Gunde Ninda Gudi Gantalu January 8th:ముంచుకొస్తున్న మరో ప్రమాదం..ప్రభావతికి దిమ్మతిరిపోయే కండిషన్ పెట్టిన బాలు
Gunde Ninda Gudi Gantalu January 8th: గుండె నిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్ లో బాలు తన చెల్లెలు దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మనోజ్ వద్దంటూ అడ్డుపడతాడు. దీంతో బాలుకి ఎక్కడలేని కోపం వస్తుంది. మనోజ్ ను తోసేస్తాడు. తన ముద్దుల కొడుకును తొసివేయడంతో ప్రభావతి ఒక్కసారిగా రెచ్చిపోతుంది. ' వెళ్ళరా వెళ్ళు.. నీ చెల్లెలు జీవితంలో నిప్పులు పోయి. సంతోషంగా ఉన్నా తన జీవితాన్ని ఆగం చేయి.. వారి మధ్య కొట్లాటలు పెట్టు' అంటూ ప్రభావతి తిడుతుంది. మరోవైపు సత్యం వచ్చి.. బాలు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు.
'తాను నలుగురు పిల్లల తండ్రిగా చెబుతున్నాను. ఏ తండ్రి కూడా తన కూతురు బాధపడాలని, ఏప్పుడు కూడా అనుకోడు. నీ చెల్లి అక్కడ సంతోషంగానే ఉంటుందని అంటాడు. కేవలం నీ అతి ప్రేమ వల్లనే.. నువ్వు ఇలా ఆలోచిస్తున్నావ్ ' అని క్లాస్ పీకుతాడు. పైగా చెల్లి దగ్గరికి వెళ్ళనని మాట ఇవ్వమని కోరుతాడు. కానీ, బాలు దానికి అంగీకరించడు. దీంతో మీనా కూడా బాలుకు నచ్చజేపే ప్రయత్నం చేస్తుంది. దీంతో బాలు కోపంతో తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు.

'ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి' అని బాలుకి మీనా చెబుతోంది. దీంతో బాలు కోపం మరింత పెరుగుతుంది. 'ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంది మీరు.. డబ్బు అత్యాశతో అమాయకురాలైన నా చెల్లెల్ని బలి చేశారు' అంటూ మండిపడతాడు. ' ఈ ఇంట్లో నాకు ఎలాంటి అధికారాలు లేవు.. నువ్వు చెప్పిన ఓకే చెప్పాలి. మీ అమ్మ చెప్పినా ఓకే చెప్పాలి. నాకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం మీ ఇంట్లో ఎవరు ఇచ్చారు? అంటుంది మీనా.
అన్నిటికి ఓ సమయం వస్తుంది. అంతవరకు వేచి ఉండమని బాలు కి సలహా ఇస్తుంది మీనా. 'అంటే మీలాగా నేను చేతులకు గాజులు తీసుకొని సైలెంట్ గా ఉండమంటావా ? 'అంటూ మీనా పై సీరియస్ అవుతాడు. 'మీ చెల్లెలు అంతా చిన్న పిల్ల ఏం కాదు ..తన కూడా లోకజ్ఞానం తెలుసు .. ఏది మంచూ.. ఏది చెడో తనకి తెలుసు. తన నిర్ణయం తనకు తీసుకోగల లోకజ్ఞానం ఉంది. అనవసరంగా ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడొద్దు. ఇప్పుడు మీ ఇంట్లో మీ మాట నమ్మే పరిస్థితిలో ఎవ్వరు లేరు. మౌనికకు ఏదైనా ఆపద వస్తే ఎవరు కూడా ఊరుకోరు కదా. ఏదోక రోజు కచ్చితంగా మీ బాధను వాళ్లు అర్థం చేసుకుంటారు. అప్పటివరకు కాస్త సైలెంట్ గా ఉండండి' అంటూ మీనా బాలుకి రిక్వెస్ట్ చేస్తుంది.
ఆ తర్వాత రాత్రి ఇచ్చిన గాజులను తీసుకువచ్చి బాలుకి ఇస్తుంది. మీ చెల్లెలుకు ఈ గాజులు వేసే రోజు త్వరలోనే వస్తుంది. మీరే మీ చెల్లెలుకు స్వయంగా తొడిగే రోజులు వస్తుంది' అంటూ బాలుని శాంతింపజేసే ప్రయత్నం చేస్తుంది మీనా. దీంతో బాలు కూల్ అవుతాడు దీంతో త్వరగా స్నానం చేయండి గుడికి వెళ్దామంటూ చెబుతోంది. ఆ తర్వాత బాలు కాస్త శాంతించి.. టిఫిన్ చేస్తాడు. ఇంతలోనే ప్రభావతి వచ్చి.. మళ్లీ బాలుని రెచ్చగొడుతుంది. లేనిపోని మాటలు అంటూ బాలుకి కోపం తెప్పిస్తుంది. ఇంతలోనే సత్యం వస్తాడు. అనవసరంగా గొడవ పెట్టుకోవద్దని ప్రభావతికి ఇటు బాలుకి నచ్చ చెప్తాడు.
'అందరు కనిపిస్తున్నారు.. మరీ షీలా డార్లింగ్ ఎక్కడ ? అని అడుగుతాడు బాలు. దీంతో ప్రభావతి 'ఆమె ఎప్పుడో పోయింది' అంటూ నోరు జారుతుంది. అలా తప్పుగా మాట్లాడటం అందరూ ప్రభావతిని కోపంగా చూస్తారు. మాట్లాడేటప్పుడు సరిగా మాట్లాడాలి అని సత్యం కోప్పడతాడు. ఆ తర్వాత ప్రభావతి మరింత రెచ్చిపోతుంది పెద్దకొడుకు ఎన్ని తప్పులు చేసిన వెనుక వెనకేసుకొని వస్తున్నారు. కానీ, చిన్నవాడు ఏం తప్పు చేశాడు వాడిని కూడా పిలవాలి అని ప్రభావతి అంటుంది. ఇది అదునుగా మనోజ్ కూడా రెచ్చిపోయే ప్రయత్నం చేస్తాడు.

సందు దొరికితే చాలు తల్లి కొడుకులు రెచ్చిపోతారుగా అంటారు బాలు. ఈ సమయంలో సత్యం మాట్లాడుతూ.. శ్రుతి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి.. ఇంట్లో తమ కూతురిని అప్పజెప్తేనే వారిని ఇంట్లోకి రానిస్తానని ఆ మేటర్ ను అక్కడితో క్లోజ్ చేస్తాడు. అది జరగని పనిలే నాన్న.. వాళ్లు ఇలాంటి వాళ్లు మనం చూశాం కదా.. అంటాడు బాలు. ఆ తర్వాత తాము గుడికి వెళ్తున్నామని మీనా చెబుతోంది. 'గుడికే వెళ్తున్నారా? ఇంకా ఏటైనా వెళ్తున్నారా? అంటూ ఎటకారంగా మాట్లాడుతుంది ప్రభావతి. అలాంటి అనుమానాలు అవసరం లేదు అత్తయ్య అంటూ ఇన్ డైరెక్ట్ గా ప్రభావతికి పంచువేస్తుంది.
పక్కనే ఉన్న మనోజ్ ఏమో బయటికి వెళ్లి.. ఏ గొడవ తీసుకొస్తారో అంటాడు. 'నీలాగా సైలెంట్ గా కూర్చోవడం నాకు చేతకాదు' అని బాలు రిప్లై ఇస్తాడు. 'మాకు వేరే వాళ్ళ జీవితాలలో జోక్యం చేసుకోవడం. మాకు తెలియదు' అని రోహిణి అంటుంది. 'అవును మరి మీరు మాత్రమే బాగుండాలి.. మీరే బాగుండాలి అని మీరు కోరుకుంటారు. కాబట్టి ఇలానే ఆలోచిస్తారు' అంటూ రోహిణి కూడా పంచ్ వేస్తాడు బాలు.' చెప్పినట్లు తాను మౌనికను కలువడానికి వెళ్లను. నువ్వు కూడా శృతి,రవిని కలవకూడదు' అంటూ బాలు వెళ్లిపోతాడు.
మరోవైపు సురేంద్ర తెల్లవారుగానే మందు తాగుతూ ఉంటాడు. దీంతో శృతి తల్లి బాధపడుతుంది. ఎలాగైనా శృతిని, రవిని ఇంటికి తీసుకురావాలని సురేంద్రకు చెబుతుంది. అలా వాడిని వాళ్లకు దూరం చేస్తే ప్రభావతి,సత్యం కు జీవితాంతం దెబ్బ కొట్టిన వాళ్ళం అవుతాం అంటూ మాస్టర్ ప్లాన్ వేస్తుంది శృతి తల్లి .దీనికి సురేంద్ర కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. దీంతో నేటి సీరియల్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










