Gunde Ninda Gudi Gantalu January 17th: అన్నదమ్ముల మధ్య గొడవ.. శోభనానికి అడ్డుపడ్డ బాలు.. షాక్ లో ప్రభావతి..

Gunde Ninda Gudi Gantalu January 17th: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ లో శృతి,రవి ల శోభనం ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇందులో భాగంగా రోహిణి శృతిని రెడీ చేస్తుంది. దీంతో శృతి.. రోహిణికి థాంక్స్ చెప్తుంది. మనకు మనకు థాంక్స్ ఏంటని రోహిణి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మీనా వచ్చి శృతి సారీ కుచ్చులను సరిచేస్తుంది. ఇంతలో ప్రభావతి వచ్చి..'ఇక్కడేం పని.. ముందు వెళ్లి పాలు వేడి చేసి పెట్టు' అని ఆర్డర్ వేస్తుంది. దీంతో మీనా సైలెంట్ గా అక్కనుండి వెళ్ళిపోతుంది. ' ఎప్పుడు మీరు మీనాకే పనులు చెప్తారేంటీ? అని ప్రభావతిని ప్రశ్నిస్తుంది శృతి.

తనకు ఇలాంటి పనులు చేయరాదని, మీనా అయితే ఇంటి పనులను బాగా చేస్తుందని కవరింగ్ చేస్తుంది ప్రభావతి. ఇంకా అక్కడ ఉంటే శృతి ఇంకేమైనా వేస్తుందేమోనని వంటగదిలో పని ఉందని కిచెన్ లోకి వెళ్తుంది.మీనా దగ్గరికి వెళ్లి ఇంకా పాలు కాయడం పూర్తి కాలేదా అని అడుగుతుంది ప్రభావతి. ఇప్పుడే కదా చెప్పారు.. చూడు అని మీనా బదిలిస్తుంది. మాటకు మాట బదిలీ ఇవ్వడం కాదు.. పాలు చక్కగా కాచి, అందులో బాదం,పిస్తా,జీడిపప్పు అన్ని బాగా మిక్స్ చేసి.. పాలను బాగా వేడి చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతుంది. ప్రభావతి చెప్పినట్లుగానే మీనా పాలను కాచి.. గ్లాసులో పోసి వేరే పని ఉండడంతో బయటికి వెళ్ళిపోతుంది మీనా.

Gunde Ninda Gudi Gantalu serial episode 339 January 17th 2025 here is full story

ఇంతలోనే బాలు కిచెన్ లోకి వస్తాడు. ఆకలి మంట తో ఉన్న బాలు.. పాలు కనిపించడంతో ఆలోచించకుండా తాగేస్తాడు. తన భార్య తన కోసం స్పెషల్ గా పాలను వేడి చేసి తన కోసం పెట్టిందనీ హ్యాపీగా ఫీల్ అవుతాడు బాలు. ఆ విషయాన్ని హాల్లోకి వచ్చి అందరి ముందు మీనాకు థాంక్స్ చెప్తాడు. దీంతో ప్రభావతి షాక్ అవుతుంది. అవి నీకోసం కాచిన పాలు కావురా.. శోభనం కోసం రెడీ చేసిన పాలు అని చెబుతోంది. అందుకేనా గాల్లో తిరుగుతున్నట్టు ఉంది అని బాలు అంటాడు. మరి శోభనం చూసుకున్నవారికి పాలు ఎలా అని ప్రభావతి అడగటంతో.. పాలు లేకపోతే గంజి నీళ్లు ఇవ్వమని బాలు ఉచిత సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు.

ఇప్పుడు ఏం చేయాలి రా దేవుడా అని ప్రభావతి బాధపడుతుంది. పాలు తీసుకురమ్మని మనోజ్ రిక్వెస్ట్ చేయగా.. తనకు నిద్ర వస్తుందని ఆయన ఈ టైంలో బయటికి వెళ్లి తీసుకురావడానికి కంటే.. ఉన్న పాలతో అడ్జస్ట్ కావడం బెటర్ అని మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరో వైపు బాలు మిద్దెపై తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇందులోనే రవి.. బాలు దగ్గరికి వెళ్తాడు. ఎందుకు వచ్చావని బాలు ప్రశ్నించగా.. నీతో మాట్లాడాలని చాలా రోజులవుతుందనీ, మాట్లాడి అన్నా అంటాడు రవి. ఇంటి పరువు రోడ్డు మీద పడేసి, ఇప్పుడు వచ్చి.. ఏ ముఖం పెట్టుకొని శోభనం చేసుకుంటున్నావు అని బాలు రెచ్చిపోతాడు.

తాను ప్రతి విషయంలోనూ చెప్పాలని ప్రయత్నించినా.. కానీ నువ్వే అడ్డుపడ్డావని బాలు పైకి రివర్స్ అవుతాడు రవి. ఆయన ప్రతి విషయంలో తప్పు చేసింది. నువ్వే నీ కోపమే నీకు ఈ విషయాన్ని కూడా పట్టించుకోకుండా కోప్పడతావ్.. మంచి చెడులను తెలుసుకోకుండా.. ఎవరి మీద పడితే వారి మీద చేయి చేసుకుంటావని బాలుకి ఎదురు మాట్లాడుతాడు రవి. ఇంతలోనే మనోజ్ వచ్చి.. రవికి సపోర్టుగా మాట్లాడుతాడు. నీ కోపమే నీకు శత్రువు.. నీ కోపంతోనే నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందనీ, నీ కోపం వల్లనే ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. రోజు తాగి వచ్చి.. ఇష్టం ఉన్నట్లు ఎవరి మీద పడితే వారి మీద అరుస్తావని, అడ్డు చెప్పిన వారిపై చేయి చేసుకుంటావని మనోజ్ కూడా బాలుకు వ్యతిరేకంగా మాట్లాడుతాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 339 January 17th 2025 here is full story

దీంతో బాలుకి కోపం వస్తుంది. ఒక్కడేమో ఇంట్లో నుండి 40 లక్షలు వెళ్లి తండ్రిని మోసం చేసినవాడు.. మరొకడు ఏమో తన స్వార్థం కోసం లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కలిసి పోయారు కదా.. రవి మనోజులపై మండిపడుతాడు. దీంతో మనోజ్ మరింత రెచ్చిపోతారు మేమందరం కలిస్తే .. ఇంట్లో నువ్వు ఉండలేవనీ వార్నింగ్ ఇస్తాడు. అయినా రవి ఏం తప్పు చేశాడని.. వాడు కూడా ఇంట్లో ఉంటాడు అంటూ రవిని తీసుకొని మనోజ్ వెళ్లిపోతారు. దీంతో బాలు కోపం ఆకాశాన్ని అంటుతుంది. వెంటనే తన గదిలోకి వెళ్లి ఈ రోజు శోభనం ఎలా జరుగుతుందో చూస్తానని తన గదికి లాక్ చేసుకుని వెళ్లిపోతాడు బాలు.

మరోవైపు.. ప్రభావతి శోభనం ఏర్పాట్లల్లో బిజీ బిజీగా ఉంటుంది. మీనా ను పిలిచి ఏర్పాట్లు పూర్తయ్యాలేదని ఆరా తీస్తుంది. తాను రూమ్ ను డెకరేట్ చేసి అన్ని సర్ది పెట్టానని చెబుతుంది. కానీ ప్రభావతి అనుమానం తో.. ఏర్పాటు ఎలా చేశావు చూసి వస్తానని రూమ్ కి వెళ్తుంది. కానీ రూమ్ కి లాక్ వేసి ఉండడంతో ప్రభావతి షాక్ అవుతుంది. వెంటనే మీ నాన్న పిలిచి ఎవరు గదికి లాక్ వేశారని ప్రశ్నిస్తోంది. తనకు తెలియదు. కానీ, బాలు గదికి లాక్ వేయవచ్చని అనడంతో ప్రభావతి షాక్ అవుతుంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X