సంజీవ్ దగ్గరికి బాలు వెళ్లి రెడీ అయితే ఎత్తుకెళ్తా అంటాడు. అలా అనగానే సంజీవ్ డౌట్ వస్తుంది. కానీ బాలు మారాడు కావచ్చు అని సంజు భావిస్తాడు. నీలాంటి వారిని నా చెల్లెకు ఇచ్చి ఎలా పెళ్లి చేస్తానని భావించావ్ రా..అంటూ సంజీవ్ మెడ పట్టుకుంటాడు. దీంతో సంజూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, చితకబాది సంజీవ్ ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్తాడు. ఈ విషయాన్ని రోహిణి గమనించి, తన అత్తయ్య ప్రభావతికి చెబుతుంది. దీంతో పెళ్లి ఆగిపోతుందేమోనని కంగారుపడుతుంది. ఇంతలోని మీనా వారి దగ్గరికి వచ్చి ఏమైందంటూ ఆరా తీస్తుంది.
బాలు పెళ్ళికొడుకు సంజీవిని కిడ్నాప్ చేశాడని, వాడు ఎటు వెళ్ళాడు చెప్పమని అరుస్తుంది ప్రభావతి. తనకు కిడ్నాప్ విషయం తెలియదని, తనతో కూడా అబద్ధం చెప్పి ఇలా చేశాడంటూ మీనా బదులిస్తుంది. కానీ, ప్రభావతి నమ్మదు.. మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. ఈ విషయంలో నాకు ఇలాంటి ప్రమేయం లేదని చెబుతోంది. వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని, తీసుకురమ్మని చెబుతుంది. పెళ్ళికొడుకును తీసుకురావడానికి వెళ్లిన బాలు రాకపోవడంతో నీలకంఠంకు అనుమానం వస్తుంది. వెంటనే తన భార్యను పంపించి చూడమని చెప్తాడు.
పెళ్లికొడుడు రూమ్ లో చిందరవందరగా పడి ఉన్న వస్తువులను చూసి.. ఏదో జరిగిందని నీలకంఠంకు చెబుతోంది. వెంటనే నీలకంఠం తన గుండాల దగ్గరికి వెళ్లి బాలు సంజీవ్ ను కిడ్నాప్ చేశాడని, వాడిని వెంటనే పట్టుకుని తన కొడుకుని తీసుకురమ్మని ఆర్డర్ వేస్తాడు. ఈ విషయం బయటికి వస్తే పెళ్లి ఆగిపోతుంది అని నీలకంఠం కూడా భావిస్తాడు. మరోవైపు బాలుకి మీనా ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ బాలు ఫోన్ లిఫ్ట్ చేయడు. మరోవైపు నీలకంఠం మనుషులు పోలీస్ డ్రెస్ లో.. బాలుని ఫాలో అవుతూ ఉంటారు. వారి నుండి తప్పించుకోవడానికి బాలు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతటితో ఈరోజు సీరియల్ ఎండ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











