Gunde Ninda Gudi Gantalu January 16th: బాలు, మీనాలకు డైవర్స్.. శ్రుతికి భయపడుతున్న ప్రభావతి..
Gunde Ninda Gudi Gantalu January 16th: గుండె నిండా గుడి గంటలు గుండె గురువారం ఎపిసోడ్ లో ప్రభావతి తన చిన్న కొడుకు రవి, కోడలు శృతి ల కోసం వెయిట్ చేస్తుంటుంది. వారి శోభనానికి ఎలాంటి అడ్డంకులు రాకుండా, బాలు ఇలాంటి గొడవలు చేయకుండా ఆ దేవుని ప్రార్థిస్తుంది. ఇంతలోనే రవి,శ్రుతి ఇంటికి చేరుకుంటారు. 'మీ కోసమే నేను వెయిట్ చేస్తున్నా.. త్వరగా వచ్చి భోజనం చేయండి ' అిని ప్రభావతి అంటుంది. తాము ఆల్రెడీ బయట తినేసామని శృతి చెబుతుంది. 'ఏంటి బయట తిన్నారా..' అని ప్రభావతి ప్రశ్నించగా.. 'బయట తినడానికి కూడా మీ మమ్మీ పర్మిషన్ తీసుకోవాలా?' అని రవిని నిలదీస్తోంది. 'అలా కాదమ్మా.. బయట ఫుడ్ బాగోదు.. కదా బయట తింటే ఆరోగ్యం చెడిపోతుంది' అని ప్రభావతి అంటుంది.
'నేను ఎక్కువగా బయట తినడం వల్ల వీడు దొరికాడు' అని రవిని చూపిస్తుంది. దీంతో ప్రభావతి షాక్ అవుతుంది. సరే కానీ, నా లాగేజ్ ఎక్కడ పెట్టుకోవాలని ప్రభావతిని అడుగుతుంది శృతి. పైన రూమ్ లో పెట్టుకోమ్మ అని చెబుతుంది. 'అది బాలు రూమ్ కదా.. అందులోనా' అని రవి భయపడతాడు. 'నాకు తెలుసు.. ఈరోజు నుండి వాడు పైన మిద్దె పై పడుకుంటాడు. మీరు ఆ రూమ్ లోనే ఉండండి' అని చెప్తుంది. సరే అమ్మ తొందరగా స్నానం చేసిరా.. అని ప్రభావతి శృతికి చెబుతాను. 'మీరు చెప్పకపోయినా ప్రతిరోజు నైట్ టైం లో స్నానం చేస్తా..స్నానం చేస్తేనే అలా నాకు నిద్ర వస్తుంది' అంటుంది శృతి. 'నిద్రపోవడానికి కాదమ్మా.. ఇంకో సాంప్రదాయం ఉంది' అంటుంది ప్రభావతి. 'మీరు సంప్రదాయాల పేరుతో పాలు, పండ్లు తినిపిస్తున్నారు. ఏంటి సంప్రదాయాలు' అంటుంది శృతి.

'ఎన్నో సీరియల్ కు డబ్బింగ్ చెప్పావ్.. ఈ విషయం తెలియదా 'అని ప్రభావతి అంటుంది. దానికి దీనికి ఏమి సంబంధం అయినా ఇలాంటి విషయాలు కాలేజీలలో.. డబ్బింగ్ స్టూడియోలలో చెప్తారా?అని ప్రభావతిని ప్రశ్నిస్తుంది. సర్లే కానీ, ఈరోజు ముహూర్తం పెట్టామని ప్రభావతి అంటుంది. 'ఏ ముహూర్తం.. మా పెళ్లి ముహూర్తం పెట్టేశారుగా అంటోంది'. శృతికి ఎలా చెప్పాలో అర్థం కాక రోహిణి చెప్పమని అంటుంది. 'ఈరోజు మీకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేసాం.. దానికి ప్రిపేర్ గా' అని రోహిణి చెబుతుంది. ఈ విషయం చెప్పడానికి ఇంత మొహమాట పడాల.. ఇంటర్నేషనల్ సీక్రెట్ అన్నట్లు ఇంత ఇబ్బంది పడ్డారు. అదే ఫస్ట్ నైట్ అని స్ట్రెయిట్ గా చెప్పేస్తే సరిపోతుంది కదా అంటు నవ్వుతోంది శ్రుతి. శృతి రియాక్షన్ చూసి ప్రభావతి షాక్ అవుతుంది. ఆల్రెడీ వారికి ఫస్ట్ నైట్ అయిపోయిందా అని అనుమాన పడుతుంది. అయినా శృతి తో చాలా జాగ్రత్తగా ఉండాలని రోహిణికి చెబుతోంది ప్రభావతి.
మరోవైపు.. బాలు తనలో తాను ఫీల్ అవుతాడు ఒంటరినైపోయాయని, ఎక్కడ ఉండేవాణ్ణి ఎక్కడ ఉన్నాను. ఈరోజు మిద్దెపై ఉన్న.. రేపు ఎక్కడ ఉంటానని బాధపడుతూ ఉంటాడు. '40 లక్షల మింగినోడు బాగానే ఉన్నాడు.. ఇంట్లో నుండి లేచిపోయినోడు కూడా బాగున్నాడు... ఇల్లు తాకట్టు బాగున్నారు.. ఎటు వచ్చి.. పూలగంప ముళ్ళగంప.. చిక్కులో పడ్డారు' అని తనలో తానే ఫీల్ అవుతాడు. మరోవైపు ప్రభావతి కంగారుపడుతుంది మీనా ను పిలిచి.. అన్ని ఏర్పాట్లు చేయమని చెప్తుంది. ఇందులో శృతి.. డ్రెస్ వేసుకొని కిందికి వస్తుంది. ఏంటమ్మా ఇలా డ్రెస్ వేసుకుని వచ్చావని,సారీ కట్టుకోలేదా? అని ప్రభావతిని అడుగుతుంది. తనకు సారీ కట్టుకోవడం రాదని, ఎప్పుడైనా అవసరం రవి సారీ కట్టేవాడని చెబుతోంది.

ఇంతలోనే రోహిణి వస్తుంది. తాను సారీ కడతానని శృతిని తన రూమ్ లోకి తీసుకెళ్తుంది. ఈ సమయంలో శృతి.. రోహిణి గురించి ఆరా తీస్తుంది. మలేషియాలో మీ ఇల్లు ఎక్కడ ఉంటుందని రోహిణి ప్రశ్నిస్తుంది. సిటీలో ఉంటుందని చెబుతుంది రోహిణి.. అదే సిటీలో ఎక్కడ ఉంటుంది.. అక్కడ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అని అడుగుతుంది శ్రుతి. ఇలానే అడిగితే.. తన ఉనికినే ప్రమాదమని, టాపిక్ డైవర్ట్ చేయాలని నోరు మూసుకుంటావా శ్రుతి అంటుంది. దీంతో శ్రుతి షాక్ అవుతుంది. అదేం లేదు.. లిప్ స్టిక్ పెట్టాలని చెబుతోంది. ఆ తర్వాత మీనా గురించి మాట్లాడుతూ.. మీనా చాలా మంచిది, కానీ, బాలు మాత్రం ఇష్టం వచ్చినట్లు తాగి నానా మాటలు అంటాడు. మీనా ఎలా భరిస్తుందో తెలియదు, తనతో కూడా రెండు మూడు సార్లు గొడవపడ్డాడని శృతి అంటుంది.
అవును బాలు తాగితే అలాగే ప్రవర్తిస్తాడని, ఒక మామయ్య మాట తప్ప ఎవరి మాటలు లెక్కచేయడని రోహిణి చెబుతోంది. అలాంటి మొండి వాడితో మీనా ఎలా ఉంటుంది. డైవర్స్ ఇప్పిద్దాం శృతి అంటుంది. దీంతో రోహిణి షాక్ అవుతుంది. ఆ తర్వాత మనోజ్ గురించి రోహిణితో మాట్లాడుతూ.. మనోజ్ ఏం చేస్తున్నాడని అడుగుతోంది. మనోజ్ కార్ల షోరూంలో పనిచేస్తాడని, ఆ షో రూమ్ కు మేనేజర్ అని చెబుతుంది రోహిణి. అయితే.. మేము కారు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నామని, మాకు డిస్కౌంట్ ఇప్పిస్తారని అడుగుతుంది శృతి.

ఇంతలోనే మనోజ్ అక్కడికి చేరుకుని వారు మాట్లాడుకునేది వింటాడు. వారి టాపిక్ డైవర్ట్ చేయకపోతే తనకే ప్రాబ్లం వస్తుందని రోహిణి రూమ్ లోకి రమ్మని పిలుస్తాడు. ఆ తర్వాత ప్రేమగా తనతో మాట్లాడుతూ టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం మనోజ్. అలాగే శృతితో క్లోజ్ గా ఉండకని, ఎక్కువగా మాట్లాడవద్దని చెబుతాడు. ఈ సమయంలో బాలుకి నువ్వు నాకు డైవర్స్ ఇవ్వాలని శృతి చెప్పిన విషయం మనోజ్ కు చెబుతుంది. అయితే అలాంటి వారితో ఎక్కువగా ఉండదని మన మధ్య కూడా విభేదాలు వచ్చేలా చేస్తుందని మనోజ్ సలహా ఇస్తాడు. కానీ తాను మరో బ్యూటీ పార్లర్ పెట్టాలనుకుంటున్నానని, శృతి తో ఉంటే హెల్ప్ అవుతుందని కవరింగ్ చేస్తోంది. కానీ మనోజ్ కి అసలు విషయం అర్థం కాదు. దీంతో నేటి సీరియల్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










