Gunde Ninda Gudi Gantalu January 14th: తల్లి ముందే రవిని చితకబాదిన శృతి.. రోహిణి భాగోతం బయటపడినట్టేనా..

Gunde Ninda Gudi Gantalu January 14th: గుండె నిండా గుడి గంటలు గుండె మంగళవారం ఎపిసోడ్ లో శృతిలతో పూజ చేపిస్తుంది ప్రభావతి. తనకు ఇలాంటి కట్టుబాట్లు, ఆచారాలు తెలియదని శ్రుతి చెబుతుంది. కనీసం తనకు వంట కూడా చేయడం రాదని, పెళ్లికి ముందు తన మమ్మీ వంట చేసేది పెట్టేదనీ, పెళ్లి తర్వాత రవి వంట చేసి పెడుతున్నాడని శృతి చెపుతుంది. దీంతో అందరి ముందు రవి పరువు పోతుంది. మరోవైపు ప్రభావతి షాక్ అవుతుంది. అంతలోనే సత్యం ఫ్రెండ్ రంగా ఇంటి కూడా వస్తాడు. రవి, శృతులు రంగా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత ప్రభావతి సంప్రదాయం ప్రకారం.. భార్యాభర్తలు ఇద్దరు కలిసి పాలు తాగాలని, కలిసి తినాలని చెబుతోంది.

తనకు ఇలాంటి వింత ఆచారాలు, కట్టుబాటు నచ్చవనీ నిర్మొహమాటంగా చెబుతుంది శ్రుతి. శృతి ప్రవర్తనను గమనించిన రంగా.. అమ్మాయి అచ్చు తన తండ్రి సురేంద్ర లాగానే ఉందని, ఆ అమ్మాయితో కాస్త జాగ్రత్తగా ఉండమని, లేకపోతే రవిని ఆడిస్తుందని వార్నింగ్ ఇస్తాడు. 'అన్ని కాలం అనుకూలంగా సర్దుకుంటాయని, ప్రభావతికి నచ్చితే.. చాలు ఎత్తిన పెట్టుకుని చూసుకుంటుందని చెబుతాడు సత్యం. ఏదేమైనా తన ముగ్గురు కొడుకులు కోడలతో తన ఇల్లు నిండుగా.. కళకళలాడుతూ సంతోషంగా ఉందని, ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటాడు సత్యం.

Gunde Ninda Gudi Gantalu serial episode 336 January 14th 2025 here is full story

అయితే.. మీనాతో శృతి క్లోజ్ గా ఉండడానికి ప్రభావతి తట్టుకోలేక పోతుంది. 'శృతి నీలాగా పూలు అమ్ముకునే వాళ్ళ అమ్మాయి కాదు. కోటీశ్వరాలు అమ్మాయి. శృతికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది బాగోదు' అని మీనాకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. ఇంతలోనే శృతి..తనకు తన అత్తగారిల్లు నచ్చలేదని, తాను ఇంట్లో ఉండి వెళ్ళి పోతానని గట్టిగా గట్టిగా అరుస్తుంది. దీంతో ప్రభావతి కంగారు పడుతుంది. వెంటనే రవి దగ్గరకి వెళ్లి అసలు ఏం జరిగిందని ఆరా తీస్తుంది. అంతలోనే శృతి కిందికి వస్తుంది. ఏం జరిగిందని ప్రభావతి అడుగుతోంది. ఎందుకు అలా మాట్లాడుతున్నారని శృతి తిరిగి ప్రశ్నిస్తుంది. నువ్వే కదామ్మ.. ఇంట్లో ఉండి వెళ్ళిపోతానని అన్నావ్ .. అంటే అది నిజం కాదు.. తాను డబ్బింగ్ చూపానని అసలు విషయాన్ని బయటపడుతుంది.

దీంతో ప్రభావతి కూల్ అవుతుంది. కొత్త కోడలిపై ఎనలేని ప్రేమను చూపిస్తుంది ప్రభావతి. ఏమైనా తింటావా అని ప్రేమగా అడుగుతుంది. తాను ఇప్పుడే తిననని చెబుతుంది. ఇప్పుడు ఇలానే అంటుంది ఇంకో 10 నిమిషాలు అయితే ఆకలి అవుతుందని ఆగమాగం చేస్తున్నాయి రవి అంటాడు. దీంతో శృతికి కోపం వస్తుంది. తనపై కామెంట్ చేస్తావా అంటూ..త తల్లి ముందే రవిని చితకబాదుతుంది. దీంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అనంతరం ఇంట్లోకి నువ్వు అడుగుపెట్టడానికి.. తాను ఎంత కష్టపడ్డానోనని అంటుంది ప్రభావతి. 'ఇందులో మీరు చేసింది ఏముంది అత్తయ్య .. అంతా మీనా చేసింది.. మీనా వల్లనే తాను ఇంట్లోకి వచ్చానని ప్రభావతి పరువు మొత్తం తీసేస్తుంది శృతి. తనను ఓ పెద్ద ప్రమాదం నుండి కాపాడిందని, అలాగే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి నా గురించి మాట్లాడిందనీ చెబుతుంది.

ఇంట్లోకి తాను రావడానికి కారణం మీనానే అని పొగడ్తలతో ముంచేత్తుతోంది శ్రుతి. దీంతో ప్రభావతికి కాలుతుంది. శృతి కూడా బాలు లాగా ముఖం మీదనే అన్ని అనేస్తుందని, ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలని ప్రభావతి అనుకుంటుంది. ఆ తర్వాత రోహిణి వచ్చి తన రూమ్ లోకి తీసుకెళ్తుంది. రూమ్ లోకి వెళ్లగానే.. మనోజ్ జాబ్ కు వెళ్లడా.. ఈగలు దోమలు కొట్టుకుంటూ ఇంట్లోనే ఉన్నాడని మనోజ్ గాలి తీసేస్తుంది శృతి. ఈ రూమ్ చాలా బాగుందని శృతి అనడంతో ప్రభావతి రియాక్ట్ అవుతూ.. రోహిణి బ్యూటిషన్ కదా.. అంటుంది. 'రూమ్ కు ఏమైనా మేకప్ వేస్తుందా ? ' అంటూ దిమ్మ తిరిగి సెటైర్ వేస్తుంది. శృతి తో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని మనోజ్, రోహిణి కూడా భావిస్తారు. ఆ తర్వాత రోహిణి గురించి లేనిపోని గొప్పలు చెబుతుంది ప్రభావతి. ఫారెన్ లో రోహిణి వాళ్ళ నాన్నకు పెద్ద పెద్ద బిజినెస్ ఉన్నాయని, పెద్ద పెద్ద కంపెనీలకు ఫైనాన్స్ ఇస్తారని, ఏకంగా అమెరికాలో ని ట్విన్స్ టవర్స్ రోహిణి వాళ్ళ డాడీ వేననీ గొప్పలు చెబుతుంది. దీంతో రోహిణి బాగోతం బయటపడుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X