Gunde Ninda Gudi Gantalu January 1st: బాలు సేఫ్.. సంజు నిజ స్వరూపం బయటపడేనా? మౌనిక పెళి జరిగేనా ?

Gunde Ninda Gudi Gantalu January 1st: గుండె నిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్ లో సంజును కిడ్నాప్ చేసి బాలు కారులో తీసుకెళ్తుంటాడు. నీలకంఠం మనుషులు పోలీస్ డ్రెస్ లో ఫాలో అయ్యి.. ఎట్టకేలకు బాలుని పట్టుకుంటారు. ఆ తర్వాత సంజుని విడిపించి, పోలీస్ స్టేషన్ కు తీసుకవెళ్లకుండా ఓ గోడన్ కు తీసుకెళ్తారు. ఇక్కడికి ఎందుకు తీసుకోవచ్చారని ప్రశ్నించగా.. లోపలికి నడవని, బాలుని లోపలికి తీసుకువెళ్లి తాళ్లతో బంధిస్తారు. బాలుని తన ఫ్రెండ్ రాజేష్ ఫాలో అవుతూ ఉంటాడు. పోలీస్ స్టేషన్ కాకుండా ఓ గోడౌన్ కు తీసుకువెళ్ళడంతో అనుమానం వస్తుంది. ఈ విషయాన్ని మీనాకు చెబుతాడు.

మరోవైపు బాలు సంజీవని కిడ్నాప్ చేసిన విషయం నీలకంఠం ఫ్యామిలీకి, ఇటు సత్యం ఫ్యామిలీకి తెలిసిపోతుంది. కానీ, ఇరు ఫ్యామిలీలు తెలియనట్లు నటిస్తారు.ఈ విషయం తెలిస్తే.. ఎక్కడ పెళ్లి ఆగిపోతుందోనని, పెళ్లి ఆగిపోతే సంజీవ్ కు జీవితంలో పెళ్లి కాదనీ నీలకంఠం. ఈ పెళ్లి ఆగిపోతే.. మౌనిక లైఫ్ ఏమైందోననే భయంతో సత్యం సైలెంట్ అయిపోతాడు. పెళ్లి కొడుకు వచ్చిన ఈ పెళ్లి జరుగుతుందో లేదోనని ప్రభావతి భయపడుతుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 327 January 1st 2025 here is full story

మరోవైపు.. బాలుని నీలకంఠ మనుషులు తాళ్లతో కట్టి వేసిన తరువాత .. సంజు తన అసలు రూపాన్ని బయటపెడతాడు. తాను మీ ఫ్యామిలీ మీద కోపంతోనే మీ చెల్లె మెడలో తాళికట్టబోతున్నానని, ఎవడు వచ్చి ఈ పెళ్లిని ఆపుతారో తాను చూస్తానంటూ సవాల్ చేస్తాడు సంజు. ఒక్కసారి కట్ల విప్పి చూడు.. మరో క్షణంలో నీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. పెళ్లికి ముందే.. అసలు రూపం తనకు తెలుసునని, మేక వన్నె పులిలాగా వ్యవహరించిన తీరు తనకు ముందు అర్థమైందని, అందుకే తాను ఈ పెళ్లికి ఒప్పుకోలేదని బాలు చెబుతాడు.

ఇప్పుడు డిస్కషన్ అనవసరమని, పెళ్లి తర్వాత అప్పుడు అసలు రివెంజ్ ఎలా ఉంటుందో చూపిస్తానంటూ సంజు సవాల్ విసిరి, పెళ్లి మండపానికి బయలుదేరుతాడు. తాను వస్తున్న విషయం.. తన తండ్రికి ఫోన్ చేసి చెబుతాడు సంజీవ్. మరోవైపు.. పెళ్ళికొడుకు రాకపోవడంతో సత్యం టెన్షన్ పడుతుంటాడు. తన వైపు తప్పు ఉండదని, నీలకంఠంకు అసలు విషయం చెప్పడానికి బయలుదేరుతాడు. కానీ ఇంతలో సంజీవ్ పెళ్లి మండపానికి చేరుతాడు.

అసలు ఏమీ తెలియనట్లుగా.. నీలకంఠం నటిస్తారు.. 'ఏంట్రా ఇంత లేటు.. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. వెంటనే వెళ్లు' అంటాడు. సంజు కూడా తనకు ఏం జరగనట్టు.. పెళ్లి పీటల మీద కూర్చుంటాడు. మరి పెళ్లి కొడుకు వచ్చాడు. బాలు, మీనా ఎక్కడ ఉన్నారని పార్వతి ప్రశ్నించగా.. ఎవరు ఎటు వెళ్తే.. తనకేంటీ పెళ్లి జరగాలని ప్రభావతి తన పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది.

మరోవైపు రవి వెయిట్ చేస్తుండగా.. శృతి ఇంటికి చేరుకుంటుంది. కానీ, తాను మాత్రం పెళ్లికి రానని, కావాలనుకుంటే వెళ్ళమని రవికి చెబుతోంది. రవి ఎంత బ్రతిమలాడిన పెళ్ళికి రానని, పెళ్లికి తాను అడ్డు ఏమి చెప్పడం లేదనీ, తన భర్త రవికి పర్మిషన్ ఇచ్చేస్తుంది. రవి చేసేదేం లేకపోవడంతో పెళ్లికి బయలుదేరుతాడు. అయితే, పెళ్లి ఎక్కడ జరుగుతుందో తెలియకపోవడంతో వెడ్డింగ్ కార్డు కోసం వెతుకుతూ ఉంటాడు. ఏం జరిగింది? ఏం వెతుకుతున్నావని శృతి అడుగుతుంది. పెళ్లి ఎక్కడ జరుగుతుందో ? తనకు తెలియదని, వెడ్డింగ్ కార్డు కోసం వెతుకుతున్నానని చెబుతాడు.

ఈ సమయంలో శ్రుతి వెడ్డింగ్ కార్డు చూసి షాక్ అవుతుంది. పెళ్ళికొడుకు ఎవరో కాదు.. సంజీవ్ అని రవికి చెబుతుంది. దీంతో ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలని, రవికి చెబుతుంది. వెంటనే రవి తన తల్లికి ఫోన్ చేస్తాడు. కానీ, పెళ్లి మండపంలో వాయిద్యాలు సౌండ్ మధ్యలో ఉండే సరికి.. రవి చెప్పేది వినిపించుకోదు. దీంతో రవి.. మనోజ్ కు ఫోన్ చేస్తాడు. రవి వస్తే తన ఇమేజ్ పడిపోతుందని, వాడు ఇంట్లో అడుగుపెడితే.. తనని ఎవరు పట్టించుకోరని ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు. దీంతో శృతి.. వెంటనే మీనాకు ఫోన్ చేస్తుంది. తాను పెళ్లి మండపంలో లేనని, మీరే త్వరగా వెళ్లి.. ఆ పెళ్లిని ఆపాలని శృతికి మీనా రిక్వెస్ట్ చేస్తుంది.

మరోవైపు.. బాలుని కట్టిపడేసిన గోడౌన్ కు మీనా చేరుకుంది. రాజేష్ సహాయంతో మీనా.. బాలు కట్లను విప్పేస్తుంది. ఈ విషయాన్ని గమనించిన నీలకంఠ మనుషులు దాడి చేయడానికి వస్తారు. దీంతో బాలు రెచ్చిపోయి ఆ గుండాలను చితకబాది, అక్కడి నుండి తప్పించుకుంటారు. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలని మీనా అసలు విషయం చెబుతోంది. తాను ఇక్కడ నుంచి తప్పించుకోననే నమ్మకంతో సంజూ గాడు వాడి నిజ స్వరూపం ఏంటో తనకు చెప్పాడని, తన ప్రాణం ఉండగా తన చెల్లి మెడలో సంజూను తాళికట్టనివ్వనంటూ పెళ్లి మండపానికి బయలుదేరుతాడు బాలు. మన వైపు.. రవి, శృతి కూడా పెళ్లి మండపానికి బయలుదేరుతారు. దీంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X