Gunde Ninda Gudi Gantalu January 7th: సంజూ టార్చర్ పీక్స్.. బాలుకి పీడకల.. మౌనికకు అత్త సపోర్టు?

Gunde Ninda Gudi Gantalu January 7th: గుండె నిండా గుడి గంటలు గుండె నిండా గుడి గంటలు మంగళవారం ఎపిసోడ్లో బాలు తన చెల్లె జీవితాన్ని తలుచుకుంటూ బాధపడతాడు. తన చెల్లి పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నానని, ఓ మంచి వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని భావించాలని చెప్పుకొస్తాడు. ఈ సమయంలో తన చెల్లి పెళ్లి కోసం తాను పొదుపు చేసిన డబ్బులతో బంగారు గాజులను కొన్నానని మీనాకు చూపిస్తాడు. తన చెల్లి కోసం చేసిన త్యాగాలను గుర్తుకు చేసుకుంటూ బాలు భయపడతాడు. ఈ సమయంలో మీనా బాలుని ఓదార్పు తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. మీ చెల్లెల్ని ఏమైనా అంటే ఊరుకోరు అనే విషయం వారికి అర్థమైందని బాలుకి ధైర్యం చెబుతోంది.

మరోవైపు మౌనిక.. పూజ గదిలో పూజ చేసుకుంటూ.. శోభనం రాత్రి జరిగిన అవమానాలు, సంజు నిజస్వరూపం గుర్తుకు చేసుకుంటూ బాధపడుతుంది. తన వల్ల తన అన్నయ్యకు ఏమీ కావొద్దు అంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తుంది. ఇంతలోనే తన అత్తమ్మ వచ్చి.. మౌనిక బాధను అర్థం చేసుకుంటుంది. మాటల్లో గుండెల్లో దాచుకున్నట్లు బాధను కళ్ళల్లో దాచుకోలేము కదా అంటూ.. తాను కూడా 25 సంవత్సరాల క్రితం ఇలానే ఎన్నో ఆశలతో ఇంట్లో అడుగు పెట్టానని, కానీ సముద్రం లోతు తెలియనట్లు ఇందులోకి వచ్చినాక తన జీవితం అర్థమైందని చెబుతుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 331 January 7th 2025 here is full story

ప్రేమతోనే వాడిని మార్చుకోవాలని సంజు తల్లి చెపుతుంది. సంజు తనని కక్ష సాధించుకోవడానికే పెళ్లి చేసుకున్నాడని, తనపై ఎలాంటి ప్రేమ లేదని తన దృష్టిలో ఇది పెళ్లి కాదని, తన ప్లాన్లు ఇదొక భాగమని మౌనిక అసలు విషయాన్ని బయటపెడుతుంది. ప్రేమతో సాధించలేనిది ఏదీ లేదని, నీ ప్రయత్నం తో సంజు కచ్చితంగా మారుతాడని, ప్రతి విషయంలో నీకు నేను అండగా ఉంటానంటూ మౌనికకు తన అత్త సపోర్టుగా నిలుస్తోంది.

మరోవైపు.. సుశీలమ్మ.. బాలు దగ్గరికి వస్తుంది. కానీ, బాలు పడుకొని ఉండటంతో మీనాతో మాట్లాడుతుంది. 'రాత్రి నీ మొగుణ్ణి అంటే ఎంత కోపం వచ్చిందే.. ఇన్ని రోజులకు ధైర్యం వచ్చింది. నువ్వు ఎలాగైనా నీ మొగుడిని జాగ్రత్తగా చూసుకుంటావని ధైర్యం నాకు వచ్చింది' అని, బాలుని జాగ్రత్తగా చూసుకోమని సుశీలమ్మ అంటుంది. తర్వాత సత్యం దగ్గరికి వచ్చి.. తాను బయలుదేరుతున్నానని చెబుతోంది. వెళ్లే ముందు రవి శృతిలను ఎప్పుడు ఇంటికి తీసుకు వస్తున్నామని సత్యాన్ని అడుగుతుంది. దీంతో కోపంతో ప్రభావతి ముఖం చూస్తాడు సత్యం.

'ఈ రోజులలో ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వాటిని పట్టించుకోవద్దు, రవి, శృతి లను ఇంటికి పిలిపించు, ముగ్గురు కోడలు.. ముగ్గురు మనమళ్లతో ఇల్లు పండంటి సంసారంగా మారుతుంది. అందరూ కలిసి ఉంటేనే సంతోషం ' అని సుశీలమ్మ చెబుతోంది. వెళ్లే ముందు ప్రభావతి తో మాట్లాడుతూ.. మౌనిక మీద ప్రేమతోనే బాలు ఆ గొడవ చేశాడని, ఇంతటితో ఆ గొడవని మర్చిపోమని అనవసరంగా బాలు , మీనాను నిర్ణయించకు అని వారిని ఇస్తుంది సుశీలమ్మ.

మరోవైపు.. సంజును నిద్ర లేపడానికి మౌనిక గదిలోకి మళ్ళీ వస్తుంది. శోభనం రాత్రి అన్న మాటలను గుర్తుకు చేసుకుంటూ బాధపడుతుంది. నిద్ర లేపాలా వద్దా అని భయపడుతుంది. ఈ సమయంలో తన చేయి తాకి.. ఫ్లవర్ వాజ్ కింద పడుతోంది. దీంతో సంజూ నిద్ర లేస్తాడు. అనవసరంగా తన నిద్రను డిస్టర్బ్ చేసావ్.. అంటూ మీ నాపై మండిపడతాడు. తాను కాఫీ తెచ్చానని చెబుతోంది మౌనిక. 'నీ కాఫీ ఎవడికి కావాలి అని, ఆ కాపీని పారబోసి.. అందులోనే మందు పోసుకుని.. హ్యాండ్ ఓవర్ పెగ్గు అంటూ పొద్దున్నే మందు తాగుతాడు. దీంతో సంజును అసహ్యంగా చూస్తుంది మౌనిక.

'ఏంటి అలా చూస్తున్నావ్? మీ అన్నయ్య కూడా తాగుతాడు కదా..' అని బాలుని అవమానిస్తాడు సంజు. తన అన్నయ్య పొద్దంతా కష్టపడి.. రాత్రి ఆ కష్టాన్ని మరిచిపోవడానికి తాగుతాడు. నీలాగా పొద్దున్నే లేవగానే తాగడు అని అంటుంది. దీంతో నోరు లేస్తే పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయని భయపడతాడు సంజు.

మరోవైపు.. మౌనికను సంజు ఇబ్బంది పెట్టినట్లు, టార్చర్ చేస్తున్నట్లు బాలుకి పీడకల పడుతుంది. దీంతో .. ఒక్కసారిగా ఉలిక్కిపడి బాలు లేస్తాడు. తన చెల్లెల్ని ఒక్కసారి చూసి వస్తానంటూ బయలుదేరుతాడు. దీంతో ప్రభావతి అడ్డుపడుతుంది. అనవసరంగా లేనిపోని గొడవలు చేయొద్దంటూ .. బాలుని తిడుతుంది. వాడి డబ్బు చూసి చెల్లెలు గొంతు కోశారని, ఎవరైనా ఒక్కసారైనా వాళ్ళు ఎలాంటి వాళ్లు ఎంక్వయిరీ చూసారా? అని నిలదీస్తాడు. అనవసరంగా లేనిపోని ఇబ్బందులను తీసుకురావద్దంటూ, మీ చెల్లెలు బాగోలేదని నీకెలా తెలుసు అని ప్రభావతి నిలదీస్తుంది. అయినా.. తాను ఒకసారి వెళ్లి తన చెల్లెలు చూసి వస్తానని అంటాడు. దీంతో మనోజ్ అడ్డుపడతాడు. దీంతో నేటి సిరియల్ పూర్తవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X