Gunde Ninda Gudi Gantalu January 9th: మౌనికను కలిసిన బాలు.. మరో ట్రాప్ లో పడ్డ ప్రభావతి..
Gunde Ninda Gudi Gantalu January 9th: గుండె నిండా గుడి గంటలు గురువారం ఎపిసోడ్ లో సురేంద్ర, తన భార్య ఇద్దరు.. ప్రభావతి ఫ్యామిలీ పై కక్ష కడతారు. ఇలాగేనా సత్యంను దెబ్బతీయాలని, ముగ్గురు కొడుకులు వేరు చేసి, ప్రభావతికి కడుపు కోత ఎలా ఉంటుందో చూపించాలని శృతి తల్లి అంటుంది. తాను అనుభవిస్తున్న బాధను ప్రభావతి కూడా అనుభవించాలనీ, తన పగ ఎలా ఉంటుందో.. ప్రభావతికి చూపిస్తా అంటూ శపధం చేస్తుంది శృతి తల్లి.
మరోవైపు బాలు, మీనా గుడికి వస్తారు. ఈ సమయంలో బాలుకు తెలియకుండా.. మౌనిక కోసం తెచ్చిన గాజులను తీసుకువచ్చి, వాటికి పూజ చేపిస్తుంది. తన చెల్లెల్ని కాపాడమని ఆ దేవుని ప్రార్థిస్తాడు బాలు. తన భర్త కోరుకున్న కోరికలను తీర్చమని మీనా ప్రార్థిస్తుంది. ఇంతలోనే మౌనిక సంజు అదే గుడికి వస్తారు. ప్రదక్షిణలు చేసే సమయంలో మౌనిక తన అన్నవదినలను చూస్తుంది. అలా ఒక్కసారిగా తన అన్నయ్యను చూడడంతో మౌనిక ఎమోషనల్ అవుతుంది.

సంజుకు తెలియకుండా.. తన అన్నయ్య దగ్గరికి వచ్చి, క్షమాపణ చెబుతుంది మౌనిక. తనను కావాలని కొట్టలేదనీ, తనని క్షమించమని అడుగుతుంది మౌనిక. తాను అవన్నీ పట్టించుకోలేదని, సంజు ఇలా చూసుకుంటున్నాడని ప్రశ్నిస్తాడు బాలు. దీంతో ఏం చెబితే ఎలాంటి గొడవలు జరగుతాయో తెలియక.. తన అత్తయ్య దేవత అనీ, మామయ్య అయితే.. తాను చేసే ఏ విషయంలో కూడా జోక్యం చేసుకోడాన్ని చెబుతోంది. తాను అడుగుతూ సంజు గురించి.. వాడు ఏమైనా టార్చర్ చేస్తున్నాడా ? ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? అని ప్రశ్నిస్తాడు బాలు.
అసలు విషయం చెప్తే.. ఇక్కడ గొడవలు అవుతాయేమోనని సంజూ దారుణాలను చెప్పకుండా..బాగానే చూసుకుంటున్నాడనీ, తన మీద ఎలాంటి కోపం లేదనీ, కోపం ఏదైనా ఉంటే.. అది నీ మీదనే ఉంటుందని మౌనిక అంటుంది. ఇంతలోనే పూజారి వచ్చి.. గాజులు ఇస్తాడు. బాలు తన చెల్లెలికి బంగారు గాజులేసి సంతోషపడతాడు బాలు. ఏ కష్టం వచ్చినా ఫోన్ చేయమని ధైర్యం చెబుతాడు. మరోవైపు మౌనిక కనిపించిపోయేసరికి.. సంజు వెతుక్కుంటూ వస్తాడు. ఆ విషయాన్ని గమనించిన మౌనిక.. సంజు చూస్తే మళ్ళీ గొడవవుతుందని, తన అన్నయ్యకు చెప్పి వెళ్లిపోతుంది.

బాలు.. తన చెల్లెలు చూసేసరికి ఇన్ని రోజులుగా ఉన్న కోపం, భయం, బాధ అన్నిపోతాయి. మరోవైపు.. సంజు, మౌనిక కోసం తిరిగి వస్తాడు. కానీ, అక్కడ కనిపించక, మళ్లీ గుడిలో కనిపించేసరికి.. ఎక్కడికి వెళ్ళిపోయావ్? అని నిలదీస్తాడు. దీంతో సంజీవ్ తల్లి సమాధానం ఇస్తూ .. ముడుపు కట్టి.. ఇప్పుడే వచ్చింది. ఎందుకు అలా అనుమానిస్తున్నావ్ అంటూ కవర్ చేస్తుంది. దీంతో సంజూ శాంతిస్తాడు.
మరోవైపు శృతి రవి లో మధ్య గొడవ జరుగుతుంది. మౌనిక పెళ్లి జరగడానికి పరోక్షంగా మనమే కారణమని రవి అంటాడు. దీంతో శృతికి ఎక్కలేని కోపం వస్తుంది. ప్రతి విషయాన్ని మన పెళ్లితో ముడి పెట్టొద్దనీ, మీ ఇంట్లో ఏం జరిగినా.. మన పెళ్లితోనే ఎందుకు ముడి పెడతావు? అని అంటుంది. ఇంతలోనే ప్రభావతి అక్కడికి చేరుకుంటుంది. భార్యభర్తల మధ్య ఇలాంటి గొడవలు సహజమని, ఏది ఉన్నా.. ఇలానే మనసు విప్పి మాట్లాడుకోవాలని అంటుంది. మన ఇంటికి వెళ్దామని చెబుతుంది.

దీంతో ఏం చెప్పాలో అర్థం కాక శృతి డైలమాల్లో పడుతుంది. ఇంతలోనే శృతి తల్లి ఏంట్రీ ఇస్తుంది. ఆమెను చూడగానే ప్రభావతికి అనుమానం వస్తుంది. తన ప్లాన్ ను చెడగొడుతుందా? అని భయపడుతుంది. కానీ, శృతి తల్లి ప్రభావతికి సపోర్టుగా మాట్లాడుతూ.. ఎన్ని రోజులైనా వాళ్ళు మీ ఇంట్లోనే ఉండాల్సిన వారు అంటూ ప్రభావతి షాక్ ఇస్తుంది. మొదట ప్రభావతి కూడా నమ్మదు. అయితే.. తీసుకపోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు గాని,సంప్రదాయబద్దంగా.. మీ కూతుర్ని మా ఇంటికి తీసుకువస్తే బాగుంటుందని, సత్యం కాస్త సంప్రదాయాలకు ఎక్కువ విలువిస్తాడని అంటుంది.
దీంతో శృతి తల్లి.. మీరు ఎప్పుడంటే అప్పుడు తన కూతుర్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. ఇంకా లేట్ ఎందుకు.. రేపే మంచి ముహూర్తం తీసుకురామని ప్రభావతి చెప్తుంది. అందుకు శృతి తల్లి కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. దీంతో ప్రభావతి తన ప్లాన్ అన్ని వర్కౌట్ అవుతున్నాయని, కోటీశ్వరులు పోయానని కలలు కంటుంది. కానీ, శృతికి తన అత్తాగారింటికి వెళ్లడం ఇష్టం లేదు.


Click it and Unblock the Notifications










