Gunde Ninda Gudi Gantalu january 21th: శృతి ప్రవర్తనతో ఇంటిల్లిపాది షాక్.. కన్నింగ్ ప్లాన్ చేసిన రోహిణి..

Gunde Ninda Gudi Gantalu january 21th: గుండె నిండా గుడి గంటలు మంగళవారం ఎపిసోడ్లో సత్యం మాట్లాడుతూ ఇప్పుడు తనకు ఎంతో సంతోషంగా ఉందని, ముగ్గురు తోడికోడళ్ళు గా కాకుండా అక్క చెల్లెలు కలిసి ఉండాలని, ఏ సమస్య వచ్చినా కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తాడు.దీంతో మీనా.. సరే మామయ్య ఇకనుండి మేము కలిసి ఉంటాం అంటూ మాట ఇస్తుంది. రోహిణి మాట్లాడుతూ.. ఇలాంటి పెద్ద కుటుంబంలోకి కోడలుగా రావడం తన కూడా సంతోషంగా ఉందని, ఇది తన అదృష్టమని ఓ రేంజ్ లో మాట్లాడుతుంది. ఇక శృతి.. తన మామయ్య సత్యం మాటలకు ఫిదా అవుతుంది. రియల్ గా హానెస్ట్ గా మాట్లాడారంటూ తన మామయ్యను అందరిముందు హగ్ చేసుకుంటుంది. దీంతో ఇంటిలిపాది షాక్ అవుతారు.

ఆ తర్వాత రవి, శృతి శోభనం గదిలోకి వెళ్తారు. తనకు ఎంతో సంతోషంగా ఉందని, నేడు అందరి ఆశీర్వాదం దొరికిందని సంతోషపడతాడు. 'అవును.. మీ బాలు అన్నయ్య కూడా ఆశీర్వదించాడు కదా.. అంటూ శృతి సెటైర్ వేస్తోంది. కాస్త పద్ధతిగా ఉండమని, అనవసరంగా బాలుతో గొడవ పెట్టుకోవాలని, అయినా అందరి ముందు హాగ్ చేసుకోవడం ఏంటని రవి శృతిని క్లాస్ పీకుతాడు.బాలు మాత్రం అలా చేయడం కరెక్టేనా అని శృతి రివర్స్ మాట్లాడుతుంది. ఇంతలో మీనా పాలు తీసుకెళ్లి శ్రుతికి ఇస్తోంది. ఈ సమయంలో రవి తన వదినకు థ్యాంక్స్ చెబుతాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 341 january 21th 2024 here is full story

మరోవైపు బాలు దాబాపై ఒంటరిగా పడుకొని.. తనలో తాను పాట పాడుకుంటాడు. ఇంతలోనే మీనా అక్కడికి వస్తుంది. ఏమైనా తింటారని బాలుని అడుగుతుంది. రవి గాడి బ్రెయిన్ ఫ్రై చేసుకుని తీసుకురా.. తింటానంటూ వెటకారంగా మాట్లాడుతాడు. దీంతో పాపమండి అలా మాట్లాడకండి అంటూ మీనా అంటుంది. ఆ శృతి చూసావా.. అందరి ముందు మా నాన్నను చేసుకుంది. అదే పద్ధతి అని బాలు ఫైర్ అవుతాడు. గొప్ప ఇంట్లో పెరిగిన అమ్మాయి కదా.. ఆమెకు పద్ధతులు సాంప్రదాయాలు తెలియదు. త్వరలోనే నేర్చుకుంటుందిలే అని సర్ది చెప్తుంది మీనా. అయినా శృతి ముందు వాళ్ళ నాన్నను తక్కువ చేసి మాట్లాడకండి బాధపడుతుంది మీనా అంటుంది.

ఆ పిల్ల బాధపడే రకం కాదని అందర్నీ బాధపెట్టే రకమని అంటాడు బాలు. అయినా మీ నాన్న చెప్పింది వినొచ్చు కదా అనవసరంగా లేనిపోని విషయాలలో కలుగజేసుకొని గొడవ పెట్టుకోవద్దని మీనా సూచిస్తుంది. మరోవైపు.. ప్రభావతి ఎప్పుడు లేని విధంగా తన గదిలోకి కొత్త పెళ్లి కూతురులా.. సిగ్గుపడుతూ పాలు పట్టుకొని వస్తుంది. తన శోభనం రోజు రాత్రి గుర్తుకు చేసుకొని తెగ ఫీల్ అవుతుంది ప్రభావతి. ఎప్పుడు అది కాదు గుర్తుకు చేసుకునేది. ఇకముందు ముగ్గురు కోడలు సరిగా చూసుకోమని, ఇకనుండి మనకు కూడా కొత్త బాధితులు వచ్చాయని తల్లిదండ్రులమే కాకుండా అత్తమామలను కూడా అయ్యామని సత్యం అంటాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 341 january 21th 2024 here is full story

అలాగే ముగ్గురు కోడాలను కూడా సమానంగా చూసుకోమని సలహా ఇస్తాడు. తాను మాత్రం ఎంతో సంతోషంగా ఉన్నననీ, అనుకున్నట్లుగానే రోహిణిని మనోజ్ చేసుకోవడం వల్ల మలేషియా సంబంధం వచ్చింది. శృతిని రవి పెళ్లి చేసుకోవడం వల్ల గొప్పేంటి అమ్మాయి తన ఇంట్లో కాలు పెట్టిందని, అలాగే తన కూతురికి గొప్పింటి సంబంధం వచ్చిందని ప్రభావతి సంతోషపడుతుంది. దీంతో సత్యం రియాక్ట్ అవుతూ.. ఇక ముందు బాలుని కూడా నీ కొడుకు అనే విషయాన్ని మర్చిపోవద్దని సత్యం సూచిస్తాడు. వాడు కూడా నన్ను తల్లిగా ఎప్పుడు భావించలేదని ప్రభావతి రిప్లై ఇస్తుంది. అయినా నీతో మాట్లాడితే .. నీ కొడుకు, కోడలు గురించి తెల్లార్లు మాట్లాడుతూనే ఉంటావ్.. నేను ప్రభావతిలాగే ఉంటాను అంటుంది.

మరోవైపు.. రోహిణి పాలు తీసుకుని రూమ్ లోకి వెళుతుంది. దీంతో మనోజ్ శోభనం రోజు రాత్రిని గుర్తు చేసుకుంటూ ఊహల్లో తేలిపోతుంటాడు. మరోసారి శోభనం చేసుకుందామా అంటాడు. సర్లే గాని.. శృతి వచ్చిన నుండి తనకు తన అత్తయ్య ప్రభావతి విలువ ఇవ్వడం లేదని, తనని నెగ్లెక్ట్ చేస్తుందని రోహిణి ఫీల్ అవుతుంది. అదేం లేదు.. నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలువి, నీకు ఉండే గౌరవం నీకు ఉంటుంది. శృతి లోకల్ అయితే.. నువ్వు ఇంటర్నేషనల్. మీ డాడీ ముందు వాళ్ళ డాడీ ఎంత అంటాడు మనోజ్. అయినా.. శృతి కాస్త ఓవర్ చేస్తుందని అందరి ముందు హాగ్ చేసుకోవడం ఏంటి? అంటాడు మనోజ్.

శ్రుతి హై క్లాస్ ఇంట్లో పుట్టింది కదా .. అక్కడి పద్ధతులు ఆచారాలు కొద్దిగా వేరుగా ఉంటాయిలే అంటుంది రోహిణి.. నువ్వు కూడా మలేషియాలో పుట్టి పెరిగావు కదా.. మీ ఆస్తుల ముందు వారి ఆస్తులు ఎంత అంటాడు మనోజ్. అయినా లోకల్ గా ప్రతి వాళ్ళ సపోర్టు ఉంటే.. మన బిజినెస్ కు సపోర్టు ఉంటుంది. ఇంకా.. ఎక్స్పాండ్ చేసుకోవచ్చని అలాగే రవితో నువ్వు కూడా క్లోజ్ గా ఉండమని మనోజ్ కు సూచిస్తుంది రోహిణి. మరోవైపు శోభనం గదిలో రవి వెయిట్ చేస్తూ ఉంటాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 341 january 21th 2024 here is full story

అంతలోనే శృతి సారీ తీసివేసి డ్రెస్ వేసుకొని వస్తుంది. ఏంటి సారీ తీసేసావ్ అని ప్రశ్నించగా.. శారీ కట్టుకోవడం తనకి ఇష్టం లేదని, అయినా మీ మమ్మీ కట్టుకోమంటే కట్టుకున్నాను బదిలిస్తుంది.ఆ తర్వాత రవి మాట్లాడుతూ .. తన నాన్న గురించి తన అన్నయ్య గురించి గొప్పలు చెబుతాడు. ఇక చాల్లే గాని.. నాకు నిద్ర వస్తుంది అంటూ శృతి పడుకో పోతుంది. దీంతో రవి మాటలు మానేసి రొమాన్స్ లోకి దిగిపోతాడు. మరోవైపు బాలు మెడపై ఒంటరిగా పడుకోలేక ఇబ్బంది పడతాడు. కిందికి వచ్చి హాల్లో పడుకున్న మీనా ను లేపి.. మరి దాబా పైకి తీసుకువెళ్తాడు. ఇంతటితో నేటి సీరియల్ ముగుస్తుంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X