Gunde Ninda Gudi Gantalu January 6th: శోభనం గదిలో మౌనికకు సంజు షాక్.. ప్రభావతికి మీనా వార్నింగ్..

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు సోమవారం ఎపిసోడ్ లో మౌనిక శోభనం గదిలోకి రాగానే సంజు మందు తాగుతూ కనిపిస్తాడు. 'నువ్వేమైనా వీఐపీవా..వెల్కమ్ చెప్పడానికి' అంటూ మౌనిక చేతిలో ఉన్న పాల గ్లాసును గుంజుకొని.. 'శోభనం రోజు పాలే తాగాలా.. మందు తాగుదాం..' అంటాడు బాలు. దీంతో ఒక్కసారిగా మౌనిక షాక్ అవుతుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో పడిపోతుంది. ఆ తర్వాత మౌనికను బెడ్ పై కూర్చున్న పెట్టి.. మౌనిక చేతిలో చూస్తాడు. 'ఈ చేత్తోనే కాదా మీ అన్నయ్యను కొట్టింది. మరోసారి ఇలాంటి పనులు చేయకు' అంటాడు.

'ఈ ప్రపంచంలో మొదటిసారి చూడగానే.. నా గురించి అర్థం చేసుకుంది మీ అన్నయ్య ఒక్కడే ..' అంటూ శృతి, రవిలా స్టోరీని, అలాగే బాలు తనని బార్లో కొట్టి అవమానించడం, వీటన్నిటికీ మీనా సపోర్ట్ చేయడం. అందుకే మీ ఫ్యామిలీ పై రివెంజ్.. ఆ రివెంజ్ తీర్చుకోవడానికి.. నేను నీ మెడలో తాళి కట్టాను. ఇక నుంచి నీకు రోజుకో శిక్ష వేస్తా..' అంటూ అసలు విషయాన్ని బయట పెడతాడు సంజు. 'చీ దుర్మార్గుడా.. నీ మీద నమ్మకంతో మా అన్నయ్యను కొట్టాను కదా.. ఒక్కసారి నీ గురించి చెప్తే.. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పడేస్తాడు. అంటూ గదిలో నుండి బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది మౌనిక.

Gunde Ninda Gudi Gantalu serial episode 330 January 6th 2025 here is full story

కాస్త ఆగు అని.. గన్ చూపించి సంజూ భయపెడతాడు. 'నాకు కావాల్సింది కూడా అదే. మీ అన్నయ్యను రమ్మను'అని సంజు అంటాడు. 'వాడు రాగానే నామీద హత్యా ప్రయత్నం చేస్తాడు. దీంతో వాడు జైలుకు వెళ్తాడు. దీంతో మీ నాన్నకు హార్ట్ ఎటాక్ వస్తుంది. మీ మమ్మీ జీవితం ఆగమవుతుంది. ఇలా మీ ఫ్యామిలీ మొత్తం సర్వనాశనం అవుతుంది. నాకు కావలసింది కూడా ఇదే.. రమ్మను' అంటూ మౌనికను బ్యాక్ మెయిల్ చేస్తాడు బాలు. దీంతో మౌనిక తనలో తాను కుమిలిపోతుంది. తన అన్నయ్య ఎంత చెప్పినా .. సంజుని నమ్మి మోసపోయానంటూ ఏడుస్తుంది. ఆ సీను చూస్తూ సంజు మందు తాగుతూ ఎంజాయ్ చేస్తాడు. నీలకంఠం కూడా తన కోడలు ఏడుపు వింటూ ఎంజాయ్ చేస్తూ మందు తాగుతాడు.

మరోవైపు.. బాలు ఇంకా ఇంటికి రాలేదని సత్యం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ, వాడిని ఇంటిలోకి రానిచ్చేది లేదు అంటుంది ప్రభావతి. ఇంతలోనే బాలుని తీసుకొని మీనా ఇంట్లోకి వస్తుంది. 'చెల్లెలు పెళ్లిని చెడగొట్టినవాడు. తన కుటుంబ పరువును రోడ్డుకీడ్చిన వాడు.. నా ఇంట్లో ఉండటానికి వీలు లేదు'అంటూ ప్రభావతి బాలుని ఇంట్లో నుండి వెళ్లిపొమ్మని ఆర్డర్ వేస్తోంది. దీంతో బాలు..' నాకు ఏ దిక్కు లేదు. పెద్దవాడు కోటీశ్వరుల సంబంధం చేసుకున్నాడు. చిన్నవాడు వాడు కూడా లేచిపోయి కోటీశ్వరుడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక చెల్లె కూడా కోటీశ్వరుల సంబంధం చేసుకుంది. నేను మాత్రం పూలు అమ్మి అమ్మాయిని పెళ్లి చేసుకున్..న నాకు ఏ దిక్కు లేదు.. నేను ఎటు వెళ్లాలని ప్రశ్నిస్తాడు.

కుటుంబ మర్యాద, బాధ్యతలు తెలియకుండా ప్రవర్తించేవాడు, నా ఇంట్లో ఉండను అవసరం లేదు అంటూ ప్రభావతి రెచ్చిపోతుంది. దీంతో మీనా ఆగ్రహంతో ఊగిపోతుంది. తన అత్త ప్రభావతి ఎదురు మాట్లాడుతూ.. 'నా మొగుడు ఏం తప్పు చేశాడు.మీ పెద్ద కొడుకు లాగా 40 లక్షలు తీసుకెళ్లి మోసం చేశాడా.. చిన్నవాడి లాగా తన స్వార్థం కోసం ఇంట్లో నుండి వెళ్లిపోయాడా.. తన తండ్రి కోసం తన జీవనాధారమైన కారణం అమ్మేసి ప్రాణాలు కాపాడాడు' అంటుంది దీంతో అందరూ సైలెంట్ అవుతారు. ఆ తర్వాత బాలు తన తండ్రి దగ్గరికి వెళ్లి ..నేను ఇంట్లో ఉండాలా.. వెళ్లిపోవాలా నాన్న మీరే చెప్పండి అని అడుగుతాడు.

దీంతో సత్యం.. అమ్మ వీడిని రూమ్ లోకి తీసుకెళ్లి.. ఏదైనా తినిపించమ్మా అని మీనాకు చెపుతాడు. దీంతో బాలు, మీనాలు తమ గదిలోకి వెళ్తారు. ఈ సమయంలో మనోజ్ అడ్డు చెప్పే ప్రయత్నం చేయబోతుంటే.. సత్యం గట్టిగా అరుస్తాడు. దీంతో మనోజ్ కూడా సైలెంట్ గా ఇంట్లోకి వెళ్లిపోతాడు. ప్రభావతి ఏదో మాట్లాడపోతుంది సత్యం అరవడంతో ప్రభావతి కూడా సైలెంట్ గా ఇంట్లోకి వెళ్ళిపోతుంది.ఆ తర్వాత మీనా అన్నం తీసుకొని రూమ్ కి వస్తుంది. కాస్త తినండి అని మీనా చెబుతోంది.

'గుండె నిండా బాధ.. కడుపునిండా దుఃఖం ఉన్నప్పుడు తినాలని అనిపిస్తుందా.. అంటూ బాలు బాధపడతాడు. 'బాధ ఉన్నప్పుడు ఎవరికీ తినాలని అనిపించదు. అందుకే దేవుడు తల్లిని ఇచ్చాడు. పెళ్లి తర్వాత ఆ తల్లి బాధ్యతను భార్య తీసుకుంటుంది. అందుకే మీ ప్రతి కష్టసుఖాలలో పాలుపంచుకుంటా.. మీకు అనునిత్యం తోడుగా ఉంటా' అంటూ బాలుకి ధైర్యం చెప్పి..అన్నం తినిపిస్తుంది మీనా. ఆ సమయంలో బాలు మాట్లాడుతూ..'జీవితంలో మొదటిసారి భయమేస్తుంది, అభం శుభం తెలియని ఓ చిన్న లేడీ పిల్లను పులిబొన్ లోకి పంపించినట్లు.. నా చెల్లిని సంజుకిచ్చి పెళ్లి చేశారు' అంటూ బాధపడతాడు. వాడి చేతిలో తన చెల్లెలు నరకమునకు భావిస్తుంది కావచ్చునని బాలు బాధపడతాడు. ఇంతటితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X