Gunde Ninda Gudi Gantalu january 22th: శ్రుతి వల్ల ప్రభావతి పరువు పోయిందిగా.. మౌనికపై సంజుకు అనుమానం..
Gunde Ninda Gudi Gantalu january 22th: గుండె నిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్ లో బాలు తన భార్య మీనా ను దాబా పైకి తీసుకెళ్తాడు. అక్కడ ఆకాశాన్ని చూపిస్తూ ప్రకృతి ఆస్వాదించమని మీనాకు కబుర్లు చెప్తాడు. కానీ, మీనా అలసిపోయి పడుకుంటుంది. ఇక బాలు చేసేది ఏమీ లేకుండా మీనా ను చూస్తూ సైలెంట్ గా పడుకుంటాడు. మరోవైపు.. మౌనిక తన అన్నయ్య బాలు ఇచ్చిన గాజులను చూసుకుంటూ సంతోషం పడుతుంది. ఇంతలోనే సడన్ గా రూమ్ లోకి సంజు వస్తాడు. తాను వస్తే భయపడాలని తెలియదా ముందు వెళ్లి మందు స్టాప్ తీసుకొని రమ్మని ఆర్డర్ వేస్తాడు.
వెంటనే వెళ్లి మౌనిక మందు తీసుకొని వస్తుంది. ఆ సమయంలో మౌనిక చేతులను అబ్జర్వ్ చేసి గాజులు ఎవరిచ్చారు అంటూ నిలదీస్తాడు. మీ అన్న ఇచ్చాడా లేదా మీ అమ్మ ఇచ్చిందా.. ఎవరైనా ఇచ్చారా. అంటూ టార్చర్ చేస్తాడు. ఈ విషయాన్ని గమనించిన సంజు తల్లి వచ్చి ఆ గాజులు నేనే ఇచ్చా అంటూ అక్కడి నుండి తీసుకు వెళుతుంది. ఎందుకురా ఇలా చేస్తున్నావ్ అని నిలదీస్తే.. బాలు గాడికి పిల్లలుగా పుట్టడమే మౌనిక చేసిన తప్పు అంటాడు. అన్ని సర్దుకుంటాయి ధైర్యంగా ఉన్న అమ్మాయి సంజు తల్లి మౌనికాకు ధైర్యం చెప్పి వెళ్ళిపోతుంది.

ఇక తెల్లవారగానే మీనా.. వంటింట్లో బిజీబిజీగా ఉంటుంది. ఇంతలోనే ప్రభావతి వచ్చి అర్జెంటుగా రెండు కప్పుల కాపీ పెట్టమని ఆర్డర్ వేస్తుంది. రెండు ఎవరికైనా అడుగుతే ఒకటి నా కొడుకు మరొకటి నా కోడలుకు అంటూ కంగారు కంగారుగా తీసుకొని వెళ్తుంది. తీరా రూమ్ లోకి వెళ్లి చూసేసరికి.. రవి తన భార్య బట్టలను చదువుతూ ఉంటాడు. ఇలాంటి పనులు చేస్తున్నావేంట్రా అని ఏమైనా పనులు ఉంటే మీ నాకు చెప్పమని అంటుంది. అయినా శృతి ఎక్కడ ఉందని ప్రశ్నిస్తుంది. శృతి వెళ్లిపోయింది అని రవి బదిలిస్తాడు. దీంతో ప్రభావతి కంగారుపడుతుంది రాత్రి ఏమైనా గొడవ జరిగిందా.. ఎందుకు గొడవపడ్డారు. ఇప్పుడే వెంటనే వెళ్లి బ్రతిమిలాడి ఇంటికి తీసుకురమ్మని చెబుతుంది.
ఆ కంగారును గమనించిన రవి అసలు విషయం చెప్తాడు శృతి జాబ్ కోసం వెళ్లిందని డబ్బింగ్ స్టూడియో నుండి కాలువ వస్తే మార్నింగ్ వెళ్ళిపోయిందని చెప్తాడు. ఆయన ఆ విషయం తనకు చెప్పాలి కదా అని నిలదీస్తుంది. తనను శృతి పట్టించుకోవడంలేదని.. ఇలాంటి విషయాలు తనకు నచ్చవు అంటూ .. రోహిణి గాని మీనా కానీ ఎవరు వెళ్ళిన తనకు చెప్పకుండా ఇంట్లో నుండి బయట కాలు పెట్టారని అలాంటిది శృతి ఎలా వెళ్ళిపోతుందని రవిని ప్రశ్నిస్తుంది. ఇంతలోనే సత్యం మార్నింగ్ వాకింగ్ వెళ్లి వస్తాడు. ఏం జరిగిందని ప్రభావతిని నిలదీస్తాడు. శృతి డబ్బింగ్ కి వెళ్ళింది అని బదిలిస్తుంది. కానీ తనకు చెప్పకుండా వెళ్ళిపోయిందని అంటుంది.
కొన్ని విషయాలను చూసి చూడనట్లు పట్టించుకోనట్లు ఉంటేనే గౌరవం దక్కుతుందని, అనవసరంగా చిన్న విషయాలను పెద్దగా చెయ్యొద్దని సూచిస్తాడు. ఇంతలోనే రోహిణి, మనోజ్ కిందికి వస్తారు. శృతి తనకు చెప్పకుండా బయటికి వెళ్లిందని తెలిస్తే వాళ్ల ముందు పరువు పోతుందని, ప్రభావతి మ్యారేజ్ చేస్తుంది. రాత్రి తనకు ఇంగ్లీషులో చెప్పిందని కానీ అర్థం కాలేదు అంటూ కవరింగ్ చేస్తుంది. ఈ విషయాన్ని రవి అర్థం చేసుకోకుండా.. సడన్గా డబ్బింగ్ స్టూడియో నుండి ఫోన్ వస్తే తన కూడా చెప్పకుండా వెళ్ళింది కదా నీకెలా రాత్రి చెప్పింది అని రవి నోరు జారుతాడు. కోడలు ముందు పరువు పోతుందని లేదు లేదు రాత్రి నాకు చెప్పింది కవరింగ్ చేస్తుంది.
ఇంతలోనే మీనా బయటికి నుండి లోపలికి వస్తుంది. శృతి మార్నింగ్ వెళ్ళేటప్పుడు తనకు చెప్పిందని అర్జెంటుగా డబ్బింగ్ స్టూడియో నుండి ఫోన్ వచ్చిందని ఈ విషయాన్ని చెప్పిందని అంటుంది. అప్పటివరకు కవరింగ్ చేసుకుంటున్నా ప్రభావతి పరువు మొత్తం పోతుంది . ఇంకా ఉంటే తన పరువు పోతుందని ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని గమనించిన రోహిణి.. కొత్త కోడలు వచ్చి ఒక రోజు కూడా కాలేదు అత్తయ్యను కేర్ చేయడం లేదంటూ నవ్వుకుంటుంది. ఇంతటితో నేటి సీరియల్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










