Gunde Ninda Gudi Gantalu january 20th: బాలు, సత్యంకు ఎదురుతిరిగిన‌ శృతి.. ప్ర‌భావ‌తి పరువు గోవిందా..

Gunde Ninda Gudi Gantalu january 20th: గుండె నిండా గుడి గంటలు సోమవారం ఎపిసోడ్ లో బాలు శోభనం గదికి తాళం వేసుకొని వెళ్లిపోతాడు. దీంతో ప్రభావతి తెగ టెన్షన్ పడుతుంది. కంగారు కంగారుగా తిరుగుతూ అందర్నీ టెన్షన్ పడేలా చేస్తుంది. సొంత తమ్మునికి శోభనం జరగకుండా ఇలా అడ్డుపడుతున్నాడేంటి? అంటూ ప్రభావతి బాధపడుతుంది. తన పరువు మొత్తం పోయిందని ఆందోళన చెందుతూ బాలుకి ఫోన్ చేస్తుంది. కానీ, బాలు ఫోన్ లిఫ్ట్ చేయడు. తర్వాత మీనా కూడా ఫోన్ చేస్తుంది. మీనా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా బాలు వారిని టెన్షన్ పెట్టిస్తాడు. ఈ విషయం ఒక్కొక్కరిగా ఇంట్లో వారికి అందరికీ తెలిసిపోతుంది.

ఇలా ఈ విషయం మనోజ్ వెళ్లి.. రవికి చెప్తాడు. ఇక నీ శోభనం అయినట్లే .. బాలుగాడు శోభనం గదికి తాళం వేసుకుని వెళ్లిపోయాడంటూ ఇన్సల్ట్ చేస్తాడు. దీంతో రవి తన తల్లి దగ్గరికి వెళ్లి.. ఏంటమ్మా బాలు శోభనం గారికి తాళం వేసుకొని వెళ్ళాడా? అంటూ ప్రశ్నిస్తాడు. అంతా మీనాని చేసింది అంటూ మీ నాపై నింద వేస్తుంది ప్రభావతి. ఇంతలోనే సత్యం కూడా ఇంటికి చేరుకుంటాడు. 'నా కోసం వెయిట్ చేస్తున్నారా' అని అంటాడు సత్యం. 'మీ కోసమే కాదులేండి.. బాలు శోభనం గదికి తాళం వేసుకొని వెళ్లిపోయాడు' అంటూ అసలు విషయం సత్యం కు చెప్తుంది ప్రభావతి. వెంటనే బాలుకి ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెబుతాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 340 january 20th 2024 here is full story

తాను టూర్ కి వెళ్తున్నానని బాలు అబద్ధం చెబుతాడు. వీధి చివర్లో నీ కారు కనిపించింది. త్వరగా ఇంటికి రా అని ఆర్డర్ వేశాడు. దీంతో తండ్రి మాట కాదనలేక బాలు ఇంటికి వస్తాడు. వెంటనే మీనా వెళ్లి తాళం తీసుకోవచ్చు.. తన అత్తయ్య చేతిలో పెడుతుంది. చూశారా.. మీరు చెప్పారు కాబట్టి బాలు గాడు తాళం ఇచ్చాడు. ఈ పెళ్ళాం మొగుళ్ళు ఇంట్లో వాళ్ళని ఆడుకుంటున్నారు అంటూ నోరు జారుతుంది. అనవసరంగా మీనాను ఇందులోకి లాగొద్దు.. నువ్వు చెప్పినట్లే మీనా ప్రతి పనిని చేస్తుంది కదా అంటూ ప్రభావతి నోరు మూపిస్తాడు సత్యం. సరేలే తొందరగా వారిని ఆశీర్వదించి పంపిస్తా అంటూ ప్రభావతి మాట మారుస్తుంది.

'ఇంట్లో కేవలం ఇద్దరమే లేం.. వాడికంటే మరో ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. అందరూ ఆశీర్వాదం కావాలి. వాడి సంసారం బాగుండాలంటే.. అందరూ ఆశీర్వదించాలి' అని సత్యం అంటాడు. మీనాను వెళ్లి బాలుని ఇంట్లోకి రమ్మని చెప్పమంటాడు. వాడు ఇంట్లోకి వస్తే.. నానా గొడవ చేస్తాడని ప్రభావతి వద్దంటుంది. తప్పు చేసిన వాటిని తిట్టే అధికారం అన్నకు ఉంటుంది. రవి చేసింది ఏమైనా గొప్ప పని అంటూ ప్రభావతిని ప్రశ్నిస్తాడు. దీంతో శృతి రియాక్ట్ అవుతూ.. బాలు వస్తే మళ్ళీ ఏదో ఒక గొడవ చేస్తాడు. అనవసరంగా అందరి మూడ్ పోతుంది అని అంటుంది. 'కుటుంబంలో అందరూ ఒకలాగా ఉండరు. అందరూ ఒక లాగా వ్యవహరించరు. మనమే అందర్నీ కలుపుకొని ముందుకు సాగాలి ఇదే కుటుంబం' అంటూ సత్యం అంటాడు.

'పెద్దలు మీరు ఇద్దరు ఉన్నారు కదా.. మీరు ఆశీర్వదిస్తే మాకు సరిపోతుంది. బాలు అవసరం లేదు. అయినా మీనా ఉంది కదా.. మీ ఆశీర్వదిస్తే చాలు' అని శృతి అంటుంది. లేదమ్మా నిండు కుటుంబం ఉన్నవారు అందరి ఆశీర్వాదం తీసుకోవాలి. అది అదృష్టం.. నా కుటుంబం ఎప్పుడు నిండుగా ఉండాలి. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడలు.. ఇల్లు మొత్తం ఎప్పుడు కలగాలని ఆడాలి' అంటూ సత్యం సమాధానం ఇస్తాడు. వాస్తవానికి బాలు వల్లనే ఈ ఇల్లు నిలబడింది. వాడి వల్లనే.. ఈ ఇల్లు గడుస్తుంది. బాలు లేకుండా తాను ఎలాంటి శుభకార్యం చేయను 'అని సత్యం మారి గురించి గొప్పగా మాట్లాడుతాడు.

మరోవైపు.. తన మామయ్య మాట ప్రకారం బాలు దగ్గరికి వెళ్లి, ఇంట్లోకి రమ్మని రిక్వెస్ట్ చేస్తుంది మీనా. తనకు ఇష్టం లేదని, తాను రెచ్చగొట్టే విధంగా రవి, మనోజ్ లు లేనిపోని మాటలు అన్నారని రవి బాధపడతాడు. అందుకే తాను రూమ్ కు లాక్ వేశానని క్లారిటీ ఇస్తాడు. అవన్నీ విడిచిపెట్టండి వారిని ఆశీర్వదించాలి అని మీనా బతుకులాడుతుంది. కానీ, తనకు ఇష్టం లేదని బాలు చెబుతాడు. మిమ్ములను రమ్మని పిలిచింది మీ నాన్ననే అని మీనా చెబుతుంది. దీంతో బాలు తన తండ్రి మాట కాదనలేక ఇంట్లోకి అయిష్టంగానే వస్తాడు.

బాలు, మీనాలు రాకపోయేసరికి ప్రభావతి నోరు పారేసుకుంటుంది. బాలుగాడికి మీనా ఏం నూరిపోస్తుందో అంటూ నిందిస్తుంది. అనవసరంగా మీనా ను ఎందుకు తిడుతున్నారు కదా అత్తయ్య.. మీనా మీరు చెప్పినట్టే కదా అని శృతి అంటుంది ఇంతలోనే బాలు మీనాలు లోపలికి వస్తారు. ఆ తర్వాత కొత్త దంపతులను తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారు. మనోజ్, రోహిణి కూడా వారిని ఆశీర్వదిస్తారు. బాలు, మీనాలు కూడా ఆశీర్వదించాలి అంటూ వారిని ఆపుతాడు. దీంతో బాలు మీనాలు కూడా ఆశీర్వదించాలి. అని సత్యం అంటాడు.

'కావాలనుకుంటే మీనా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. కానీ, బ్లెస్సింగ్స్ కోసం మేము ఎవరి దగ్గర బెగ్గింగ్ చేయాల్సిన అవసరం లేదంటూ' శృతి ఒకసారిగా బాంబు పిలుస్తుంది. దీంతో బాలు రియాక్ట్ అవుతూ 'చూసావా.. ఆ పొగరు అచ్చు డిఎం గాడి ముక్కులో నుండి ఊడి పడినట్లే ఉంది. ఎంత పొగరుగా మాట్లాడుతుందో.. పెద్దలంటే గౌరవమే లేదు' అని బాలు పంచ్ వేస్తాడు. దీంతో సత్యం కలుగజేసుకొని బాలుని ఆశీర్వదించమని నచ్చ చెప్తాడు. ఇష్టం లేకున్నా బాలు తన తమ్ముడిని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నా ఇల్లు నిండుగా ఉంది అందరూ ఇలానే కలిసిమెలిసి ఉండాలని, అందరూ తమ తప్పులను మరిచిపోయి జాగ్రత్తగా ఉండాలని సత్యం అంటాడు.

ఇంతలోనే శృతి కలగచేసుకొని.. 'మేమేం తప్పు చేయలేదు. మా పెళ్లికి ఇక్కడ మీరు ఒప్పుకోలేదు.. అక్కడ మా వారు ఒప్పుకోలేదు.. అందుకే మేము లేచి పెళ్లి చేసుకున్నాం.. ఇందులో మేము చేసిన తప్పేంటి? అందరూ ఒప్పుకుంటే మేము ఎందుకు సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటా..' అంటూ తన మామయ్యకు ఎదురు మాట్లాడుతుంది శృతి. దీంతో బాలుకి ఎక్కలేని కోపం వస్తోంది.. 'ఆ సురేందర్ గాడు చీర కట్టుకొని వచ్చినట్లు ఉంది 'అని శ్రుతికి పంచ్ వేస్తాడు. 'నువ్వు మాట్లాడింది కరెక్టే అమ్మ.. కానీ, మీరు చేసిన పని వల్ల నామీద మీ నాన్న కేసు పెట్టాడు. నా గురించి తక్కువ చేసి నీచంగా మాట్లాడాడు అని సత్యం అంటాడు.

'అది మేము చేసిన తప్పు కాదు కదా.. అది మీరు మీరు మాట్లాడుకోవాల్సిన విషయం. ఆ విషయాన్ని మాతో ఎందుకు చర్చిస్తున్నారు' అంటూ శృతి గట్టిగా మాట్లాడుతుంది. దీంతో రవి కంగారుపడుతూ.. మా నాన్న మాట్లాడుతున్నాడు కాస్త తగ్గి మాట్లాడు అని సూచిస్తాడు. కానీ, మీ నాన్న మాట్లాడిన దానికి కదా నేను సమాధానం చెప్తున్నాను అంటూ శృతి బదులిస్తుంది. 'సరే మీరు పెళ్లి చేసుకుంటే.. మీనా ను ఎందుకు మధ్యలో లాగారు. మీరు చేసిన తప్పుకు మీనా జీవితం ఆగమయ్యేది. మీరు చేసిన తప్పు వల్ల మీనా ఎన్నో ఇబ్బందులు పడింది' అని సత్యం అంటాడు.

'మా పెళ్లి విషయంలో మీనా ప్రమేయం లేదు. రవి పెద్దల ఆశీర్వాదం కావాలని అనీ, మీనా ను తీసుకువచ్చాడు. కానీ, మీనాకు మా పెళ్ళికి ఎలాంటి సంబంధం లేదు' అంటూ క్లారిటీ ఇస్తుంది శృతి. ఆ తర్వాత అందరిని ఒక దగ్గరికి రమ్మని.. ఈరోజు నుండి మీరు తోడికోడళ్ళు గాకుండా.. అక్క చెల్లెలుగా కలిసిపోవాలని, ఒకరి తప్ప ఒకరు క్షమించుకోవాలని సర్దుకుపోవాలి అంటూ సత్యం చెబుతాడు. దీనికి ముగ్గురు కోడలు సరే అని చెబుతారు దీంతో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X