Gunde Ninda Gudi Gantalu Jan13th: ప్రభావతికి చుక్కులు చూపించిన శృతి.. శోభ కన్నింగ్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..

Gunde Ninda Gudi Gantalu January 13th: గుండె నిండా గుడి గంటలు గుండె శుక్రవారం ఎపిసోడ్ లో రవి, శృతి ఇంటికి వస్తున్నారని కంగారుపడుతోంది. ఆ విషయం ఎవరికీ చెప్పకుండా దాచిపెడుతోంది. బాలు ఉంటే.. తన ప్లాన్ వర్క్ అవుట్ కాదని ఎలాగైనా బాలుని ఇంట్లో నుండి పంపించాలని భావిస్తుంది ప్రభావతి. బాలు ఇంటికి రాగానే ఎన్నడూ లేని విధంగా కానీ దగ్గరుండి తన కొడుకు కు టిఫిన్ వడ్డిస్తుంది. ఎక్కలేని ప్రేమ కురిపిస్తుంది. తన తల్లి ఎన్నడూ లేని విధంగా తనపై ప్రేమ కురిపించడంతో బాలుకి అనుమానం వస్తుంది. తనకు స్టమక్ అప్సెట్ అయిందని బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతాడు. బాలు ఉంటే తన మాటలు సాగని గ్రహించిన ప్రభావతి.. బాలు రూమ్ లోకి వెళ్ళగానే లాక్ చేస్తుంది. ప్రభావతి కంగారు గమనించిన సత్యం అసలేం జరుగుతుందని ఆరా తీస్తాడు. ఇంతలోనే శృతి , రవి ఇంటికి చేరుకుంటారు.

సోమవారం ఎపిసోడ్ లో శృతి, రవి ఇంటికి చేరుకుంటారు. కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మని ప్రభావతి శృతికి చెప్పగా.. 'కుడికాలు అయితే ఏంటి? ఎడమ కాలు అయితే ఏంటి?.. అంటూ తింగరి సమాధానం ఇస్తుంది. కుడి పెట్టి అత్తగారి ఇంట్లో కాలు పెట్టడం సంప్రదాయమనీ మీనా వివరించి చెబుతోంది. దీంతో శ్రుతి కుడి కాలు పెట్టి ఇంట్లో అడుగుపెడుతుంది. కానీ, శోభ బయటనే ఉండిపోతుంది. శోభ ను కూడా రమ్మని ప్రభావతి పిలుస్తారు. కానీ, తను రాలేనని, సురేంద్ర బయటనే ఉన్నాడని చెబుతుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 335 January 13th 2025 here is full story

దీంతో ప్రభావతి.. సురేంద్ర తీసుకురమ్మని సత్యంను రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో తన మనసు చంపుకుని, తనకు జరిగిన అవమానాన్ని పక్కన పెట్టి.. సురేంద్ర దగ్గరికి వెళ్లి రమ్మని అడుగుతాడు. కానీ, తాను రాలేదని, నా కూతురు మీ ఇంటి కోడలు మాత్రమే మనం ఇద్దరి మధ్య మరో బంధుత్వం అవసరం లేదు అంటూ తిరస్కరిస్తాడు. దీంతో సత్యం సైలెంట్ గా తిరిగి వస్తాడు. ఆ తర్వాత ప్రభావతి.. శోభ ఇంట్లోకి పిలుస్తుంది. శోభ కూడా ప్రభావతి ఇంట్లోకి రావడంతో ..తాను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాననీ, అందరూ కలిసిపోయారని చాలా ప్రశాంతంగా ఉన్నాయి అంటుంది.

ఇంతలోనే బాలు డోర్ కొడుతూ ఉంటాడు. మీనా వెళ్లి డోర్ తీయాలని అనుకుంటుంది. కానీ, వచ్చిన అతిథులకు కాఫీ ఇవ్వమని మీనాకు అర్డర్ వేస్తుంది ప్రభావతి. డోరు కొడుతున్న సౌండ్ వస్తుందని శ్రుతి అనగానే.. అది పక్కింటి నుంచి వస్తుందనీ ప్రభావతి అంటుంది. పక్కంటి వారి డోర్ పై ఉన్నా అంటూ ప్రభావతికి దిమ్మతిరిగి పోయేలా క్వాషన్ వేస్తోంది శ్రుతి. అలా డోర్ కంటిన్యూగా కొట్టడంతో మీనా వెళ్లి డోర్ తీస్తుంది. ఎవరు? డోర్ లాక్ చేశారని బాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా.. ఎవరు వచ్చారంటూనే ఇంటికి వస్తాడు బాలు.

ఒకసారి రవి, శ్రుతిని ఇంట్లో చూడగానే బాలు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇంట్లోకి ఎవరు రానిచ్చారు అంటూ మండిపడతాడు. శ్రుతి తల్లి శోభ కూడా కనిపించే సరికి.. మీరు అంతా ఒకటైపోయారు కదా అలాంటప్పుడు ఏమీ తెలియని మా నాన్న పై ఎందుకు కేసు పెట్టారని నిలదీస్తాడు. అనవసరంగా మా పరువును రోడ్డుకు ఇచ్చారు కదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇంటికి వచ్చిన వారితో అలా మాట్లాడడం సరికాదని, వారు తప్పును వారు తెలుసుకున్నారు కాస్త మర్యాదగా వ్యవహరించుమని సత్యం అంటాడు.

దీంతో బాలు సైలెంట్ అవుతాడు. శోభ కు ప్రభావతి ఇంట్లో ఉండటం మాత్రం నచ్చదు. తనకు కూడా అవమానం జరిగిందని, ఎలాగైనా ప్రభావతి కుటుంబాన్ని విడగొట్టాలని, రవిని వారి కుటుంబంలో నుండి వేరు చేయాలని భావిస్తుంది శోభ. ఆ తర్వాత సైలెంట్ గా వెళ్ళిపోతుంది. బాలు ప్రవర్తనతో శ్రుతి కూడా కోపం వస్తుంది. ఇంతలోనే తనకు ఫోన్ రావడంతో ఇక్కడ చాలా న్యూసెన్స్ గా ఉందంటూ ఇన్ డైరెక్ట్ గా బాలుని తిడుతూ బయటికి వెళ్లిపోతుంది శ్రుతి. దీంతో రవి కూడా శృతి వెంట వెళ్తాడు. అన్ని విషయాలు త్వరలోనే సర్దుకుంటాయని, అనవసరంగా ఇతరులపై కోప్పడకని చెబుతాడు.

రవి, శ్రుతి పర్సనల్ గా మాట్లాడుకుంటున్నా సమయంలో రోహిణి వారి దగ్గరికి వెళ్తోంది. 'మీరు టెర్రస్ పై మాట్లాడుకుంటున్నారా ? అని రోహిణి అనగానే ఏంటి రవి టెర్రస్ పై మాట్లాడుకోవడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలా అంటూ సెటైర్ వేస్తుంది శ్రుతి. అదేం లేదు.. కింద పూజకు సిద్ధం చేస్తున్నారు. త్వరగా రండి అని రవి ,శృతిలను కిందికి రమ్మని రోహిణి పిలుస్తోంది. శృతి కిందికి రాగానే.. దీపం వెలిగించమని ప్రభావతి చెబుతోంది.

ఇంత వెలుగు ఉంది.. దీపం వెలిగించడం ఏంటి అని తింగరిగా ప్రశ్నిస్తుంది. కొత్తగా ఇంటికి వచ్చిన కోడలు దీపం వెలిగించడం సాంప్రదాయమని మీనా క్లారిటీ ఇస్తుంది. అవును తాను ఓ సీరియల్ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశానని, అందులో కూడా కొత్త కోడలు ఇలానే చేస్తుందని చెబుతోంది. అలాగైనా తెలుసుకున్నందుకు సంతోషం అంటుంది ప్రభావతి. అగ్గిపెట్టతో దీపం వెలిగించడానికి ప్రయత్నిస్తుంది. కానీ మ్యాచ్ బాక్స్ తో దీపం వెలిగించడం శృతి వల్ల కాదు.. తాను ఎప్పుడు మ్యాచ్ బాక్స్ వెలిగించలేదని, ఆ ప్రయత్నం కూడా చేయలేదని చెబుతోంది శ్రుతి. మరి వంటైనా వస్తుందా ? లేదా? అని ప్రభావతి తనకు ఏ వంట చేయడం రాదని .. పెళ్లికి ముందు తన తల్లి చేసి పెట్టేదని, ప్రస్తుతం రవి వంట చేసి పెడుతున్నాడని అంటుంది. దీంతో రవి సిగ్గుతో తలదించుకుంటాడు. ఇంట్లో కాస్త పద్ధతిగా వ్యవహరించాలని సత్యం చెప్పడంతో.. చెప్పాడు ఇంట్లో అన్ని స్ట్రిక్ట్ గా ఉంటాయని, పరిస్థితులకు అడ్జస్ట్ అవుతానని తన మామయ్యకు చెబుతోంది దీంతో నేటి సీరియల్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X