Gunde Ninda Gudi Gantalu January 10th: బాలుని రూమ్ లో బంధించిన ప్రభావతి.. అత్తగారింట్లో అడుగుపెట్టిన శృతి..
Gunde Ninda Gudi Gantalu January 10th: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ లో ప్రభావతి పూజ చేస్తూ.. దేవుడ్ని లేని లేని కోరికలు కోరుకుంటుంది. ఒక్కసారిగా తాను కోటీశ్వరులుగా మారాలని, చిన్న కోడలు రాగాతో భోగభాగ్యాలు తన ఇల్లు నిండిపోవాలని ఆశాపడుతుంది. శృతి, రవిలు ఇంటికి వస్తున్న విషయం చెప్పకుండా కంగారుపడుతుంది. ముందుగా మీనా దగ్గరికి వెళ్లి.. ఇంకా వంట పూర్తి చేయలేదా? ఇంత సేపు ఏం చేస్తున్నావ్ అంటూ సెటైర్లు వేస్తుంది. దీంతో మీనా ఇన్ డైరెక్ట్ గా తన అత్తయ్య పై పంచులు వేస్తుంది.
మరోవైపు..రవి,శృతి లు ఇంటికి వస్తున్న విషయం ఎలా చెప్పాలో అర్థం కాక.. హాల్లో కంగారు కంగారుగా తిరుగుతుంది. ఈ సమయంలో చూసుకోకుండా సత్యంను గుద్దుతుంది. దీంతో సత్యం కంగారు పడతాడు. అసలు ఏమైంది. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావని అడుగుతాడు సత్యం. కానీ, ఏం చెప్పాలో అర్థం కాక.. కాకి అరుస్తుందని, చెప్పపెట్టకుండా ఇంటికి చుట్టాలు వస్తారేమోనని పొంతన లేని సమాధానం చెబుతుంది. దీంతో సత్యంకు అనుమానం వస్తోంది. ఏదోక ఉపద్రవాన్ని ఇంటికి తీసుకవస్తుందనీ, ఆ కాకికి ఎంత అన్నం పెట్టు.. అదే నోరు మూసుకొని వెళ్ళిపోతుందని పంచ్ వేస్తాడు.

ఇంతలోనే బాలు.. మీనాను పిలుస్తాడు. బాలు ఉంటే.. తన ప్లాన్ వర్కవుట్ కాదనీ, వాడు ఏదైనా గొడవ చేస్తాడని ప్రభావతి భయపడుతుంది. ఎలాగైనా బాలుని తొందరగా ఇంట్లో నుండి బయటకు పంపాలని, కంగారు కంగారుగా టిఫిన్ పెడుతుంది. వంట కూడా ప్రభావతి పూర్తి చేస్తుంది. బాలు రెడీ అయి కిందికి వస్తాడు. తాను టిఫిన్ చేసి వెళ్తానంటే.. అవసరం లేదు.. బయట టిఫిన్ చెయ్ అని క్యారేజ్ సర్దుతుంది. కానీ, తనకు బయట ఫుడ్ పడదని, తాను టిఫిన్ చేసిన తర్వాతనే వెళ్తానని బాలు అంటాడు. ఎన్నడు లేని విధంగా ప్రభావతి దగ్గరుండి ఉండి బాలుకు టిఫిన్ వడ్డిస్తుంది. దీంతో బాలు ఆశ్చర్యపోతాడు.
ఇది కలనా..నిజమా.. అని పక్కనే ఉన్న మనోజ్ ను గిచ్చుతాడు. కానీ, ఎనలేని విధంగా తనపై తన తల్లి ప్రేమ కురిపించడంతో అనుమానం వస్తుంది. చివరిసారి మౌనిక పెళ్లి విషయంలో కూడా తన తల్లి ఇలానే ప్రవర్తించిందని, ఈసారి కూడా ఏదో చేయబోతుందని డౌట్ బాలుకి వస్తుంది. తాను బయటికి వెళ్లినట్టు వెళ్లి.. మళ్లీ ఇంట్లోకి తిరిగి వస్తాడు. తన స్టమక్ అప్సెట్ అయిందని, కారణం చెప్పి తన రూమ్ లోకి వెళ్తాడు. బాలు ఉంటే తన ఆటలు సాగవని ప్రభావతి .. బాలు రూమ్ లో ఉండగానే.. లాక్ చేస్తుంది వేస్తుంది. తనకు అడ్డలేదని దర్జాగా కిందికి వస్తుంది.
ఈ సమయంలో మనోజ్ తనకు ఆకలి అవుతుందని టిఫిన్ పెట్టమని అడుగుతాడు. ఓ అరగంట ఆగితే పోయేది ఏమీ కాదు. వాళ్లు వస్తున్నారు అంటూ నోరు జారుతుంది ప్రభావతి. ఎవరు వారని సత్యం .. ప్రభావతిని నిలదీస్తాడు. తప్పించుకునే పరిస్థితి లేకపోవడంతో రవి, శృతి ఇంటికి వస్తున్నారని, వారికోసం తాను వెయిట్ చేస్తున్నానని చెబుతోంది ప్రభావతి. తాను ముందుగానే చెప్పానని, శృతి వాళ్ల తల్లిదండ్రులు ఇంటికి వచ్చి.. శృతిని అప్పజెప్పితేనే తాను ఇంట్లోకి రానిస్తానని అంటాడు సత్యం. శృతి వాళ్ల అమ్మానాన్న కూడా వస్తున్నారని అసలు విషయం బయటపెడుతుంది ప్రభావతి.
ఇంతలోనే శృతి తన తల్లిదండ్రులతో అత్తగారింటికి చేరుకుంటుంది. కానీ, సురేంద్ర.. సత్యం ఇంట్లో కాలు పెట్టడానికి నిరాకరిస్తాడు. తాను ఇక్కడి వరకు రావడమే ఎక్కువ అని, తన మనసు చంపుకొని ఇంట్లోకి రానని అంటాడు. దీంతో శృతి, రవి, శోభ ముగ్గురు కలిసి ప్రభావతి ఇంటికి చేరుకుంటారు. ఈ సమయంలో ప్రభావతి కంగారుపడుతూ వెంటనే హారతి తీసుకురమ్మని రోహిణికి చెబుతుంది. కానీ, మీనా హారతి తీసుకొని వస్తుంది. ఆ విషయం ప్రభావతికి నచ్చదు. హారతి రోహిణికి ఇవ్వమని మీనాపై కొప్పడుతుంది. ఎవరిస్తే ఏముంది? అత్తయ్య మీనాని హారతి ఇస్తే బాగుంటుందంటూ ప్రభావతికి అడ్డు చెబుతుంది శృతి. తన భార్య మాటలకు రవి కవర్ చేస్తూ ఇద్దరు కలిసి ఇవ్వమని అంటాడు. దీంతో సీరియల్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










