Gunde Ninda Gudi Gantalu January 15th: కాళ్లబేరానికి వచ్చిన ప్రభావతి.. రవి శోభనానికి అడ్డుపడ్డ బాలు..
Gunde Ninda Gudi Gantalu January 15th: గుండె నిండా గుడి గంటలు గుండె బుధవారం ఎపిసోడ్ లో రోహిణి గురించి ప్రభావతి లేనిపోని గొప్పలు చెబుతూ.. అమెరికాలోని ట్విన్స్ టవర్స్ రోహిణి వల్ల నాన్న దేనని చెబుతుంది. దీంతో శృతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ టవర్స్ ఎప్పుడో కూలిపోయాయి కదా అత్తమ్మ అంటుంది. అంటే తన ఉద్దేశం అది కాదనీ, అలాంటి పెద్ద బిల్డింగ్స్ రోహిణి వాళ్ళ నాన్నకు ఉన్నాయని కవరింగ్ చేసుకుంది. మరోవైపు తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని రోహిణి లోలోపల తెగ టెన్షన్ పడుతోంది. ఆ తర్వాత కిచెన్ చూపిస్తారా అని ప్రభావతి శృతితో అంటుంది. కిచెన్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని, అది మొత్తం రవి సెక్షన్ అని చెబుతుంది. దీంతో ప్రభావతి మరోసారి షాక్ అవుతుంది.
ప్రభావతి చెప్పే సోది వినలేక శ్రుతి తనకు బోర్ కొడుతుందని, కాసేపు రెస్ట్ తీసుకుంటానని చెబుతోంది. తన బెడ్ రూమ్ ఎక్కడ చూపించమని అడుగుతోంది. దీంతో ప్రభావతి కంగారుపడుతుంది. 'సడన్గా వచ్చారు కదా బెడ్ రూమ్ సిద్ధం చేయలేదు. క్లీన్ చేపిస్తా'మని అంటుంది. దీంతో రవి, శృతి లు తాము బట్టలు తెచ్చుకుంటామని రూమ్ కి వెళ్తారు. దీంతో ప్రభావతి మీనాను రిక్వెస్ట్ చేస్తుంది. ముందుగా మీనా దగ్గరికి వెళ్లి.. రవి వాళ్లకు రూమ్ ఇవ్వమని, వాళ్లకు సంప్రదాయ బద్దంగా శోభనం నిర్వహించాలని చెబుతోంది. తాను రూమ్ ఇవ్వడానికి సిద్ధమే. కానీ బాలు అస్సలు ఒప్పుకోడని, ఎక్కువగా మాట్లాడితే.. పళ్ళు రాలగొడతాడని డైరెక్టుగా ప్రభావతికి వార్నింగ్ ఇస్తుంది మీనా.

ఎలాగైనా బాలుని ఒప్పించమనీ, వాళ్ల పెళ్లి చేశావ్.. వాళ్లు ఇంటికి రావడానికి కారణం కూడా నువ్వే.. ఈ కార్యం కూడా నువ్వే జరిగేలా చూడమని మీనాను రిక్వెస్ట్ చేస్తుంది . ఎలాగైనా బాలు ఒప్పించి శోభనానికి గదిని సిద్ధం చేయమని ప్రభావతి అంటుంది. అయినా.. బాలుని ఒప్పించడం తన వల్ల కాదని, కావాలనుకుంటే మీరే మాట్లాడమని, లేదా మనోజ్ వల్ల రూమ్ ఇవ్వమని అంటుంది. తాను ఎక్కడ రూమ్ అడుగుతానని, మనోజ్ గాడు తన పెళ్లాన్ని తీసుకెళ్లి కూర్చున్నాడనీ. నువ్వు ఎలాగైనా బాలు నిరూపించమని మీనా రిక్వెస్జ్ చేస్తుంది. దీంతో మీనా చేసేది ఏమి లేక బాలుకి తెలియకుండా.. రూమ్ డెకరేట్ చేస్తుంది పూలతో గదిని అలంకరిస్తుంది.
ఇంతలోనే బాలు ఇంటికి చేరుకుంటాడు. ఆ విషయాన్ని గమనించిన ప్రభావతి.. బాలుపై లేనిపోని ప్రేమను కురిపిస్తుంది. కాఫీ ఇవ్వాలా అని ప్రేమగా అడుగుతుంది. దీంతో బాలుకి అనుమానం వస్తుంది. తనకు ఏం అవసరం లేదని తన గదిలోకి వెళ్తాడు. గదిని పూలతో డెకరేట్ చేసేసరికి.. తనకి శోభనం ఫిక్స్ చేశారేమో అని బాలు తెగ సంబురపడిపోతాడు. ఆ ఏర్పాట్లు మన కోసం కావని, శృతి రవికోసం ఏర్పాట్లు చేసామని బాలుకి చెప్పడంతో ఒక్కసారిగా మండిపడతాడు. తాను తన రూమ్ లో అస్సలు ఇవ్వబోనని, కావాలంటే మనోజ్ రూమ్ తీసుకోమని సలహా ఇస్తాడు. దీంతో ప్రభావతి మళ్లీ మీనా ను రిక్వెస్ట్ చేస్తుంది. ఎలాగైనా బాలుని ఓప్పించమని కాళ్ళ బేరానికి వస్తుంది. మీనా చేసేది ఏమి లేక బాలు దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తుంది.
ఈరోజు రూమ్ వెళ్లగొట్టారు, రేపు హాల్ లో నుంచి కూడా వెళ్లగోడుతారు. మొత్తానికి ఇలా ఒక్కొక్కటి దూరమవుతాయని, నీ అమాయకత్వాన్ని వాళ్లు ఆసరాగా తీసుకుంటూ నీతో ఆడుకుంటున్నారనీ బాలు చెబుతాడు. కానీ, ఇంటి గౌరవం, ప్రతిష్ఠ అంటూ మీనా పెద్దపెద్ద డైలాగ్స్ వేస్తుంది. ఎంత చెప్పినా మీనా వినిపించుకోదనీ, నీ కర్మ నువ్వే అనుభవిస్తావ్ అంటూ .. బాలు మెడ పైకి వెళ్తున్నానని పడుకుంటాడు. దీంతో మీనా ప్రభావతి దగ్గరికి వచ్చి.. బాలు ఒప్పుకున్నాడని చెబుతోంది. అయితే.. వాడిని మెడ పై నుండి కిందికి రాకుండా అక్కడికి భోజనం తీసుకు వెళ్ళమని ప్రభావతి మీ నాకు ఆర్డర్ వేస్తుంది. దీంతో నేటి సీరియల్ పూర్తవుతుంది.


Click it and Unblock the Notifications










