Gunde Ninda Gudi Gantalu January 3rd: నీలకంఠం షాకింగ్ కండీషన్.. శోభనం గదిలో మౌనికకు..
Gunde Ninda Gudi Gantalu January 3rd: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ లో సత్యం మాట్లాడుతూ.. అన్న చేసిన తప్పుకు చెల్లికి శిక్ష వేయకండి అంటూ ప్రాధేయపడతాడు. 'అవసరం లేదు. మా కొడుకుపై మేమే చేయి వేయలేదు. అంతగా ఇష్టం లేనప్పుడు మీ అమ్మాయిని మీ ఇంట్లోనే ఉంచుకోండి. మావోడికి కోటి సంబంధాలు వస్తాయి' అంటూ సంజు తల్లి అంటుంది. దీంతో ప్రభావతి ఫ్యామిలీ షాక్ అవుతుంది. 'అయినా.. అన్న చేసిన తప్పుకు చెల్లెలు ఎందుకు శిక్షించాలి. బాలు చేసిన తప్పుకు మౌనిక కు ఎందుకు శిక్షించాలి?' అంటూ ఏమీ తెలియనట్టు సంజు మాట్లాడుతాడు.
సంజూ మాటలతో నీలకంఠం రెచ్చిపోతాడు. 'వాడు ఒక పెద్ద గుండాలా ఉన్నాడు. ఇప్పుడే ఇలా చేస్తే.. రేపు వాడి చెల్లెలు ఇంటికి తీసుకువెళ్తే.. అక్కడికి వచ్చి గొడవ చేయడానికి నమ్మకమేముంది? నా వల్ల కాదు.. పెళ్లి లేదు. పిల్లా లేదు' అని అంటాడు. దీంతో ప్రభావతి.. బాలు చేసిన తప్పుకు తమని క్షమించమని, ఇది ఆడపిల్ల జీవితం మీరు తప్పుగా ఆలోచించకండి అంటూ ప్రాధాయపడుతుంది.
సుశీలమ్మ కూడా 'బాలు మంచివాడే.. కానీ, వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. అయినా అన్న చేసిన తప్పుకు చెల్లికి ఎందుకు శిక్ష అన్న తొందరపడ్డందుకు చెల్లె చెంప దెబ్బ శిక్షించింది. బాలు మీ జోలికి రాకుండా నేను చూసుకుంటా. మా పిల్లలు మీ ఇంటి కోడలుగా తీసుకువెళ్లండి బాబు అంటూ ప్రాధేయపడుతుంది.

దీంతో నీలకంఠం ఓ కండిషన్ పెడతాడు. 'మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకు వెళ్లడానికి మేము సిద్ధమే. మీరందరూ ఎప్పుడు కావాలంటే అప్పుడు మా ఇంటికి రావచ్చు. కానీ, బాలు మాత్రం ఈ జన్మలో నా ఇంటి గడపలో కాలు పెట్టకూడదు' అంటూ కండిషన్ పెడతాడు. ఈ కండిషన్ కు ఒప్పుకుంటేనే తాను మౌనికను కోడలుగా తీసుకువెళ్తామంటూ చెబుతాడు నీలకంఠం. దీంతో సత్యం అడ్డు చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ, ప్రభావతి ఆ కండిషన్ కు తాను ఒప్పుకుంటున్నని, వాడు జీవితంలో మీ ఇంటికి రాడు ఇలాంటి గొడవ చేయడు తాను మాటిస్తునని అంటుంది. దీంతో ఇంటిల్లిపాది షాక్ అవుతారు.
తన కండిషన్ కు ఒప్పుకోవడంతో నీలకంఠం.. తమ కోడలు పంపించమని అంటాడు. తర్వాత అప్పగింతలు చేసి సాగనంపుతారు. ఈ సమయంలో బాలుని తక్కువ చేసి మాట్లాడడంతో మీనా కు కోపం వస్తుంది. ఆయన ఎందుకు అలా ప్రవర్తించాడో.. దానికి కారణాలేంటో అందరికీ తెలుసు.. అంటూ దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇస్తుంది. అలా బాలు లేకుండానే.. మౌనికను అత్తగారింటికి పంపిస్తారు. మరోవైపు.. బాలు పుల్ గా తాగి ఓ గుడి దగ్గరకు చేరుకుంటాడు. తన చెల్లెలు, తండ్రి అన్న మాటలను తలుచుకొని బాధపడతాడు. తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ బాధపడతాడు.
ఇంతలోనే ఓ స్వామీజీ వచ్చి.. మీ చేతిలో లేని వాటి గురించి అనవసరంగా ఆలోచించి బాధపడకు, పెళ్లిళ్లు అనేవి స్వర్గంలోనే నిర్ణయించబడతాయి. పెళ్లి అనేది ఆపాలనుకుంటే ఆగదు. అది పుట్టుకతోనే నిర్ణయించబడుతుంది. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు అని ఆ స్వామీజీ చెప్తాడు. 'అయినా ఆ రాక్షసుడుకి ఇచ్చి తన చెల్లిని పంపడం తనకి ఇష్టం లేదని' బాలు బాధపడతాడు. ప్రతివాడు ఎప్పుడో అప్పుడు పరిస్థితులను బట్టి మారుతాడు. మంచి, చెడు అనేది.. పెంపకం బట్టి ఉంటుంది. తప్పకుండా ప్రతి మనిషిలోను మార్పు వస్తుంది అని స్వామీజీ చెబుతాడు.

'నేను ఏ నమ్మకంతో వాడిని నమ్మాలి. వాడికి నా చెల్లెల్ని ఇచ్చి పంపించాలి' అని బాలు ఆ స్వామిజీని అడుగుతాడు. 'ఏ నమ్మకంతో మీ చెల్లె వాడిని పెళ్లి చేసుకుంది. ఆ నమ్మకమే వాడిని మారుస్తుంది. అంతా మంచే జరుగుతుంది. బాధపడకు' అంటూ స్వామీజీ వెళ్లిపోతాడు. మరోవైపు.. మీనా బాలు కోసం వెతుకుతూ వస్తుంది. బాలు పరిస్థితులు చూసి మీనా కూడా బాధపడుతుంది. మౌనిక కొట్టినందుకు బాధపడుతున్నారా? అని ప్రశ్నించగా బాలు సమాధానం చెబుతూ ఇంకా నాలుగు దెబ్బలు వేసినా తాను బాధపడే వాడిని కాదని వాడిని నమ్మి మోసపోయిందంటూ బాధపడతాడు. 'మీ చెల్లి నువ్వు ఎక్కడ ఆవేశపడి హంతకుడులా మారుతావో అనే భయంతోనే కొట్టింది. మీరు బాధపడకండి. అంతా సెట్ అవుతాయని' సద్ది చెబుతుంది మీనా. అందరిలాగానే తన చెల్లి కూడా వాడి మాయలో పడి మోసపోయిందని బాలు బాధపడతాడు.
మరోవైపు.. మౌనిక తన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. తన అత్తగారింట్లో పూజ చేసి.. అందరూ కలిసిపోయేలా చూడమని ఆ దేవుని ప్రార్థిస్తుంది. ఆ తర్వాత తన అత్తమామల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. తర్వాత శోభనానికి ముహూర్తం పెడతారు. ఈ సమయంలో సంజీవ్ తల్లి పూర్ణ.. సహనం ఓర్పు తో ఉండమని సలహా ఇస్తుంది. నీ కాపురాన్ని నీకు తగ్గట్టుగా మార్చుకోవడం నీ బాధ్యత అని ఇన్ డైరెక్టుగా సంజీవ్ క్యారెక్టర్ గురించి చెబుతోంది. ప్రతి సంసారంలో మంచి చెడులు, కోపం శాంతం వంటివి ఉంటాయి వాటిని సర్దుకుపోవడమే జీవితం అని చెబుతుంది. తాను అన్నిటిని భరిస్తానని మౌనిక సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత ఎన్నో ఆశలతో శోభనం గదిలోకి ఎంటర్ కాగానే సంజు షాక్ ఇస్తాడు.


Click it and Unblock the Notifications










