Gunde Ninda Gudi Gantalu January 2nd: పెళ్ళి.. బాలుకి ఘోర అవమానం.. అయోమయంలో మౌనిక జీవితం..

Gunde Ninda Gudi Gantalu January 2nd: గుండె నిండా గుడి గంటలు గురువారం ఎపిసోడ్ లో బాలు వచ్చేవరకు సంజు, మౌనికల పెళ్లి జరుగుతుంది. దీంతో బాలు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. పక్కనే ఉన్న దీపం స్టాండ్ ను తీసుకువెళ్లి, సంజుపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. దీంతో అందరూ బాలుని అడ్డుకుంటారు. తన ఇంట్లో వారు అందరూ.. ఆపినా బాలు ఆగడు. ఆ స్టాండ్ తో సంజూను పొడవడానికి వెళ్తాడు. దీంతో తన చెల్లి మౌనిక అడ్డుపడుతుంది. దీంతో ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు. సంజు నరరూప రాక్షసుడని, వాడు నా చెల్లిని అడ్డుపెట్టుకొని, తమను ఆగం చేయాలని, కక్ష కట్టాడని బాలు అంటాడు. బాలు ఎంత చెప్పిన పట్టించుకోరు. వాడిని మాత్రం తాను వదలను అంటూ సంజును లాక్కొచ్చి చితకబాలుతాడు.

బాలుని ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఆగడు. ఈ సమయంలో సత్యం ఆగ్రహానికి లోనై బాలుపై చేయి చేసుకుంటాడు. మరోసారి బాలు నీలకంఠం నిజస్వరూపాన్ని బాలు బయటపెట్టే ప్రయత్నం చేస్తాడు. మరోసారి తన కొడుకుపై చేయి చేసుకుంటే బాగోదని నీలకంఠం వార్నింగ్ ఇస్తాడు. 'పచ్చని పెళ్లి పందిరిలో మీ చెల్లెలి పసుపు కుంకుమను చెడిపేయడానికి తయారయ్యావా? మూర్ఖుడా..' అంటూ బాలుని సత్యం నిందిస్తాడు. 'తాను గొప్పింటి సంబంధం తెస్తే.. చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నావా..? ఇన్నాళ్లు నువ్వు తాగిన మైకంలో మాట్లాడుతున్నావని అనుకున్న.. ఆరోజు జరిగిన దానిని మనసులో పెట్టుకొని ఇంత దారుణంగా అవమానిస్తావా.. నష్టజాత కూడా.. జీవితంలో తన ముఖం చూపించొద్దు. నా ముందు నుండి వెళ్లిపో' అంటుంది ప్రభావతి.

Gunde Ninda Gudi Gantalu serial episode 328 January 2nd 2025 here is full story

ఈ సమయంలో మీనా జరిగిన విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ, మీనాను కూడా నోరు మూయమని ప్రభావతి అరుస్తుంది. 'తన కూతురికి గొప్పింటి సంబంధం వచ్చిందని, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు' అంటూ మీనా ను కూడా అవమానిస్తుంది. మరోవైపు సుశీలమ్మ కూడా.. 'నచ్చకపోతే పెళ్లికి రాకపోవాల్సింది. కానీ, పచ్చని పందిరిలో నీ చెల్లిని చేసుకున్న వాడిని ఇలా అవమానిస్తావా..' అంటూ బాలుపై కోప్పాడుతుంది. ఇంతలోనే రవి, శృతి ఇద్దరూ పెళ్లి మండపానికి చేరుకుంటారు. బాలు వారిని చూసి.. సంజు ఇలాంటివాడు రవిని, శృతిని అడగమని అంటాడు.

'వాడు దుర్మార్గుడు, వాడి సైకో చేష్టలను భరించలేకనే, తాను రవిని పెళ్లి చేసుకున్నాను అంటూ శ్రుతి క్లారిటీ ఇస్తుంది. కానీ నీలకంఠ ..' నీ తప్పును సరిదిద్దుకోవడానికి.. మీ అత్తగారింట్లో చేరడానికి, నా కొడుకుపై నిందలు వేస్తున్నావా?' అంటూ అరుస్తాడు. దీంతో
రవికి కోపం వస్తుంది. బాలు అన్నయ్య చెప్పింది నిజమని, వాడు సైకో అని అంటాడు. కానీ, ప్రభావతి ఆ విషయాన్ని పట్టించుకోదు. 'నా కూతురు మెడలో తాళి కట్టిన తర్వాత.. నేను ఎవరు చెప్పినా వినను, ఎవరి మాటలను పట్టించుకోను. సంజు తన అల్లుడు' అని అంటుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 328 January 2nd 2025 here is full story

'అదో తాళి.. ఇదో పెళ్లి.. వీడొక పెళ్లి కొడుకు.. ఆ తాళిని తెచ్చి వేస్తా..' అంటూ బాలు.. మౌనిక మెడలో ఉన్న తాళిని పెంచే ప్రయత్నం చేస్తాడు. వద్దని బాలు నీ మౌనిక మొదట రిక్వెస్ట్ చేస్తుంది. ఆయన బాలు ఆగకపోయేసరికి.. మౌనిక తన అన్నయ్య పై చేయి చేసుకుంటుంది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. నీలకంఠ మాత్రం తాను అనుకున్న ప్లాన్ వర్క్ అవుట్ అయిందని నవ్వుతాడు.

'నీకు నచ్చినా.. నచ్చకపోయినా.. నా పెళ్లి జరిగిపోయింది. నీకు కోపంతో నీ అపార్థాలతో నా జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవరు ఇచ్చారు? నా తాళిని పెంచే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? వెళ్ళిపో అన్నయ్య.. నాకు కనిపించకు' అంటూ మౌనిక అరుస్తుంది. కానీ, తన అన్నయ్యను కొట్టిన భాదతో మౌనిక అక్కనుండి వెళ్ళిపోతుంది. 'ఏ చెల్లెలు కోసం .. ఇంత రాద్ధాంతం చేశావో.. ఆ చెల్లెలే నిన్ను చీకొట్టి వెళ్లిపోమంటుంది. ఇకపై నీ ముఖం నాకు చూపించకు.. ఇకనుండి వెళ్ళిపో' అంటూ బాలుని సత్యం చీకొడతాడు. 'అరే.. నష్టజాత కూడా మరోసారి నీ ముఖం నాకు చూపించకు. ఇకనుండి వెళ్లిపోరా.. జీవితంలో నీ మొఖం నాకు చూపించకు' అంటూ ప్రభావతి రెచ్చిపోతుంది. దీంతో బాలు అక్కడి నుండి వెళ్లిపోతాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 328 January 2nd 2025 here is full story

మరోవైపు మౌనిక కోసం మీనా వెళ్లగా..తన అన్నయ్యను కొట్టానని మౌనిక తన చెయ్యి కాల్చుకునే ప్రయత్నం చేస్తుంది. దాన్ని చూసిన మీనా షాక్ అవుతోంది. ఇలాంటి పిచ్చి పనులు చేయకు అని చెబుతుంది. 'మీ అన్నయ్యకు నువ్వంటే ప్రాణం.. నీ జీవితం బాగుండాలని మీ అన్నయ్య ప్రయత్నించాడు' అంటూ మీనా అంటుంది. అసలు అన్నయ్య ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో.. తనకు అర్థం కాలేదని , ఆ ఆవేశంలో ఏమైనా చేస్తాడేమోనని, తాను అన్నయ్యను కొట్టాల్సి వచ్చిందని క్లారిటీ ఇస్తుంది మౌనిక. జీవితంలో ఏ కష్టం వచ్చినా.. తమకు చెప్పమని తాము అండగా ఉంటామని మౌనికకు మాటిస్తుంది మీనా.

మరోవైపు .. తమకు ఇలాంటి అవమానాలు అవసరం లేదంటూ సంజు, నీలకంఠం మరో డ్రామా వేస్తారు. మీ అబ్బాయి ఎక్కడున్నా ఇలానే ప్రవర్తిస్తాడని, తమకు వద్దని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు.' అన్న చేసిన పనికి.. చెల్లికి శిక్ష వేయొద్దు 'అంటూ సత్యం వారిని రిక్వెస్ట్ చేస్తాడు. ఎప్పుడు నోరు తెరువని సంజు తల్లి.. 'అవసరం లేదు.. ఇప్పటికే బాలు తన కొడుకుని మూడు నాలుగు సార్లు కొట్టాడు. తామే తమ కొడుకును ఇప్పటివరకు కొట్టలేదు. మీ కూతుర్ని మీ దగ్గరనే ఉంచుకోండి. మాకు కోటీశ్వరుల సంబంధాలు వస్తాయి' అంటూ షాక్ ఇస్తుంది. దీంతో ప్రభావతి డైలమాలో పడుతుంది ఇంతటితో సీరియల్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X